Maharashtra Coronavirus: ముంబైలో మే నెలంతా లాక్‌డౌన్ తప్పదా?, మహారాష్ట్రలో 557 మంది పోలీసులకు కరోనా, 18వేలు దాటిన కోవిడ్-19 కేసులు, వెల్లడించిన రాష్ట్ర హోం మంత్రి అనిల్ దేశ్‌ముఖ్
అత్యధిక కరోనా కేసులతో దేశంలోనే ప్రథమస్థానంలో కొనసాగుతూ ఆందోళన కలిగిస్తోంది.కోవిడ్ 19 పై ముందుండి పోరాడుతున్న పోలీసులు (police personnel) అదే వైరస్ బారిన పడుతున్నారు. మహారాష్ట్రలో లాక్‌డౌన్ (Maharashtra Lockdown) అమల్లోకి వచ్చినప్పటి నుంచి నేటి వరకు 557 మంది కరోనా బాధితులుగా మారారని రాష్ట్ర హోం మంత్రి అనిల్ దేశ్‌ముఖ్ (Maharashtra Home minister Anil Deshmukh) ప్రకటించారు. రాష్ట్రంలో కొత్తగా 1362 కరోనా కేసులు నమోదవగా, మొత్తం కేసుల సంఖ్య 18,120కి చేరింది. ఇప్పటివరకు 694 మంది మరణించారు.
Mumbai, May 8: దేశంలో కరోనా మహమ్మారికి మహారాష్ట్ర (Maharashtra Coronavirus) ప్రధానకేంద్రంగా మారింది . అత్యధిక కరోనా కేసులతో దేశంలోనే ప్రథమస్థానంలో కొనసాగుతూ ఆందోళన కలిగిస్తోంది.కోవిడ్ 19 పై ముందుండి పోరాడుతున్న పోలీసులు (police personnel) అదే వైరస్ బారిన పడుతున్నారు.
మహారాష్ట్రలో లాక్‌డౌన్ (Maharashtra Lockdown) అమల్లోకి వచ్చినప్పటి నుంచి నేటి వరకు 557 మంది కరోనా బాధితులుగా మారారని రాష్ట్ర హోం మంత్రి అనిల్ దేశ్‌ముఖ్ (Maharashtra Home minister Anil Deshmukh) ప్రకటించారు. రాష్ట్రంలో కొత్తగా 1362 కరోనా కేసులు నమోదవగా, మొత్తం కేసుల సంఖ్య 18,120కి చేరింది. ఇప్పటివరకు 694 మంది మరణించారు. ముంబై సెంట్రల్ జైలులో కరోనా కల్లోలం, 77మంది ఖైదీలకు,26 మంది పోలీసులకు కరోనా పాజిటివ్, దేశ వ్యాప్తంగా 56 వేలు దాటిన కరోనా కేసులు
2,26,236 మంది క్వారంటైన్ లో ఉన్నారు. 653 మంది నిర్బంధాన్ని ఉల్లంఘించినట్లు గుర్తించారు. రాష్ట్ర ప్రభుత్వం నడుపుతున్న 4,729 సహాయ శిబిరాలు, ఇక్కడ 4,28,734 మంది వలస కూలీలకు ఆహారం మరియు అవసరాలతో ఆశ్రయం కల్పించారు. అక్రమ రవాణాపై 1,286 నేరాలు నమోదు చేయబడ్డాయి" అని ఆయన ట్వీట్ చేశారు.
Here's Home minister tweet
రాష్ట్రంలో 18వేలకు పైగా కరోనా కేసులు నమోదుకాగా ఒక్క ముంబైలోనే ఈ సంఖ్య 11,300 దాటిపోయింది. ప్రతిరోజూ వెయ్యికి పైగా కేసులు నమోదవుతున్నాయి. ఇక ముంబైలోని ఆర్డర్ రోడ్ సెంట్రల్ జైలును కూడా కరోనా తాకింది. ఈ సెంట్రల్ జైలులో 2800 మంది వరకు ఖైదీలు ఉన్నారు. ఒక్కో బారక్ లో 500 మంది వరకు ఖైదీలు ఉన్నట్టుగా తెలుస్తోంది. కాగా, ఓ బ్యారక్ లో ఉండే ఖైదీలలో 77 మందికి కరోనా పాజిటివ్ అని తేలింది. అలాగే ఆ జైలులో పనిచేస్తున్న సిబ్బందిలో 26 మందికి కూడా కరోనా పాజిటివ్ రావడంతో ప్రభుత్వం అప్రమత్తం అయ్యింది. కరోనా సోకిన ఖైదీలను హాస్పిటల్ కు తరలించారు. జైలులో ఉన్న మిగతా ఖైదీలకు కూడా పరీక్షలు నిర్వహిస్తున్నారు. వందే భారత్ మిషన్ ప్రారంభం, 177 మందితో దేశానికి చేరుకున్న తొలి విమానం, మొత్తం 12 దేశాలకు భారత విమానాలు, రెండు దశల్లో స్వదేశానికి తరలింపు
ఇదిలా ఉంటే మహారాష్ట్రలో లాక్‌డౌన్‌ను మే చివరి వరకు పొడిగించాలని ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే భావిస్తున్నారు. రాష్ట్రంలో కరోనా వైరస్ పరిస్థితులు, తీసుకుంటున్న చర్యల గురించి ప్రతిపక్షాలతో గురువారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం నిర్వహించిన ఉద్ధవ్ థాకరే వారి సూచనలు, సలహాలను స్వీకరించారు. ఈ సమావేశానికి బీజేపీ తరఫున మాజీ సీఎం దేవేందర్ ఫడణ్‌వీస్, ఆ పార్టీ శాసన మండలి నేత ప్రవీణ్ దరేకర్, ఎంఎన్ఎస్ చీఫ్ రాజ్ ఠాక్రే, వంచిత్ బహూజన్ అఘాడీ నేత ప్రకాశ్ అంబేడ్కర్ తదితరులు హాజరయ్యారు.
లాక్‌డౌన్‌ను రెడ్ జోన్‌లో ముఖ్యంగా ముంబయి, పుణేలో కొనసాగించాలని సీఎం భావిస్తున్నారని ప్రతిపక్ష నేతలు సమావేశం అనంతరం వ్యాఖ్యానించారు. కంటెయిన్‌మెంట్ ప్రాంతాల్లో ముఖ్యంగా ముంబయిలో ఎస్‌ఆర్పీఎఫ్ బలగాలను మోహరించాలని ఎంఎన్ఎస్ చీఫ్ రాజ్ ఠాక్రే పేర్కొన్నారు. వలస కార్మికులు సహా అధికార యంత్రాంగం సమన్వయ లోపం వల్ల పరిస్థితులు ప్రమాదకరంగా మారాయని, మద్యం దుకాణాలను మూసివేయాలని ప్రభుత్వానికి సూచించారు. సియాన్ హాస్పిటల్‌లో కోవిడ్-19తో చనిపోయినవారి మృతదేహాలను తరలించడం లేదని, దీని వల్ల కొత్తగా వైరస్ నిర్ధారణ అయిన బాధితులు చేరడానికి ఇబ్బందిగా ఉందని దేవేందర్ ఫడణ్‌వీస్ అన్నారు.