Visakhapatnam, May 8: విశాఖపట్నం ఎల్‌జీ పాలిమర్స్‌లో (LG Polymers) విషవాయువు లీకైన్ ఘటనలో (Vizag Gas Leak) మరో ఇద్దరు మృతిచెందారు. దీంతో మొత్తం ఇప్పటివరకు మృతి చెందిన వారి సంఖ్య (Vizag Gas leak death toll) 12కు చేరింది. అలాగే విషవాయువు పీల్చి అస్వస్థతకు గురైనవారికి విశాఖలోని (Visakhapatnam) పలు ఆస్పత్రుల్లో చికిత్స కొనసాగుతోంది. కేజీహెచ్ ఆస్పత్రిలో మూడు వార్డుల్లో 193 మంది చికిత్స పొందుతున్నారు. చికిత్స పొందుతున్నవారిలో 47 మంది చిన్నారులు ఉన్నారు. వారందరికి డాక్టర్లు మెరుగైన వైద్యం అందిస్తున్నారు. గ్యాస్ లీకయిన వెంటనే రంగంలోకి ఎన్డీఆర్‌ఎఫ్, ఇండియన్ నేవీ బృందాలు, లేకుంటే భారీ ప్రాణ నష్టం జరిగేది, మీడియాతో ఎన్డీఆర్‌ఎఫ్ డీజీ ఎస్‌ఎన్ ప్రధాన్
మరోవైపు గ్యాస్ లీకేజి అరికట్టేందకు 9 మంది నిపుణుల బృందంతో ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు నిపుణుల బృందం తీవ్రంగా శ్రమిస్తోంది. ఈ ఘటన సంబంధించి మంత్రులు కురసాల కన్నబాబు, ఆళ్ల నాని, బొత్స సత్యనారాయణ, అవంతి శ్రీనివాస్‌లు ఎప్పటికప్పుడు అధికారులతో సమన్వయం చేసుకుంటూ సహాయక చర్యలను సమీక్ష నిర్వహించారు. కేజీహెచ్‌తో పాటు పలు ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితులను మంత్రుల బృందం పరామర్శించనుంది. అలాగే బాధిత గ్రామాల ప్రజలకు భరోసా ఇచ్చేందుకు గ్రామాలలో పర్యటించే అవకాశం కూడా ఉంది.
ANI Tweet:
10 more fire tenders, including 2 foam tenders, are present at the spot. Ambulances are ready for any emergency: Visakhapatnam District Fire Officer Sandeep Anand #AndhraPradesh https://t.co/ZCZCTROlCY
— ANI (@ANI) May 7, 2020
ఎల్జీ పాలిమర్స్‌లో స్టైరిన్ బ్యాంకర్‌లో ఉష్ణోగ్రత తగ్గుముఖం పట్టింది. పుణె, నాగపూర్ నుంచి వచ్చిన ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు.. పూర్తిస్థాయిలో ఉష్ణోగ్రతను తగ్గించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. విశాఖలోని ఎల్ జీ పాలిమర్స్ కెమికల్ కర్మాగారంలో విషవాయువు లీకేజీకి కారణాలపై పూణే నుంచి వచ్చిన నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎన్డీఆర్ఎఫ్) ప్రత్యేక బృందం దర్యాప్తు సాగిస్తోంది. ఎల్ జీ పాలిమర్స్ కంపెనీలో నుంచి గురువారం అర్దరాత్రి కూడా మళ్లీ గ్యాస్ లీకైన నేపథ్యంలో ఈ కంపెనీ పరిసర ప్రాంతాల ప్రజలు రెండు రోజుల వరకు ఇళ్లకు రావద్దని ఎన్డీఆర్ఎఫ్ బృందం సభ్యులు సూచించారు. వైజాగ్ గ్యాస్ లీక్ విషాదం, మృతుల కుటుంబాలకు కోటి రూపాయల ఆర్థిక సాయం, తొమ్మిదికి చేరిన మృతుల సంఖ్య, ఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని తెలిపిన ఏపీ సీఎం
శుక్రవారం ఎన్డీఆర్ఎఫ్ పూణే బృందం సభ్యులు కెమికల్ ఫ్యాక్టరీ వద్దనే మకాం వేసి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. శుక్రవారం ఉదయం కూడా కంపెనీ ట్యాంకు నుంచి గ్యాస్ లీక్ అవుతున్న నేపథ్యంలో కర్మాగారం సమీపంలోని 5 కిలోమీటర్ల దూరంలోని ప్రజలను బస్సుల్లో సురక్షిత ప్రాంతాలకు తరలించామని అగ్నిమాపకశాఖ అధికారి సురేంద్ర ఆనంద్ చెప్పారు. కింగ్ జార్జ్ ఆస్పత్రిలో బాధితులను ఓదార్చిన ఏపీ సీఎం వైయస్ జగన్, ఆ వదంతులు నమ్మవద్దన్న డీజీపీ గౌతం సవాంగ్, ఘటనపై స్పందించిన ఎల్‌జీ కెమ్ యాజమాన్యం
ఎల్‌జీ పాలిమర్స్ కంపెనీకి సమీపంలోని ఐదు గ్రామాల ప్రజలను అధికారులు ఖాళీ చేయించారు. బస్సుల్లో వీరిని సింహాచలంలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలకు తరలించారు. సింహాచలం కొండ దిగువ పాత గోశాల దగ్గర నుంచి మార్కెట్ కూడలి వరకు ఉన్న పలు ప్రైవేటు కల్యాణ మండపాల్లో పునరావాస కేంద్రాలు ఏర్పాటుచేశారు. పూర్తిగా ప్రమాదం లేదని నిర్ధారించిన తరువాతే ప్రజలను గ్రామాలకు వెళ్లేందుకు అనుమతిస్తామని అధికారులు చెబుతున్నారు.
విశాఖపట్టణ శివార్లలోని ఎల్ జీ పాలిమర్శ్ కెమికల్ కర్మాగారంలో మళ్లీ గురువారం అర్దరాత్రి గ్యాస్ లీకైన ఘటనపై ప్రజలు భయపడొద్దని విశాఖ పోలీసు కమిషనర్ ఆర్కే మీనా భరోసా ఇచ్చారు. కెమికల్ ఫ్యాక్టరీకి రెండు కిలోమీటర్ల దూరంలో నివాసముంటున్న ప్రజలను ముందుజాగ్రత్త చర్యగా ఖాళీ చేయాలని కోరామని మీనా చెప్పారు. కెమికల్ కర్మాగారానికి రెండు కిలోమీటర్ల దూరంలో నివాసముంటున్న ప్రజలు భయపడాల్సిన పనిలేదని, వారు రోడ్లపైకి రావద్దని సీపీ కోరారు. కెమికల్ ఫ్యాక్టరీలో గ్యాస్ లీకేజీపై వస్తున్న వదంతులను నమ్మవద్దని సీపీ ప్రజలకు సూచించారు.