పంజాబ్‌లోని అమృత్‌స‌ర్‌ విమానాశ్రయంలోకి వ‌చ్చిన చార్టర్డ్‌ విమానంలో క‌రోనా క‌ల‌క‌లం రేగింది. గురువారం ఇట‌లీ నుంచి అమృత్స‌ర్‌కు చార్టర్డ్‌ ప్లైట్‌లో వ‌చ్చిన ప్రయాణికులను పరీక్షల జరుపగా అందులో 125 మందికి క‌రోనా నిర్థారణ అయినట్లు అధికారులు తెలిపారు. దీంతో వీరి శాంపిల్స్‌ను జీనోమ్ సీక్వెన్స్‌కు పంపారు. విమానంలో మొత్తం 179 మంది ప్రయాణికులు ఉన్నారు. పాజిటివ్‌గా తేలిన ప్రయాణికులను ఇన్‌స్టిట్యూషనల్ క్వారంటైన్‌కు పంపిస్తామని రాష్ట్ర ఆరోగ్య అధికారులు తెలిపారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)