2-DG: కరోనా పేషెంట్లకు ఆక్సిజన్ అవసరం లేని మెడిసిన్, 2-డీజీ ఔషధాన్ని తీసుకువచ్చిన డీఆర్డీవో, డీఆక్సీ డి గ్లూకోజ్‌కు అత్యవసర వినియోగ అనుమతులు మంజూరు చేసిన డీసీజీఐ

దేశంలో కరోనావైరస్ సెకండ్ వేవ్ కల్లోలం రేపుతున్న నేపథ్యంలో భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) కరోనా చికిత్స కోసం ఓ సరికొత్త ఔషధాన్ని తీసుకువచ్చింది. దీని పేరు 2 డీఆక్సీ డి గ్లూకోజ్... సంక్షిప్తంగా 2-డీజీ (2-DG) అంటారు. 2-డీజీ ఔషధానికి భారత ఔషధ నియంత్రణ సంస్థ (డీసీజీఐ) అత్యవసర వినియోగ అనుమతులు మంజూరు (DCGI Approves Anti-COVID-19 Oral Drug) చేసింది.

2-DG Oral Drug. (Photo Credits: Twitter@PBNS_India)

New Delhi, May 8: దేశంలో కరోనావైరస్ సెకండ్ వేవ్ కల్లోలం రేపుతున్న నేపథ్యంలో భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) కరోనా చికిత్స కోసం ఓ సరికొత్త ఔషధాన్ని తీసుకువచ్చింది. దీని పేరు 2 డీఆక్సీ డి గ్లూకోజ్... సంక్షిప్తంగా 2-డీజీ (2-DG) అంటారు.

2-డీజీ ఔషధానికి భారత ఔషధ నియంత్రణ సంస్థ (డీసీజీఐ) అత్యవసర వినియోగ అనుమతులు మంజూరు (DCGI Approves Anti-COVID-19 Oral Drug) చేసింది. ఈ ఔషధాన్ని డీఆర్డీవోకు చెందిన ఓ ప్రయోగశాల, ఇన్ స్టిట్యూట్ ఆఫ్ న్యూక్లియర్ మెడిసిన్ అండ్ అల్లైడ్ సైన్సెస్ (ఇన్మాస్), డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ సంయుక్తంగా అభివృద్ధి చేశాయి.

ఈ ఔషధాన్ని వాడిన కరోనా రోగులు (Covid Patients) వేగంగా కోలుకుంటున్నట్టు క్లినికల్ ట్రయల్స్ నిరూపించినట్టు వెల్లడైంది. 2-డీజీ ఔషధాన్ని తీసుకున్న రోగులకు ఆక్సిజన్ పై ఆధారపడాల్సిన అవసరం రాలేదని గుర్తించారు. ఈ ఔషధంతో చికిత్స పొందిన కరోనా రోగుల్లో చాలామందికి స్వల్పకాలంలోనే ఆర్టీ-పీసీఆర్ టెస్టులో నెగెటివ్ వస్తోందని డీఆర్డీవో వెల్లడించింది. వైరస్ పెరుగుదలను ఇది కట్టడి చేస్తోందని తెలిపింది.

తెలంగాణలో మూడు ప్రమాదకర వేరియంట్లు, బెల్లంపల్లి ఐసొలేషన్‌ కేంద్రంలో ఊపిరాడక 12 మంది మృతి

హైదరాబాద్లో‌ని డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ సహకారంతో ఢిల్లీలోని ఐఎన్‌ఎంఏఎస్‌ (ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూక్లియర్ మెడిసిన్ అండ్ అలైడ్ సైన్సెస్) ల్యాబ్‌ రూపొందించిన యాంటీ కరోనా డ్రగ్‌కు అనుమతి సాధించింది. ఇప్పటికే నిర్వహించిన క్లినికల్‌ ట్రయల్స్‌ అద్భుతమైన ఫలితాల నేపథ్యంలో అత్యవసర ఉపయోగం కోసం యాంటీ-కోవిడ్ 2-డియోక్సీ-డి-గ్లూకోజ్ (2-డీజీ) ఔషధానికి డీసీజీఐ అనుమతి మంజూరు చేసింది.

పెను ముప్పుగా మారిన సెకండ్ వేవ్‌, 14 రాష్ట్రాల్లో పూర్తి స్థాయి లాక్‌డౌన్, మిగతా రాష్ట్రాల్లో నైట్, డే కర్ఫ్యూలు, నిన్న కొత్తగా నాలుగు లక్షలు దాటిన కోవిడ్ కేసులు, ఒక్కరోజే 4,187 మంది కరోనా కారణంగా మృతి

తీవ్రమైన కోవిడ్‌ బాధితుల్లో ఈ మందు అమోఘంగా పని చేస్తుందని, వేగంగా కోలుకోవడంతోపాటు ఆక్సిజన్‌పై అధారపడటాన్ని గణనీయంగా తగ్గిస్తుందని డీఆర్‌డీవో తాజాగా ప్రకటించింది.గ్లూకోజ్‌ రూపంలో ఉండే 2-డీజీ ఔషధాన్ని దేశంలో సులభంగా ఉత్పత్తి చేయడంతోపాటు, విరివిగా అందుబాటులో తీసుకురాచ్చని కంపెనీ చెబుతోంది. ఈ డ్రగ్‌ సాజెట్‌లలో పొడి రూపంలో లభిస్తుంది. దీన్ని నీటిలో కరిగించి నోటి ద్వారా తీసుకోవాలి. ఇది వైరస్‌ వ్యాపించిన భాగాల్లోకి చేరి అక్కడ సెల్స్‌లోని కరోనా శక్తిని అడ్డుకోవడంతోపాటు, విస్తరణను గణనీయంగా నిరోధిస్తుంది.

Here's DRDO Tweet

ఐఎన్‌ఎంఏఎస్- డీఆర్‌డీవో శాస్త్రవేత్తలు హైదరాబాద్ సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ) సహాయంతో ప్రయోగాల్లో వైరస్‌కు వ్యతిరేకంగా సమర్థవంతంగా పనిచేస్తుందని తేలింది. దీంతో గత ఏడాది మేలో కోవిడ్ -19 రోగులలో పరీక్షలకు డీసీజీఐ, సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సిడిస్కో) రెండో దశకు అనుమతినిచ్చింది. వీటి ఫలితాల ఆధారంగా డిసెంబర్ 2020 - మార్చి 2021 మధ్య 220 మంది రోగులపై మూడో క్లినికల్ ట్రయల్ నిర్వహించారు.

కరోనా మాటున మరో పెను ముప్పు, కోలుకున్నవారిపై బ్లాక్‌‌ ఫంగస్‌ దాడి, మ్యుకోర్‌‌మైకోసిస్‌ సోకి చూపును కోల్పోతున్న పేషెంట్లు, ఈ వ్యాధి ఎలా సోకుతుంది, బ్లాక్‌‌ ఫంగస్‌ లక్షణాలు ఎలా ఉంటాయో ఓ సారి తెలుసుకోండి

ముఖ్యంగా ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, రాజస్థాన్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు గుజరాత్‌కు చెందిన 27 కోవిడ్‌ ఆసుపత్రులలో ప్రయోగాలను విజయవంతంగా పూర్తి చేసింది. '2-డియోక్సీ-డి-గ్లోకోజ్' (2-డీజీ)గా వ్యవహరిస్తున్న ఈ యాంటీ-కోవిడ్-19 చికిత్స ఔషధాన్ని కోవిడ్ బాధితుల మీద పరీక్షించినప్పుడు వారిలో అత్యధిక శాతం మందికి ఆర్‌టీ పీసీఆర్ పరీక్షల్లో నెగెటివ్ ఫలితాల వచ్చాయి. ఈ ఫలితాల వివరణాత్మక డేటాను డీసీజీఐకి సమర్పించిన నేపథ్యంలో తాజా అనుమతి లభించింది.

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now

సంబంధిత వార్తలు

Gorantla Madhav: గోరంట్ల మాధవ్‌కు నోటీసులు ఇచ్చిన విజయవాడ పోలీసులు, అత్యాచార బాధితుల గుర్తింపు బహిర్గతం చేశారని వాసిరెడ్డి పద్మ ఫిర్యాదు, మార్చి 5న విచారణకు హాజరుకావాలని ఆదేశాలు

ICC Champions Trophy 2025: ఒక్క మ్యాచ్ గెలవకుండానే ఛాంపియ‌న్స్ ట్రోఫీ నుంచి ఇంటిదారి పట్టిన డిఫెండింగ్ చాంపియన్‌, బంగ్లా కూడా రేసు నుంచి ఔట్, ఒక్క బాల్ పడకుండానే నేటి మ్యాచ్ రద్దు

'Torture' Allegations on Rajamouli: రాజమౌళి కోసం నేను పెళ్ళి కూడా చేసుకోలేదు, దారుణంగా వాడుకుని వదిలేశాడు, జక్కన్నపై స్నేహితుడు ఉప్పలపాటి శ్రీనివాసరావు సంచలన ఆరోపణల వీడియో ఇదిగో..

KJ Yesudas Hospitalised? ప్రముఖ గాయకుడు యేసుదాస్ అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారంటూ వార్తలు, ఖండించిన కొడుకు విజయ్ యేసుదాస్, నాన్న అమెరికాలో ఆరోగ్యంగా ఉన్నారని ప్రకటన

Share Now