Anti Paper Leak Law: నీట్, యూజీసీ-నెట్ పరీక్ష పేపర్ లీకుల నేపథ్యంలో అమల్లోకి వచ్చిన పేపర్ లీకుల నిరోధక చట్టం.. నిందితులకు రూ. కోటి వరకూ జరిమానా.. గరిష్ఠంగా పదేళ్ల జైలు శిక్ష

కేంద్రం వ్యవహారశైలి, లీకులకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా విద్యార్థులు పెద్దయెత్తున నిరసన ప్రదర్శనలు చేస్తున్నారు.

exams students

Newdelhi, June 22: నీట్ (NEET), యూజీసీ-నెట్ (UGC-NET) పరీక్ష పేపర్ లీకుల (Paper leaks) అంశం దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం సృష్టిస్తున్నది. కేంద్రం వ్యవహారశైలి, లీకులకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా విద్యార్థులు పెద్దయెత్తున నిరసన ప్రదర్శనలు చేస్తున్నారు. దోషులను వెంటనే అరెస్టు చేసి శిక్షించాలని డిమాండ్లు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో లీకుల నేరాలకు అడ్డుకట్ట వేసేందుకు కేంద్రప్రభుత్వం కొత్త చట్టం అమల్లోకి తెచ్చింది. ది పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (ప్రివెన్షన్ ఆఫ్ అన్‌ ఫెయిర్ మీన్స్) యాక్ట్ - 2024ను శుక్రవారం నోటిఫై చేసింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో చట్టం చేసినా ఎన్నికల హడావుడి మొదలుకావడంతో అమలు తేదీని ప్రకటించలేదు. తాజాగా ఈ చట్టాన్ని అమల్లోకి తెస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది.

బాపట్ల జిల్లాలో దారుణం, యువతిపై అత్యాచారం చేసి అనంతరం చంపేసిన కామాంధులు, ఘటనపై హోంమంత్రికి చంద్రబాబు కీలక ఆదేశాలు

శిక్షలు ఇవే..

కొత్త చట్టం ప్రకారం.. ఎవరైనా చట్టవిరుద్ధంగా పరీక్ష పేపర్లు అందుకున్నా, ప్రశ్నలు, జవాబులను లీక్ చేసినా, కంప్యూటర్ నెట్‌ వర్క్‌ ను ట్యాంపరింగ్ చేసినా, నకిలీ పరీక్షలు నిర్వహించినా నేరంగా పరిగణిస్తారు. నిందితులకు 5 నుంచి 10 ఏళ్ల వరకూ జైలు శిక్ష, రూ.కోటి వరకూ జరిమానా విధిస్తారు. నిందితులు వ్యవస్థీకృత నేరానికి పాల్పడినట్టైతే వారి ఆస్తులను జప్తు చేస్తారు.

జార్ఖండ్‌లో దారుణం, అన్నా నొప్పి అంటూ ఏడుస్తున్నా వదలని కామాంధులు, 8 ఏళ్ళ బాలికపై పదే పదే గ్యాంగ్ రేప్, ఆపై గొంతు కోసి దారుణ హత్య



సంబంధిత వార్తలు

Telangana HC Cancels GO No 16: కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తూ జారీ చేసిన జీవోను రద్దు చేసిన తెలంగాణ హైకోర్టు, ఇక నుంచి భర్తీ చేసే ఉద్యోగాలన్నీ చట్ట ప్రకారం చేయాలని ఆదేశాలు

Andhra Pradesh Shocker: విశాఖలో లా స్టూడెంట్‌పై సామూహిక అత్యాచారం కేసులో షాకింగ్ నిజాలు, ప్రేమించిన ప్రియుడే ఆమె పాలిట రాక్షసుడిగా స్నేహితులకు..

SC on Recruitment Rules for Govt Jobs: రిక్రూట్‌మెంట్‌ మధ్యలో రూల్స్ మార్చకూడదు, ప్రభుత్వ ఉద్యోగ నియామక ప్రక్రియ నిబంధనలపై సుప్రీంకోర్టు కీలక తీర్పు

Andhra Pradesh: అన్నమయ్య జిల్లాలో పలు మండలాల్లో తీవ్ర కరువు పరిస్థితులు, కరవు మండలాల జాబితాను విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం, మొత్తం 5 జిల్లాల్లో 54 కరువు మండలాలు