Hyderabad Shocker: పెళ్లి పేరుతో యువతిని గర్భవతిని చేశాడు, ఆ తర్వాత దూరం పెట్టాడు, తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న యువతి, బంజారాహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌లో పరిధిలో ఘటన, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
Crime Against Women. (Photo Credits: IANS)

Hyderabad, Mar 30: సోషల్‌ మీడియాలో పరిచయం పెళ్లిగా మారి చివరకు ఆత్మహత్యకు దారి తీసింది. ప్రియురాలిని గర్భవతిని చేయడమే కాకుండా ఆ గర్భాన్ని తీసివేసి ఆమెను దూరం పెట్టడంతో తట్టుకోలేని యువతి ఆత్మహత్య (Young girl died by suicide) చేసుకుంది. ఈ విషాద ఘటన బంజారాహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌లో పరిధిలో చోటుచేసుకుంది. యువతి తాను ఉంటున్న వసతిగృహంలో పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది.

బంజారాహిల్స్‌ పోలీసుల వివరాల ప్రకారం.. బంజారాహిల్స్‌లోని రాఘవేంద్ర నగర్ కాలనీలో దుగ్యాల ఐశ్వర్య (20) నివసిస్తుండేది. ఆమె బంజారాహిల్స్‌లోని ఓ ప్రయివేట్ సంస్థలో బిజినెస్ ఎగ్జిక్యూటివ్‌గా పని చేస్తుండేది. అయితే కొంతకాలం కిందట మారెడ్డి ఆశిర్ అనే యువకుడితో ఆమెకు ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమయ్యాడు. ఆ పరిచయం వారి మధ్య ప్రేమగా మారింది. దీంతో వారిద్దరూ పెళ్లి చేసుకుందామని నిర్ణయానికి వచ్చారు.

గతేడాది ఫిబ్రవరి 20వ తేదీన హైదరాబాద్‌ శివారులోని సంఘీ దేవాలయంలో ఇద్దరూ వివాహం చేసుకున్నారు. తర్వాత కొద్ది రోజులు కలిసి ఉన్నారు. అయితే ఈ పెళ్లి విషయం ఇంట్లో తెలియడంతో ఇరువురి తల్లిదండ్రులు అంగీకరించలేదు. తన భర్తను దూరం చేశారని ఐశ్యర్య అప్పటినుంచి తల్లిదండ్రుల మీద కోపం పెంచుకుంది. దీంతో హైదరాబాద్‌కు వచ్చి వసతిగృహంలో ఉంటూ ఉద్యోగం చేస్తోంది.

నాగ్‌పూర్ సెంట్రల్ జైలులో దారుణం, ట్రాన్స్‌జెండర్‌‌పై ఏడుమంది పోలీసులు అత్యాచారం, హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన బాధిత ట్రాన్స్‌జెండర్ కార్యకర్త, మే 6 లోగా సమాధానం ఇవ్వాలని డీఐజీకి బొంబాయి హైకోర్టు నోటీసులు

అయితే తాను కుటుంబసభ్యులను ఒప్పిస్తానని నమ్మ బలికిన ఆశిర్ ఆమెతో అప్పటి నుంచి సంబంధం కొనసాగిస్తున్నాడు. ఈ క్రమంలోనే ఐశ్వర్య గర్భం దాల్చింది. ఈ విషయాన్ని ఆశిర్‌కు చెప్పి కలిసి ఉందామని విషయాన్ని ప్రస్తావించింది. ఆమె ఒత్తిడి చేస్తుండడంతో ‘ఆమెకు గర్భం తీసి వేయించాడు. ఆ తర్వాత నాకు కొంత సమయం కావాలి’ అని ఆశిర్‌ కాలయాపన చేస్తూ వస్తున్నాడు.

ఈక్రమంలోనే ఆశిర్‌తో ఎలాగైనా తేల్చుకోవాలని ఐశ్వర్య వారి ఇంటికి వెళ్లింది. అక్కడ ఆ కుటుంబసభ్యులు ఐశ్వర్యను దారుణంగా అవమానించడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యింది. ఆ మనస్తాపంతోనే మంగళవారం తెల్లవారుజామున ఐశ్వర్య ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అంతకుముందు కొన్ని సెల్ఫీ వీడియోలను ఐశ్వర్య తీసుకుంది. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఈ క్రమంలోనే ప్రియుడు ఆశిర్‌ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఈ కేసును దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.