New Delhi, May 8: భారత్‌లో కరోనా (India Coronavirus) వేగంగా విస్తరిస్తోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 3,390 కరోనా కేసులు నమోదుకాగా, 103 మంది మృతిచెందారు. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య (Coronavirus Cases in India) 56,342కి చేరింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ శుక్రవారం హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకున్న 16,539 మంది డిశ్చార్జి కాగా, 1,886 మృతిచెందినట్టుగా తెలిపింది. ప్రస్తుతం దేశంలో 37,916 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయని వెల్లడించింది. వందే భారత్ మిషన్ ప్రారంభం, 177 మందితో దేశానికి చేరుకున్న తొలి విమానం, మొత్తం 12 దేశాలకు భారత విమానాలు, రెండు దశల్లో స్వదేశానికి తరలింపు
మహారాష్ట్రలో (Maharashtra) 18వేలకు చేరువలో కేసులు ఉండగా కేవలం ముంబైలోనే ఈ సంఖ్య 11,300 దాటిపోయింది. అక్కడ ప్రతిరోజూ వెయ్యికి పైగా కేసులు నమోదవుతున్నాయి. ఇదిలా ఉంటే ముంబైలోని ఆర్డర్ రోడ్ సెంట్రల్ జైలును (Arthur Road Jail) కూడా కరోనా తాకింది. ఈ సెంట్రల్ జైలులో 2800 మంది ఖైదీలు ఉన్నారు. ఒక్కో బారక్ లో 500 మంది వరకు ఖైదీలు ఉన్నట్టుగా తెలుస్తోంది. కాగా, ఓ బ్యారక్ లో ఉండే ఖైదీలలో 77 మందికి కరోనా పాజిటివ్ అని తేలింది. అంతేకాదు, ఆ జైలులో పనిచేస్తున్న సిబ్బందిలో 26 మందికి (Mumbai police personnel) కూడా కరోనా పాజిటివ్ రావడంతో ప్రభుత్వం అప్రమత్తం అయ్యింది. కరోనా సోకిన ఖైదీలను హాస్పిటల్ కు తరలించారు. జైలులో ఉన్న మిగతా ఖైదీలకు కూడా పరీక్షలు నిర్వహిస్తున్నారు. గ్యాస్ లీకేజీ ఘటనలో 12కు చేరిన మృతుల సంఖ్య, ఐదు గ్రామాల ప్రజలను ఖాళీ చేయించిన అధికారులు, వదంతులు నమ్మవద్దన్న విశాఖ పోలీసు కమిషనర్ ఆర్కే మీనా
దేశంలో నమోదవుతున్న కరోనా కేసుల్లో ఎక్కువ భాగం మహారాష్ట్ర, గుజరాత్, ఢిల్లీ, తమిళనాడులలోనే ఉన్నాయి. ఈ నాలుగు చోట్ల దాదాపు 36వేల కరోనా కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో అత్యధికంగా 17, 974 కరోనా కేసులు నమోదు కాగా, 694 మంది మృతిచెందారు. ఆ తర్వాత గుజరాత్‌లో 7,012, ఢిల్లీలో 5,980, తమిళనాడులో 5,409, రాజస్తాన్ 3,427, మధ్యప్రదేశ్ 3,252, ఉత్తరప్రదేశ్‌లో 3,071 కరోనా కేసులు నమోదయ్యాయి. ఏపీలో 1,833, పంజాబ్‌లో 1,644, వెస్ట్ బెంగాల్‌లో 1,548, తెలంగాణలో 1,122 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.