Padma Awards 2023: తెలుగు రాష్ట్రాల నుంచి పద్మ పురస్కారాలు దక్కింది వీరికే! తెలంగాణ నుంచి ఐదుగురికి, ఆంధ్రప్రదేశ్‌ నుంచి ఏడుగురికి పద్మ అవార్డులు

దేశ అత్యున్నత పౌర పురస్కారాలైన పద్మ అవార్డులను (Padma awards 2023) కేంద్రం ప్రకటించింది.ఈ ఏడాది కూడా కేంద్ర ప్రభుత్వం 106 మందికి పద్మ అవార్డులు ప్రకటించింది. అందులో ఆరుగురు పద్మ విభూషణ్, 9 మంది పద్మ భూషణ్, 91 మంది పద్మశ్రీ అవార్డులకు ఎంపికయ్యారు.

Padma Awards 2023 Photo: Twitter

Hyderabad, JAN 26: దేశ అత్యున్నత పౌర పురస్కారాలైన పద్మ అవార్డులను (Padma awards 2023) కేంద్రం ప్రకటించింది. ప్రతి ఏటా రిపబ్లిక్ డే ను (Republic day) పురస్కరించుకుని వివిధ రంగాల్లో విశేష ప్రతిభ చూపిన వ్యక్తులకు కేంద్రం ఈ అత్యున్నత అవార్డులు ఇవ్వడం ఆనవాయితీ. ఈ ఏడాది కూడా కేంద్ర ప్రభుత్వం 106 మందికి పద్మ అవార్డులు ప్రకటించింది. అందులో ఆరుగురు పద్మ విభూషణ్, 9 మంది పద్మ భూషణ్, 91 మంది పద్మశ్రీ అవార్డులకు ఎంపికయ్యారు. రాష్ట్రపతి ఆమోదంతో కేంద్ర హోంశాఖ పద్మ పురస్కారాల జాబితాను విడుదల చేసింది. కళలు, సామాజిక సేవ, సైన్స్ అండ్ ఇంజినీరింగ్, ప్రజా వ్యవహారాలు, వాణిజ్యం, వైద్యం, సాహిత్యం, విద్య, క్రీడలు, పౌరసేవ రంగాల్లో విశేష సేవలు అందించిన వ్యక్తులందరికి ఈసారి పద్మ పురస్కారాలు వరించాయి. తెలుగు రాష్ట్రాల నుంచి మొత్తం 12మందిని పద్మ పురస్కారాలు వరించాయి. తెలంగాణ నుంచి ఇద్దరికి పద్మభూషణ్ (Padma Bhushan), ముగ్గురికి పద్మశ్రీ అవార్డులు (Padma Sri) దక్కాయి. ఏపీ నుంచి ఏడుగురిని పద్మశ్రీ అవార్డులకు ఎంపిక చేసింది కేంద్రం.

తెలంగాణ నుంచి ఆధ్యాత్మిక విభాగంలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త చినజీయర్‌ స్వామి (Chinna Jeeyar), కమలేశ్‌ డి పటేల్‌ (Kamlesh D Patel) పద్మభూషణ్‌ పురస్కారానికి ఎంపికయ్యారు. మోదడుగు విజయ్‌ గుప్తా(సైన్స్ అండ్ ఇంజినీరింగ్), హనుమంతరావు పసుపులేటి(మెడిసిన్), బి.రామకృష్ణారెడ్డిని(ఎడ్యుకేషన్) పద్మశ్రీ వరించింది.

ఆంధ్రప్రదేశ్ నుంచి ఏడుగురు ప్రతిష్టాత్మక పద్మ పురస్కారాలకు ఎంపికయ్యారు. ఆర్ట్ (కళలు) విభాగంలో ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి, సీవీ రాజు, కోటా సచ్చిదానంద శాస్త్రిలను పద్మశ్రీ వరించింది. గణేశ్‌ నాగప్ప కృష్ణరాజనగరా, అబ్బారెడ్డి నాగేశ్వరరావులకు సైన్స్ అండ్ ఇంజినీరింగ్ విభాగంలో పదశ్రీ వచ్చింది. సాహిత్యంలో ప్రకాశ్‌ చంద్రసూద్ కు‌, సామాజిక సేవకుగాను సంకురాత్రి చంద్రశేఖర్‌ కు పద్మశ్రీ పురస్కారం దక్కింది.

Telangana IPS Reshuffle: ఎలక్షన్స్ కోసం రెడీ అవుతున్న సీఎం కేసీఆర్, ఒకేరోజు 91 మంది పోలీసు ఆఫీసర్ల బదిలీ, పలు జిల్లాల ఎస్పీలను మార్చుతూ ఉత్తర్వులు 

ఆర్ఆర్ఆర్ సినిమాకు అద్భుతమైన బాణీలు సమకూర్చిన కీరవాణిని (M. M. Keeravani) కేంద్రం పద్మశ్రీ పురస్కారంతో గౌరవించింది. ఇక.. నాటు నాటు పాటతో కీరవాణి పేరు విశ్వవ్యాప్తం కూడా అయ్యింది. కీరవాణి స్వర పరిచిన నాటు నాటు పాట ఆస్కార్ బరిలో ఉత్తమ గీతం విభాగంలో నామినేట్ అయి చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. మన దేశం తరపున ఓ భారతీయ చిత్రం ఆస్కార్ కు నామినేట్ కావడం ఇదే తొలిసారి.

పద్మ విభూషణ్‌గ్రహీతలు

బాలకృష్ణ దోషి (గుజరాత్‌)-ఆర్కిటెక్చర్‌ (మరణానంతరం )

ప్రముఖ తబలా విద్వాంసుడు జాకీర్‌ హుస్సేన్‌ (మహారాష్ట్ర) -ఆర్ట్స్

కేంద్ర మాజీమంత్రి ఎస్‌ఎం కృష్ణ (కర్ణాటక )-పబ్లిక్‌ అఫైర్స్‌

దిలీప్‌కుమార్‌ (మెడిసిన్‌)-పశ్చిమ బెంగాల్‌

శ్రీనివాస్‌ వరదాన్‌ (అమెరికా) – సైన్స్‌ అండ్‌ ఇంజనీరింగ్‌

ములాయం సింగ్‌ యాదవ్‌ (ఉత్తర ప్రదేశ్‌)-పబ్లిక్‌ అపైర్స్‌ (మరణానంతరం )

పద్మ భూషణ్‌ గ్రహీతలు

ఎస్‌ఎల్‌ భైరప్ప ( కర్ణాటక ) – లిటరేచర్‌ అండ్‌ ఎడ్యుకేషన్‌

కుమార మంగళం బిర్లా ( మహారాష్ట్ర ) ట్రేడ్‌ అండ్‌ ఇండస్ట్రీ

దీపక్ ధార్‌ ( మహారాష్ట్ర ) – సైన్స్‌ అండ్‌ ఇంజనీరింగ్

వాణి జయరాం ( తమిళనాడు ) ఆర్ట్‌

చినజీయర్‌ స్వామి ( తెలంగాణ ) – ఆధ్యాత్మికం

సుమన్‌ కల్యాణ్‌పూర్ ( మహారాష్ట్ర ) – ఆర్ట్‌

కపిల్‌ కపూర్‌ (ఢిల్లీ ) – లిటరేచర్‌ అండ్‌ ఎడ్యుకేషన్‌

సుధామూర్తి (కర్ణాటక ) – సామాజిక సేవ

కమలేశ్‌ డి. పటేల్‌ ( తెలంగాణ ) – ఆధ్యాత్మికం

తెలంగాణ నుంచి

* మోదడుగు విజయ్‌ గుప్తా (సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌ విభాగం)

* హనుమంతరావు పసుపులేటి (వైద్యం)

* బి.రామకృష్ణారెడ్డి (సాహిత్యం, విద్య)

ఆంధ్రప్రదేశ్‌ నుంచి

* ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి (కళలు)

* కోట సచ్చిదానంద శాస్త్రి (కళలు‌)

* సీవీ రాజు (కళలు)

* గణేశ్‌ నాగప్ప కృష్ణరాజనగర (సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌)

* అబ్బారెడ్డి నాగేశ్వరరావు (సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌)

* సంకురాత్రి చంద్రశేఖర్‌ (సామాజిక సేవ)

* ప్రకాశ్‌ చంద్రసూద్‌ (సాహిత్యం, విద్య విభాగం)

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Andhra Pradesh Bus Accident: కర్నూలు జిల్లాలో కర్ణాటక బస్సు బీభత్సం, రెండు ద్విచక్ర వాహనాలపై దూసుకెళ్లడంతో నలుగురు మృతి

Vallabhaneni Vamsi Case: వల్లభనేని వంశీకి ఊరట, మరోసారి విచారించేందుకు కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు వేసిన పిటిషన్ కొట్టివేత, బెయిల్ పిటిషన్‌ పై విచారణ 12కి వాయిదా

Pranay 'Honour Killing' Case: ఆరేళ తర్వాత ప్రణయ్ హత్య కేసులో కీలక తీర్పు, ఒకరికి ఉరి, ఆరుగురికి జీవితఖైదు విధించిన నల్గొండ కోర్టు, 2018లో జరిగిన మిర్యాలగూడ పరువు హత్య కేసు వివరాలు ఇవే..

CM Revanth Reddy: ఆత్మగౌరవంలోనే కాదు.. త్యాగంలోనూ పద్మశాలీలు ముందుంటారు, సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు, ఆసిఫాబాద్ మెడికల్ కాలేజీకి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెడుతున్నట్లు ప్రకటన

Advertisement
Advertisement
Share Now
Advertisement