Representational Image | (Photo Credits: PTI)

Visakapatnam, Mar 31: భార్య చనిపోవడంతో మనస్తాపానికి గురైన ఓ భర్త తన ఇద్దరు పిల్లలకు విషం ఇచ్చి తాను ఉరివేసుకుని చనిపోయాడు. ఈ విషాద ఘటన విశాఖపట్నం (Visakapatnam Shocker) జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో చోటు చేసుకుంది.పోలీసులు తెలిపిన సమాచారం ప్రకారం.. కొక్కిర సత్యనారాయణ, పుష్పలత దంపతులు ముత్రాసు కాలనీలో నివాసం ఉంటున్నారు. అయితే గతేడాది నవంబర్‌లో పుష్పలత అనారోగ్యంతో మృతి చెందారు.

దీంతో అప్పటి నుంచి భర్త సత్యనారాయణ తీవ్రమైన మనస్తాపానికి గురయ్యాడు. అయితే మంగళవారం కూడా మనస్తాపం చెందిన సత్యనారాయణ తన పిల్లలకు విషం ఇచ్చి, తర్వాత ఆయన ఉరివేసుకొని ఆత్మహత్య (father who poisoned his two children and committed suicide) చేసుకున్నాడని పోలీసులు తెలిపారు. సత్యనారాయణకు పదేళ్ల కుమారుడు లోకేశ్‌, తొమ్మిదేళ్ల కూతురు తేజశ్రీ ఉన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.

కాపురానికి పనికిరాని భర్త తనను వదిలించుకునేందుకు వేధింపులకు పాల్పడుతున్నాడని ఓ యువతి అత్తింటి ముందు ధర్నాకు దిగింది. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం... కరీంనగర్‌ భగత్‌నగర్‌కాలనీకి చెందిన గుంజి శ్రీనివాస్, పద్మలకు ఇద్దరు కుమార్తెలు. శ్రీనివాస్‌ ఉద్యోగ రీత్యా ముంబాయిలో ఉంటున్నాడు. ఈ ఏడాది జనవరి 8న వారి పెద్ద కుమార్తె తేజస్వీనితో రాక్‌టౌన్‌కాలనీకి చెందిన బత్తులు ఏడుకొండలు–సుశీల పెద్ద కుమారుడు వెంకటేశ్వర్‌రావు అలియాస్‌ వెంకటేశ్వర్లు (30)తో వివాహం జరిగింది.

పెళ్లి పేరుతో యువతిని గర్భవతిని చేశాడు, ఆ తర్వాత దూరం పెట్టాడు, తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న యువతి, బంజారాహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌లో పరిధిలో ఘటన, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు

వెంకటేశ్వర్లు నగరంలో క్లేవ్‌టెక్‌ సంస్థలో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పని చేస్తున్నాడు. తేజస్వీని బీబీఐటీ కాలేజీలో ఎంబీఏ చదువుతోంది. వివాహ సమయంలో సుమారు రూ.20లక్షల వరకు బంగారం, కట్న కానుకలుగా అందజేశారు. వివాహ సమయంలో తన భర్త నానమ్మ అనారోగ్యంగా ఉందని అబద్ధం చెప్పి వివాహ తంతుని త్వరగా ముగించారు. వివాహమైన వారం రోజుల తరువాత నుంచి వేధింపులు ప్రారంభమయ్యాయని బాధితురాలు తెలిపింది. భర్త, అత్తమామలు, ఆడపడుచు కలిసి వేధింపులకు పాల్పడుతున్నారు. ఎలాగైన వదిలించుకోవాలని పథకం ప్రకారం కాపురానికి తీసుకురాకుండా పుట్టింటి వద్దనే బాధితురాలిని ఉంచుతున్నారు.

అంతేకాకుండా తన భర్త వెంకటేశ్వర్‌రావు కాపురానికి పనికిరాడనే విషయం కుటుంబసభ్యులకు తెలిసినా వివాహం జరిపించారని ఆమె పేర్కొన్నారు. ఈ విషయాన్ని కప్పిపుచ్చేందుకు వేధింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఈ విషయమై ఈనెల 24న ఎల్‌బీనగర్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసును సరూర్‌నగర్‌ మహిళా పోలీస్‌స్టేషన్‌కు ట్రాన్స్‌ఫర్‌ చేయగా అక్కడ వారికి కౌన్సెలింగ్‌ చేశారు. పెద్దల సమక్షంలో రెండు రోజుల్లో సమస్యను పరిష్కరించుకుంటామని తన భర్త కుటుంబసభ్యులు పోలీసులకు తెలిపారన్నారు. ఇప్పటి వరకు స్పందన లేకపోవటంతో మంగళవారం ఉదయం అత్తింటి ఎదుట న్యాయం చేయాలంటూ బాధితురాలు ధర్నాకు దిగింది.