Visakapatnam, May 7: ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (AP CM YS Jagan) ప్రత్యేక హెలికాప్టర్‌లో విశాఖపట్నంలోని కింగ్ జార్జ్ ఆస్పత్రికి చేరుకున్నారు. గ్యాస్ లీక్ ప్రమాదంలో (Vizag Gas Leak Tragedy) అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. విశాఖ కేజీహెచ్‌లో (KGH hospital) 187 మంది, అపోలో ఆస్పత్రిలో 48 మంది, సెవెన్‌హిల్స్ ఆస్పత్రిలో 12 మంది చికిత్స పొందుతున్నారు. సీరియస్‌గా ఉన్నవారిని జీజీహెచ్‌కు తరలిస్తున్నారు. ఎనిమిదికి చేరిన మృతుల సంఖ్య, గ్యాస్ లీక్‌పై ప్రధాని మోదీ అత్యవసర భేటీ, హాజరయిన అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్ తదితరులు
స్థానిక కేజీహెచ్‌లో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని సీఎం ఓదార్చారు. బాధితులకు అందుతున్న వైద్య సదుపాయాల గురించి అక్కడి అధికారులను అడిగి తెలుసుకున్నారు. బాధితులకు మెరుగైన వైద్య సదుపాయం అందించాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. ఆస్పత్రిలో చికిత్స పొందున్న వారితో మాట్లాడి ప్రమాద విషయాలను అడిగి తెలుసుకున్నారు. గ్యాస్ దుర్ఘటనలో ప్రజలు ప్రాణాలు కోల్పోవడం బాధకరమని సీఎం జగన్ విచారం వ్యక్తం చేశారు.
Here's AP CM arrives at KGH
A young student pursuing MBBS is among the eight dead in Vizag.
AP health authorities have confirmed,that, 316 are admitted to the Hospital. AP CM @ysjagan arrives at KGH #vishakhapatnamhttps://t.co/XGY6HgbO6Q pic.twitter.com/7xw40Wrdot
— NewsMeter (@NewsMeter_In) May 7, 2020
విశాఖ కింగ్ జార్జ్ ఆసుపత్రి KGHకు చేరుకున్న సీఎం వైయస్ జగన్. చికిత్స పొందుతున్న గ్యాస్ లీక్ ప్రమాద బాధితులను పరామర్శిస్తున్న ముఖ్యమంత్రి. బాధితులను ఘటన వివరాలను ఆడిగితెలుసుకుని డాక్టర్లకు మెరుగైన వైద్యం అందించాలని సూచించిన సీఎం వైయస్ జగన్. #VizagGasLeak #CMYSJagan pic.twitter.com/76c4H7aMuQ
— YSR Congress Party (@YSRCParty) May 7, 2020
కాగా, గురువారం తెల్లవారుజామున ఆర్‌ఆర్ వెంకటాపురంలోని ఎల్‌జీ పాలిమర్స్ పరిశ్రమలో రసాయన వాయువు లీకైన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఎనిమది మంది మృతిచెందగా.. దాదాపు 200 మంది అస్వస్థతకు గురయ్యారు.
విశాఖలోని గోపాలపట్నంలో ఎల్జీ పాలిమర్స్ కెమికల్ ఫ్యాక్టరీలో గురువారం తెల్లవారుజామున జరిగిన భారీ ప్రమాదంపై విచారణకు ఆదేశించామని ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు. విశాఖ ఘటన దురదృష్టకరం. తెల్లారుజామున 03:30 గంటలకు ఈ ఘటన చోటుచేసుకుంది. గ్యాస్ లీకై ఇప్పటి వరకూ 08 మంది చనిపోయారు. వెంకటాపురం గ్రామాన్ని ఖాళీ చేయించాం. ఇళ్లలో ఉన్న డోర్‌లు పగలగొట్టి మరీ బయటికి తీసుకొచ్చాం. ఉదయం 06:30 కల్లా మొత్తం గ్రామాన్ని ఖాళీ చేయించాం. ఆ ప్రాంతంలో ఉన్నవారంతా వీలైనంత వరకూ ఎక్కువగా మంచి నీళ్లు తాగాలి’ అని డీజీపీ తెలిపారు.
Here ANI Tweet
Right now gas has been neutralised. One of the antidote is drinking a lot of water. Around 800 were shifted to hospital, many have been discharged. Investigation will be carried out to see how this happened: Andhra Pradesh DGP Damodar Goutam Sawang. #VizagGasLeak https://t.co/qIe0doOEmV
— ANI (@ANI) May 7, 2020
ఇదిలా ఉంటే విశాఖపట్నం జిల్లా ఆర్‌ఆర్ వెంకటాపురంలోని ఎల్‌జీ పాలిమర్స్‌లో రెండోసారి గ్యాస్ లీక్ అయినట్టు వచ్చిన వార్తలను ఆంధ్రప్రదేశ్ పోలీసులు కొట్టిపారేశారు. ఆ వదంతులు అన్ని అవాస్తవమని చెప్పారు. ఈ మేరకు ఏపీ పోలీసు ట్విటర్ ఖాతాలో ఓ మెసేజ్ పోస్ట్‌చేశారు. పరిశ్రమలో మెయింటెనెన్స్ టీమ్ మరమ్మతులు చేస్తోందని చెప్పారు. ఇప్పటికే కొంత ఆవిరిని బయటకు పంపించారని.. అక్కడ రెండో సారి ఎటువంటి గ్యాస్ లీక్ జరగలేదని స్పష్టం చేశారు.
Here's AP Police Tweet
Reports of a second leak at #LGPolymers premises are false. Maintenance team was repairing the system and some vapour was let out. There is NO second leak.
— AP Police (@APPOLICE100) May 7, 2020
మరోవైపు ఎల్‌జీ పాలిమర్స్‌లో రెండోసారి గ్యాస్ లీక్ అయిందని వదంతులను నమ్మవద్దని పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ తెలిపారు. ఎల్‌జీ పాలిమర్స్ పరిశ్రమను సందర్శించిన అనంతరం మంత్రి అవంతి మీడియాతో మాట్లాడారు.. కంపెనీలో గ్యాస్ లీక్ పూర్తిగా అదుపులోకి వచ్చిందని తెలిపారు. ఆర్‌ఆర్ వెంకటాపు, బీసీ కాలనీల్లోని ప్రజలు సమీప శిబిరాల్లో క్షేమంగా ఉన్నారని వెల్లడించారు. ఎల్‌జీ పాలిమర్స్ పరిసరాల్లో మినహాయిస్తే విశాఖలోని ఇతర ప్రాంత ప్రజలు ఆందోళన చెందాల్సిన పనిలేదన్నారు.
ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం జిల్లాలోని ఆర్‌ఆర్ వెంకటాపురంలోని ఎల్‌జీ పాలిమర్స్ ప్లాంట్ నుంచి విషవాయువుల లీకైన ఘటనపై దక్షిణ కొరియాకు చెందిన ఎల్‌జీ కెమ్ స్పందించింది. ఈ ప్రమాదంపై విచారం వ్యక్తం చేసిన సంస్థ ప్రస్తుతం గ్యాస్ లీకేజీ అదుపులోకి వచ్చినట్టు ఒక ప్రకటనలో వెల్లడించింది. లీక్ ఎలా జరిగిందనే దానిపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపింది.