TSPSC notifies 1,392 junior lecturer posts

Hyd, Jan 23: తెలంగాణలో ఉద్యోగులకు డియర్నెస్‌ అలవెన్స్‌ను ప్రకటించింది ప్రభుత్వం. ఒక డీఏ మంజూరు చేస్తూ సోమవారం ఆదేశాలు జారీ చేసింది. 2.73 శాతం డీఏను మంజూరు చేస్తున్నట్లు ఆ ప్రకటనలో పేర్కొంది. ఉద్యోగులకు 2021 జూలై 1వ తేదీ నుంచి డీఏ చెల్లింపులు ఉండనున్నట్లు తెలిపింది.ప్రస్తుతం ఉన్న 17.29 శాతాన్ని, 20.02 శాతానికి పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది.

దీనివల్ల 4.40 లక్షల మంది ఉద్యోగులు, 2.88 లక్షల మంది పెన్షనర్లు లబ్ధి పొందనున్నారు. 2021, జులై నుంచి రాష్ట్ర ప్ర‌భుత్వం డీఏ చెల్లించ‌నుంది. జ‌న‌వ‌రి ఫించ‌నుతో క‌లిపి పింఛ‌నుదారుల‌కు ఫిబ్ర‌వ‌రిలో డీఏ చెల్లించ‌నుంది. 2021 జులై నుంచి 2022 డిసెంబ‌ర్ నెల‌ఖారు వ‌ర‌కు బ‌కాయిలు చెల్లించ‌నున్న‌ట్లు ప్ర‌భుత్వం ఉత్త‌ర్వుల్లో పేర్కొంది.

14,286 మంది విద్యార్థులు,టీచర్లతో రెడీ అయిన తెలంగాణ సైబర్ ఆర్మీ, ప్రతి విద్యాసంస్థ నుంచి ఆరుగురు అంబాసిడర్లు నియామకం, రేపటి నుంచి దశలవారీగా ట్రైనింగ్‌

దీంతో పాటుగా తెలంగాణలో టీచర్ల బదిలీలు, పదోన్నతులకు సంబంధించిన షెడ్యూల్‌ను సోమవారం విడుదల చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ నెల 27వ తేదీ నుంచి ఈ ప్రక్రియను చేపట్టనున్నట్లు తెలిపింది. ఈ నెల 28వ తేదీ 30 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తారు. మార్చి4వ తేదీ నాటికి ప్రక్రియ పూర్తి చేయనుంది సర్కార్‌. మార్చి 5వ తేదీ నుంచి 19వ తేదీ వరకు అప్పీళ్లకు అవకాశం ఇస్తారు. టీచర్ల నుంచి దరఖాస్తులు అందిచిన 15 రోజుల్లో అప్పీళ్లను పరిష్కరించనున్నట్లు ప్రభుత్వం తాజా ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.