UP Horror: క్యాష్ ఆన్ డెలివరీపై రూ.1.5 లక్షల విలువైన ఐఫోన్ ఆర్డర్.. డెలివరీ బాయ్ ఇంటికి రాగానే గొంతు నులిమి ప్రాణాలు తీసి ఫోన్ తీసేసుకున్న ఇద్దరు వ్యక్తులు.. ఉత్తరప్రదేశ్‌ లో దారుణం

డబ్బులు ఇవ్వకుండా ఆ ఫోన్ ను కాజేయాలని కుట్ర చేశారు.

Crime Representational Image (File Photo)

Newdelhi, Oct 1: ఫ్లిప్‌ కార్ట్‌ (Flipkart) బిగ్ బిలియన్ డేస్ లో విక్రయిస్తున్న లక్షల విలువైన ఐఫోన్ (iPhone) పై ఆ ఇద్దరి దుండగుల కన్ను పడింది. డబ్బులు ఇవ్వకుండా ఆ ఫోన్ ను కాజేయాలని కుట్ర చేశారు. అలా  ఐఫోన్ డెలివరీ ఇచ్చేందుకు వెళ్లిన డెలివరీ బాయ్ ను దారుణంగా హత్య చేశారు.  ఈ  సంచలన ఘటన ఉత్తరప్రదేశ్‌ లోని లక్నోలో వెలుగుచూసింది. బాధితుడిని 30 ఏళ్ల భరత్ సాహు గా గుర్తించారు. ఈ వివరాలను డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ శశాంక్ సింగ్ వెల్లడించారు.

కమర్షియల్ గ్యాస్ వినియోగదారులకు షాక్.. మళ్లీ పెరిగిన రేట్లు.. 19 కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ పై రూ.50 మేర పెంచుతున్నట్టు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల ప్రకటన

అసలేం జరిగిందంటే?

నగరంలోని చిన్‌ హాట్‌ ప్రాంతానికి చెందిన గజానన్ అనే వ్యక్తి ఫ్లిప్‌ కార్ట్‌ పై రూ.1.5 లక్షల విలువైన ఐఫోన్‌ ఆర్డర్ పెట్టాడు. క్యాష్ ఆన్ డెలివరీ చెల్లింపు విధానాన్ని ఎంచుకున్నాడు. ఫోన్ డెలివరీ ఇవ్వడానికి వెళ్లిన భరత్ సాహును గొంతు నులిమి చంపేశాడు. దీనికి గజానన్‌ మిత్రుడు ఆకాశ్ సాయపడ్డాడు. హత్య చేసిన అనంతరం మృతదేహాన్ని ఒక గోనె సంచిలో వేసి తీసుకెళ్లి సమీపంలోని ఇందిరా కెనాల్‌ లో పడేశారని పోలీసులు వివరించారు.

'జ‌గ‌న‌న్న తోడు' ప‌థ‌కం పేరు మారుస్తూ ఏపీ స‌ర్కార్‌ ఉత్తర్వులు జారీ.. 'చిరు వ్యాపారులకు సున్నా వడ్డీ రుణాలు'గా మార్చిన ప్ర‌భుత్వం