హైదరాబాద్‌లో ఎస్‌ఆర్ నగర్ చౌరస్తా వద్ద అర్ధరాత్రి సమయంలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో మంటలు చెలరేగాయి. మియాపూర్ నుంచి విజయవాడకు వెళ్తున్న బస్సులో మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమౌన డ్రైవర్ రోడ్డుపై బస్సును ఆపి ప్రయాణికులను సురక్షితంగా కిందకు దించారు. బస్సులోని ఏసీ విభాగం నుంచి మంటలు వ్యాపించడంతో క్రమంగా బస్సు పూర్తిగా దగ్ధమైంది. సమాచారం అందుకున్న హైదరాబాద్ అగ్నిమాపక సిబ్బంది రెండు ఫైర్ ఇంజిన్లతో మంటలను ఆర్పి, మరింత నష్టాన్ని నివారించారు.
ఈ ప్రమాదంతో కూకట్‌పల్లి–పంజాగుట్ట మధ్య రహదారి ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఎస్‌ఆర్ నగర్ మెట్రో స్టేషన్ పొగతో నిండిపోయింది. అయితే, అప్పటికే మెట్రో సర్వీసులు నిలిచిపోవడంతో ప్రయాణికులకు పెద్ద ఇబ్బంది ఎదుర్కోవాల్సిన అవసరం రాలేదు. ప్రమాదానికి కారణం.. బస్సు ఏసీ విభాగంలో మంటలు చెలరేగడమే అని అధికారులు తెలిపారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనలో ప్రయాణికులను కాపాడిన డ్రైవర్‌ను అందరూ ప్రశంసిస్తున్నారు.
Fire Breaks Out in Private Travel Bus in SR Nagar
ఎస్.ఆర్.నగర్ మెట్రో స్టేషన్ వద్ద భారీ అగ్ని ప్రమాదం
మియాపూర్ నుంచి విజయవాడ వెళ్తున్న ప్రైవేట్ బస్సులో ఒక్కసారిగా చెలరేగిన మంటలు
ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సిఉంది pic.twitter.com/ehX1OnLUGq
— Telugu Scribe (@TeluguScribe) September 26, 2025
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)