IPL Auction 2025 Live

Coronavirus Surge: మళ్లీ ఇంకో విమానంలో కరోనా కల్లోలం, ఇటలీ నుండి అమృత్‌సర్‌కు వచ్చిన విమానంలో 173 మందికి పాజిటివ్, నిన్న వేరే విమానంలో వచ్చిన 125 మందికి కోవిడ్

ఇటలీ నుంచి అమృత్‌సర్‌ విమానాశ్రయానికి వస్తున్న ప్రయాణికులు రాగానే కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడం ఇది వరుసగా రెండో ఘటన.

Flight | Representational Image | (File Photo)

New Delhi, Jan 7: రోమ్-అమృత్‌సర్ చార్టర్ ఫ్లైట్‌లో కనీసం 173 మంది ప్రయాణికులు శుక్రవారం ఇండియాకు రాగానే వారిని పరీక్షించిన తర్వాత పాజిటివ్ గా నిర్ధారణ అధికారులు తెలిపారు. ఇటలీ నుంచి అమృత్‌సర్‌ విమానాశ్రయానికి వస్తున్న ప్రయాణికులు రాగానే కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడం ఇది వరుసగా రెండో ఘటన. గురువారం, మిలన్ నుండి అమృత్‌సర్ విమానాశ్రయానికి చేరుకున్న తరువాత 125 మంది ప్రయాణికులను పరీక్షిస్తే పాజిటివ్ అని తేలింది.

అమృత్‌సర్ విమానాశ్రయం డైరెక్టర్ వికె సేథ్ శుక్రవారం పిటిఐతో మాట్లాడుతూ, "210 మంది ప్రయాణీకుల పరీక్ష ఫలితాలు వచ్చాయి. వారిలో మొత్తం 173 మంది ప్రయాణికులు పాజిటివ్ గా నిర్థారణ అయింది. ఈ విమానం రోమ్ నుండి వచ్చింది. ఇది ఈ రోజు మధ్యాహ్నం 12.20 గంటలకు విమానాశ్రయంలో దిగింది," అని తెలిపారు. శుక్రవారం ల్యాండ్ అయిన చార్టర్ ఫ్లైట్‌లో మొత్తం 285 మంది ప్రయాణికులు ఉన్నట్లు అధికారులు తెలిపారు.

అమృత్‌స‌ర్‌ విమానంలో కరోనా కల్లోలం, మొత్తం 179 మంది ప్రయాణికుల్లో 125 మందికి పాజిటివ్

పాజిటివ్‌గా గుర్తించిన మొత్తం 173 మంది ప్రయాణికులను వారి స్వంత పట్టణ జిల్లాలకు సంస్థాగత నిర్బంధానికి పంపుతున్నట్లు జిల్లా ఆరోగ్య అధికార అధికారులు తెలిపారు. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ నిబంధనల ప్రకారం, "ప్రమాదంలో ఉన్న" దేశాల నుండి భారతదేశానికి వచ్చే ప్రయాణీకులు విమానాశ్రయానికి చేరుకున్నప్పుడు తప్పనిసరిగా COVID-19 కోసం పరీక్షించబడాలి. ఇటలీతో సహా అన్ని యూరోపియన్ దేశాలను కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ "ప్రమాదకర" దేశాలుగా పరిగణించింది.



సంబంధిత వార్తలు

Covid-Cancer Link: కరోనా మంచే చేస్తున్నది.. ప్రాణాంతక క్యాన్సర్ పని పడుతున్నది.. క్యాన్సర్‌ కణాలపై పోరాడే ప్రత్యేక మోనోసైట్లను ఉత్పత్తి చేస్తున్న కొవిడ్.. ఇంగ్లండ్‌ శాస్త్రవేత్తల పరిశోధనలో వెల్లడి

Telangana: వీడియో ఇదిగో, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో ప్రయాణికులు ఆందోళన, వారంలో ఒకసారి ఉండే జమ్ము తావి ఎక్స్‌ప్రెస్ రద్దు కావడంపై నిరసన

Can COVID Cause Erectile Dysfunction? COVID-19 అంగస్తంభన లోపానికి కారణమవుతుందా? డాక్టర్లు ఏమంటున్నారో తెలుసుకోండి

New Guidelines for Air Passengers: విమాన ప్రయాణికులకు కీలక మార్గదర్శకాలు జారీ చేసిన కేంద్రం, ఇకపై ఫ్లైట్స్ భూమట్టానికి 3,000 మీటర్ల ఎత్తుకు చేరుకున్న తర్వాతే వైఫై సేవలకు అనుమతి