Weather Forecast: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం, వచ్చే 5 రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ వర్షాలు, రెండు రాష్ట్రాల్లో ఈ జిల్లాలకు గ్రీన్ అలర్ట్

దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. వచ్చే ఐదు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలోని పలు ప్రాంతాలకు ఎల్లో, గ్రీన్ అలర్ట్ జారీ చేసింది.

Rains (Photo-Twitter)

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. వచ్చే ఐదు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలోని పలు ప్రాంతాలకు ఎల్లో, గ్రీన్ అలర్ట్ జారీ చేసింది. రెండు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని, పలుచోట్ల ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని చెప్పింది. కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో జల్లులు కురిసే అవకాశం ఉందని చెప్పింది.

ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, ఏలూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ ఓ ప్రకటనలో తెలిపింది. తెలంగాణలోని మేడ్చల్, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, నల్లగొండ, రంగారెడ్డి, సూర్యాపేట, హైదరాబాద్, జనగామ, భువనగిరి జిల్లాల్లో పలుచోట్ల వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు.

 వీడియో ఇదిగో, కొడాలి నానిని గుడివాడ సెంటర్లో కట్ డ్రాయర్ మీద ఊరేగిస్తా, గన్నవరంలో నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు

మరోవైపు, తెలంగాణలో మేడ్చల్‌, నల్లగొండ, రంగారెడ్డి, సూర్యాపేట, హైదరాబాద్‌, జనగామ, మహబూబాబాద్‌, వరంగల్‌, హనుమకొండ, భువనగిరి జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని పేర్కొన్నది. ఈ మేరకు ఎల్లో, గ్రీన్‌ అలర్ట్‌ జారీ చేసింది వాతావరణ శాఖ.