UP Horror: ఉత్తరప్రదేశ్ లో ఘోరం.. గోడ కూలి 12 మంది దుర్మరణం.. భారీ వర్షాలే కారణం..

భారీ వర్షాల ధాటికి ఓ గోడ కూలి తొమ్మిది మంది కూలీలు మృత్యువాతపడ్డారు. మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి.

Wall Collapsed (Image Credits: Twitter)

Lucknow, September 16: ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో ఘోర ప్రమాదం చోటుచేసుకున్నది. భారీ వర్షాల ధాటికి ఓ గోడ కూలి 12 మంది కూలీలు మృత్యువాతపడ్డారు. మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను సమీప దవాఖానకు తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

ఈ ఘటనపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు రూ. 4 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. కాగా, దేశ రాజధాని ఢిల్లీలో నిన్న కురిసిన భారీ వర్షానికి జనజీవనం అస్తవ్యస్తమైంది. నిన్న ఈ నెలలోనే అక్కడ అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైంది. మరోవైపు, అల్పపీడనం కారణంగా ఉత్తరప్రదేశ్‌లో ఎడతెరిపిలేకుండా వానలు కురుస్తున్నాయి. రేపటి వరకు ఇదే పరిస్థితి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. వానల కారణంగా నేడు విద్యాసంస్థలను మూసివేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు.