Fire at HPCL in Vizag (Photo-Video Grab)

Visakapatnam, May 25: విశాఖపట్నం హెచ్‌పీసీఎల్‌లో భారీ అగ్ని ప్రమాదం (Massive Fire Accident At Visakha HPCL) సంభవించింది. మంటలు భారీగా ఎగసిపడ్డాయి. సేఫ్టీ సైరన్‌ మోగడంతో ఉద్యోగులు పరుగులు తీశారు. భారీ శబ్ధం రావడంతో స్థానికులు స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. ఘటనా స్థలానికి ఫైర్‌ సిబ్బంది చేరుకుని మంటలు (Vishaka HPCL Fire Accident) ఆర్పివేశారు. హెచ్‌పీసీఎల్‌ నుంచి సాధారణం కంటే దట్టంగా పొగలు వ్యాపించాయి. హెచ్‌పీసీఎల్‌ (Visakha HPCL) పరిసరాల్లో దట్టంగా పొగలు అలుముకున్నాయి.

ప్రమాద సమయంలో మూడు సార్లు హెచ్చరికలు జారీ చేశారు. మరోవైపు ముందస్తు చర్యల్లో భాగంగా హెచ్‌పీసీఎల్‌ పరిసర ప్రాంత ప్రజల్ని పోలీసులు ఖాళీ చేయిస్తున్నారు. మంటలను అదుపులోకి తీసుకొచ్చినట్టు తెలుస్తోంది. ప్రమాద సమయంలో అక్కడ 100 మంది ఉద్యోగులు ఉన్నారని.. వారంతా క్షేమంగా ఉన్నారని సమాచారం. ఎటువంటి ప్రాణహాని, గాయాలు జరగకపోవడం అంతా ఊపిరి పీల్చుకున్నారు.

Here's ANI Update

హెచ్‌పీసీఎల్‌ పాత టెర్మినల్‌ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. అయితే ఏ విభాగంలో ప్రమాదం జరిగింది, కారణాలు ఏంటి అనే విషయాలు తెలియాల్సి ఉంది.గాజువాక, మల్కాపురం ప్రాంత ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. పేరుకుపోయిన కర్బన పదార్థాలు అప్పుడప్పుడూ పేలడం ఇక్కడ సర్వసాధారణం అయితే, తాజా ప్రమాదంలో మరీ ఎక్కువగా మంటలు ఎగసిపడుతుండటంతో భారీ ప్రమాదమే జరిగి ఉంటుందని స్థానికులు చెబుతున్నారు.

దూసుకొస్తున్న యాస్ తుఫాన్, అల్లకల్లోలంగా బంగాళాఖాతం తీర ప్రాంతాలు, రాబోయే 12 గంటల్లో అతి తీవ్ర తుఫానుగా మారనున్న యాస్, ఒడిశాలోని బాలాసోర్‌ వద్ద తీరం దాటుతుందని అంచనా వేసిన ఐఎండీ

విశాఖ హెచ్‌పీసీఎల్‌లో మూడు యూనిట్లు ఉన్నాయి. తాజా ప్రమాదం మూడో యూనిట్లో జరిగినట్లు తెలుస్తోంది. ఇది చాలా సున్నితమైన యూనిట్‌, అతి ఎక్కుగా మండే పదార్థాలు ఇక్కడ ఉంటాయి. నిరంతరం అగ్నిమాపక సిబ్బంది అక్కడ ఉంటారు. అత్యాధునిక పరికరాలతో ప్రస్తుతం మంటలు అదుపు చేస్తున్నారు. అంతేకాకుండా విశాఖ పట్నం నుంచి కొన్ని అగ్నిమాపక యంత్రాలను తీసుకొచ్చారు. ఇక్కడ నీటితో మంటలను అదుపు చేసే వీలుండదు.. కేవలం కొన్ని రసాయనాలతో మాత్రమే మంటలను మంటలను ఆర్పాలి.ఎవరికైనా అత్యవసర సమయంలో వైద్య సేవలను అందించేందుకు కొన్ని అంబులెన్స్‌లను కూడా అక్కడ సిద్ధం చేశారు.