#VizagGasTragedy: వైజాగ్ గ్యాస్ లీక్ విషాదం, మృతుల కుటుంబాలకు కోటి రూపాయల ఆర్థిక సాయం, తొమ్మిదికి చేరిన మృతుల సంఖ్య, ఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని తెలిపిన ఏపీ సీఎం
Jagan Mohan Reddy Announces Compensation to families of deceased in Vizag Gas Leak (Photo Credits: Facebook & PTI)

Visakhapatnam, May 7: ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ ఘటనలో (Vizag Gas Leak) ప్రజలు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని ముఖ్యమంత్రి జగన్ (Andhra Pradesh Chief Minister YS Jagan Mohan Reddy) అన్నారు. అస్వస్థతకు గురైన వారు, అపస్మారక స్థితిలో ఉన్నవారు కోలుకుంటున్నారని చెప్పారు. మల్టీ నేషనల్ కంపెనీలో ఇలాంటి ఘటన జరగడం దురదృష్టకరమని అన్నారు. ఈ ఘటనపై విచారణ చేయాలని జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్ ను ఆదేశించామని చెప్పారు. కింగ్‌ జార్జ్‌ ఆస్పత్రిలో బాధితులను ఓదార్చిన ఏపీ సీఎం వైయస్ జగన్, ఆ వదంతులు నమ్మవద్దన్న డీజీపీ గౌతం సవాంగ్, ఘటనపై స్పందించిన ఎల్‌జీ కెమ్ యాజమాన్యం

నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు ఉంటాయని అన్నారు. ప్రమాదంపై అధ్యయనం చేసేందుకు కమిటీని కూడా వేశామని... ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు ఏం చేయాలనే దానిపై ఈ కమిటీ అధ్యయనం చేస్తుందని జగన్ చెప్పారు. ప్రమాదం జరిగినప్పుడు అలారం మోగాలని, కానీ అలా జరగలేదని తెలిపారు.

Family of the deceased to be given Rs 1 crore

ఈ దుర్ఘటనలో అస్వస్థతకు గురై కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్నవారిని పరామర్శించన అనంతరం ముఖ్యమంత్రి ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్‌ జగన్‌ (AP CM YS Jagan) మాట్లాడుతూ ‘ఈ సంఘటనకు సంబంధించి లోతుగా అధ్యయనం చేసేందుకు ఓ కమిటీని వేసి నివేదిక సమర్పించాలని ఆదేశించాం. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా తీసుకోవాల్సిన చర్యలపై ఈ కమిటీ నివేదిక ఇస్తుందని తెలిపారు.  గ్యాస్ లీక్‌పై ప్రధాని మోదీ అత్యవసర భేటీ, హాజరయిన అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్ తదితరులు

ఇక మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా. జరిగిన దుర్ఘటనలో చనిపోయిన మనుషులను వెనక్కి తీసుకురాలేకపోయినా... మనసున్న మనిషిగా బాధితుల కుటుంబాలకు అన్నిరకాలుగా అండగా ఉంటానని హామీ ఇస్తున్నా. చనిపోయిన ప్రతి కుటుంబానికి కోటి రూపాయలు ఆర్థిక సాయం (CM announces Rs 1 crore compensation) అందిస్తాం. అంతేకాకుండా హాస్పటల్‌లో వైద్యం పొందుతున్నవారికి కూడా ప్రభుత్వం ఆదుకుంటుంది.

Here's Vizag Gas Leak Effect Video

బాధితులు కోలుకునేవారకూ వారికి చికిత్స అందిస్తాం. మృతుల కుటుంబాలను అన్నివిధాలుగా ఆదుకుంటామని ఏపీ సీఎం తెలిపారు. ఘటనలో మృతి చెందిన కుటుంబాల్లో ఒకరికి ఎల్జీ కంపెనీ ఉద్యోగం ఇచ్చేలా చూస్తామని చెప్పారు. ఆస్పత్రుల్లో వెంటిలేటర్‌ మీద ఉన్నవాళ్లకు రూ. 10 లక్షలు, చికిత్స పొందుతున్న వారికి రూ. లక్ష, ప్రాథమిక చికిత్స పొందిన వారికి రూ. 25 వేలు నష్టపరిహారంగా అందించనున్నట్లు తెలిపారు. అదేవిధంగా ఒక్కో జంతువుకు రూ. 25 వేలు నష్టపరిహారం ఇవ్వనున్నట్లు చెప్పారు. బాధిత గ్రామాల్లోని 15 వేల మందికి ఒక్కొక్కరికి రూ. 10 వేల చొప్పున అందిస్తామన్నారు.

కాగా ఎల్జీ లాంటి గుర్తింపు ఉన్న సంస్థలో ఇలాంటి దుర్ఘటనలు జరగటం బాధాకరమని, గ్యాస్‌ లీక్‌ అయినప్పుడు అలారం ఎందుకు మోగలేదో తెలియరాలేదని ఏపీ సీఎం అన్నారు. మరోవైపు సంఘటన జరిగిన వెంటనే అధికారులు సమర్థవతంగా పని చేశారని, ఉదయం 4 గంటల నుంచే కలెక్టర్‌, ఎస్పీ సహాయక చర్యల్లో నిమగ్నమై ఉన్నారు’ అని తెలిపారు. కాగా ఎల్జీ పాలిమర్స్‌లో గ్యాస్‌ లీకై తొమ్మిదిమంది మృతి చెందగా, సుమారు 200మంది అస్వస్థతకు గురయ్యారు.

ఇదిలా ఉంటే విశాఖపట్నం గ్యాస్ లీక్ సంఘటన సింహాచలం నార్త్ రైల్వే స్టేషన్ నుండి వలస కార్మికుల కోసం వెళ్లే రైళ్లపై ప్రభావం చూపింది. వీటిలో కనీసం తొమ్మిది శ్రామిక్ స్పెషల్ రైళ్లు రాష్ట్రంలో చిక్కుకున్న వలస కార్మికులను వారి సొంత రాష్ట్రాలకు తీసుకువెళ్లనున్నాయి. ఈ నేపథ్యంలో ఈ రైళ్లు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి.