YS Jagan Rule: నేటితో ఆరు నెలల పాలనను పూర్తి చేసుకున్న ఏపీ సీఎం వైయస్ జగన్, 2019 మే 30వ తేదీన ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం, సంక్షేమ పథకాలతో ప్రజలకు మరింత చేరువగా, జగన్ ఆరు నెలల పాలనపై ఓ విశ్లేషణ

ఒక్కడు.. ఒంటరిగా వచ్చాడు. వేలు లక్షలుగా జనం అతని వెంట నడిచారు. ప్రజాసంకల్పంతో తను గెలిచాడు. కోట్లాది మంది ప్రజలను తన గెలుపులో భాగస్వామిని చేశాడు. వైయస్‌ఆర్‌‌సీపీ అధినేత (YSRCP Ledaer)గా ఎనిమిదేళ్ల ప్రయాణం. ఏపీ (Andhra Pradesh) ప్రతిపక్ష నేతగా ఐదేళ్ల పోరాటం. ఇలా అన్నింటిలో ఆయన అడుగులు తడబడలేదు. స్వయంకృషిని నమ్ముకున్నాడు.

Andhra pradesh Cm Ys Jagan

Amaravathi, November 30: ఒక్కడు.. ఒంటరిగా వచ్చాడు. వేలు లక్షలుగా జనం అతని వెంట నడిచారు. ప్రజాసంకల్పంతో తను గెలిచాడు. కోట్లాది మంది ప్రజలను తన గెలుపులో భాగస్వామిని చేశాడు. వైయస్‌ఆర్‌‌సీపీ అధినేత (YSRCP Ledaer)గా ఎనిమిదేళ్ల ప్రయాణం. ఏపీ (Andhra Pradesh) ప్రతిపక్ష నేతగా ఐదేళ్ల పోరాటం. ఇలా అన్నింటిలో ఆయన అడుగులు తడబడలేదు. స్వయంకృషిని నమ్ముకున్నాడు. పొత్తుల ప్రస్తావనే లేకుండా.. ఒంటి చేత్తో పార్టీని గెలిపించి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తనదైన సువర్ణ అధ్యాయాన్ని లిఖించుకున్నాడు.

తండ్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి (Late YS Rajasekhara Reddy) మరణాన్ని జీర్ణించుకోలేని పరిస్థితుల్లో ఉన్న వైయస్‌ జగన్‌ (YS Jagan)తన తండ్రి కోసం గుండెలాగిన కుటుంబాలను ఓదార్చేందుకు ప్రజా సంకల్ప యాత్ర కోస బయల్దేరాడు. ఆ దారికి కాంగ్రెస్‌ హైకమాండ్‌ అడ్డుపడింది. మహానేత వైయస్‌ఆర్‌ మరణవార్త తట్టుకోలేక చనిపోయిన వారి కుటుంబాల్లో ధైర్యం నింపేందుకే ఈ యాత్ర అని చెప్పేందుకు ప్రయత్నించినా దానికి ఆ పార్టీ అధ్యక్షురాలు నో.. చెప్పడంతో చనిపోతూ తన తండ్రి ఇచ్చిపోయిన పెద్ద కుటుంబం కోసం పార్టీకి రాజీనామా చేశాడు వైయస్‌ జగన్‌. అప్పుడు మొదలైన అడుగు పదేళ్ల పాటు ఎన్నో ముళ్లకంపలను దాటుతూ వచ్చింది.

ప్రజా సంకల్ప యాత్రలో వైయస్ జగన్ 

వందల మంది ఏకమై హేళన చేస్తున్నా, కుట్రదారులంతా కలిసి తప్పుడు కేసులు బనాయించినా.. సడలని సంకల్పంతో ముందుకుసాగాడు వైయస్‌ జగన్‌. ప్రజా శ్రేయస్సే లక్ష్యంగా నిత్యం జనాల్లో ఉంటూ వారి సమస్యల పరిష్కారం కోసం పోరాడాడు. నాటి ప్రభుత్వ అసమర్ధ పాలనతో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై సమరశంఖం పూర్తిస్తూ 2017 నవంబర్‌ 6వ తేదీన ప్రజా సంకల్పయాత్ర పేరిట వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్ర చేపట్టాడు. ఏకంగా 3648 కిలోమీటర్ల పాదయాత్ర చేసి జనం గుండెల్లో దాగి ఉన్న బాధను తెలుసుకున్నాడు. ఒక్క అవకాశం ఇవ్వండి గడప వద్దకే మంచి పాలన తీసుకువస్తానని మాట ఇచ్చాడు.

ఎవరూ ఊహించని రీతిలో 151 సీట్లు సాధించిన వైయస్‌ జగన్‌ 2019 మే 30వ తేదీన ముఖ్యమంత్రి(AP CM YS Jagan)గా ప్రమాణస్వీకారం చేశారు. పాలనా పగ్గాలు చేపట్టిన ఆరు నెలల్లో(6 months successfully completed Ap cm ys jagan) ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన వాగ్దానాల్లో 80 శాతం నెరవేర్చారు. మేనిఫెస్టోలోని హామీలే కాదు.. పాదయాత్రలో తన దృష్టికి వచ్చిన సమస్యలను కూడా పరిష్కరిస్తున్నారు.

అవ్వా తాతల పెన్షన్‌ పెంపు మొదలుకొని ఉద్యోగాల విప్లవం, వైయస్‌ఆర్‌ రైతు భరోసా(YSR Rythu Bharosa), వైయస్‌ఆర్‌ వాహనమిత్ర(YSR Vahana Mitra) మొదలుకొని మత్స్యకారులకు వైయస్‌ఆర్‌ భరోసా వరకు అనేక సంక్షేమ పథకాలను ఆరు నెలల కాలంలోనే అమలు చేసి చూపించారు. సీఎం మా ఇంటి మనిషి అని ప్రతీ కుటుంబం అనుకునేలా పాలన సాగిస్తున్నారు. నాయకుడిని కాదు ప్రజాసేవకుడినంటూ యువముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముందుకు సాగుతున్నారు.

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now

Share Now