Hyderabad, JAN 26: తెలంగాణలో భారీగా ఐపీఎస్‌లను బదిలీ (IPS transfers) చేసింది ప్రభుత్వం. పోలీస్‌శాఖను ప్రభుత్వం పూర్తిగా పునర్వ్యవస్థీకరించింది. రాష్ట్ర చరిత్రలో తొలిసారి ఏకంగా 91 మంది పోలీస్ ఉన్నతాధికారులను ఒకేరోజు బదిలీ చేస్తూ బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. 51 మంది ఐపీఎస్‌లు, 40 మంది నాన్-క్యాడర్ ఎస్పీలను ప్రభుత్వం వివిధ ప్రాంతాలకు బదిలీ (Telangana government) చేసింది. 2006 నుంచి 2020 వరకు వివిధ బ్యాచ్‌లకు చెందిన ఐపీఎస్‌లకు పోస్టింగులు ఇచ్చింది. రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత మారిన పరిపాలన స్వరూపానికి అనుగుణంగా పోలీసు అధికారులను కేటాయించారు. పలు జిల్లాల్లో చాలాకాలంగా పనిచేస్తున్న ఎస్పీలకు స్థానచలనం కల్పించారు. పలు కమిషనరేట్ల కమిషనర్లకూ బదిలీలు తప్పలేదు. పలువురు సీనియర్ ఐపీఎస్ అధికారులకు బదిలీలు, పోస్టింగులు కల్పించింది ప్రభుత్వం.
కరీంనగర్, రామగుండం సీపీలు, నల్గొండ, సిరిసిల్ల, వనపర్తి, మహబూబ్‌నగర్ ఎస్పీలు బదిలీ అయినవారి జాబితాలో ఉన్నారు. రాచకొండ సంయుక్త కమిషనర్‌గా సత్యనారాయణ (Satyanarayana), హైదరాబాద్ సంయుక్త కమిషనర్‌గా గజరావు భూపాల్ (Gajarao Bhupal), రామగుండం కమిషనర్‌గా రెమా రాజేశ్వరి (Rema Rajeshwari), రామగుండం సీపీగా సుబ్బారాయుడిని (Subbarayudu) నిమించింది ప్రభుత్వం. మల్కాజిగిరి డీసీపీగా జానకి ధరావత్‌ను నియమించింది. GHMC ఎన్‌ఫోర్స్‌మెంట్ విజిలెన్స్ డైరెక్టర్‌గా ప్రకాశ్‌రెడ్డి, రాచకొండ ట్రాఫిక్ డీసీపీగా అభిషేక్ మహంతి, శాంతి భద్రతల ఏఐజీగా సన్‌ప్రీత్ సింగ్, ఇంటెలిజెన్స్ ఎస్పీగా విజయ్‌కుమార్,సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఎస్పీగా విశ్వజిత్ కంపాటిని నియమించింది. విజిలెన్స్ ఎస్పీగా అన్నపూర్ణ, మహిళా భద్రతా విభాగం ఎస్పీగా పద్మజ, పోలీసు అకాడమీ డిప్యూటీ డైరెక్టర్‌గా జానకి షర్మిల, నల్గొండ ఎస్పీగా అపూర్వరావు, సీఐడీ ఎస్పీగా యాదగిరి, వనపర్తి ఎస్పీగా రక్షితామూర్తి, జోగులాంబ గద్వాల్ ఎస్పీగా సృజన, మహబూబ్‌నగర్ ఎస్పీగా నరసింహ, ఖమ్మం సీపీగా సురేష్, జగిత్యాల ఎస్పీగా భాస్కర్, ములుగు ఎస్పీగా గౌస్ అలం, రాజన్న సిరిసిల్ల ఎస్పీగా అఖిల్ మహజన్‌ను నియమించారు.
ఆర్టీసీ విజిలెన్స్ ఎస్పీగా పాటిల్ సంగ్రామ్ సింగ్, యాదాద్రి డీసీపీగా రాజేశ్ చంద్ర, సీఐడీ ఎస్పీలుగా ఎం.నారాయణ, వి. తిరుపతి, హైదరాబాద్ దక్షిణ మండల డీసీపీగా సాయి చైతన్య, హైదరాబాద్ క్రైమ్ డీసీపీగా శబరిశ్, హైదరాబాద్ సౌత్ వెస్ట్ జోన్ డీసీపీగా కె.కె ప్రభాకర్, హైదరాబాద్ సౌత్ ఈస్ట్ జోన్ డీసీపీగా రూపేశ్ బదిలీ అయిన వారిలో ఉన్నారు. ఒకే నెలలో రెండుసార్లు పెద్దసంఖ్యలో ఐపీఎస్‌లు బదిలీలు అయ్యారు. జనవరి 4వ తేదీన 29 మంది ఐపీఎస్‌ల బదిలీలు కాగా, తాజాగా 92 మందిని బదిలీలు, పోస్టింగ్‌లు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వీటిలో లాంగ్ స్టాండింగ్ పీరియడ్‌లో ఉన్నవారిని ట్రాన్స్‌ఫర్ చేశారు. ఐతే ఎన్నికల సమయం దగ్గరపడుతుండటంతో భారీగా ఐపీఎస్‌ల బదిలీలు జరిగాయని భావిస్తున్నారు.