MLA Ramesh Kumar Apology: రేప్ అనివార్యమైతే పడుకుని ఎంజాయ్ చేయండి, వివాదాస్పద వ్యాఖ్యలపై క్షమాపణ కోరిన కర్ణాటక MLA రమేశ్ కుమార్, ఇక నుంచి జాగ్రత్తగా మట్లాడతానని వెల్లడి
తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా రమేశ్ కుమార్ క్షమాపణలు (MLA Ramesh Kumar Apology) కోరుతూ.. రేప్ గురించి నిర్లక్ష్యపూరిత, అసంబద్ధమైన వ్యాఖ్యలు చేసినట్లు ఆయన ((kr Ramesh kumar) తెలిపారు.
Bengaluru, Dec 17: రేప్‌ను ఎంజాయ్ చేయాలంటూ కర్నాటక అసెంబ్లీలో కామెంట్ చేసిన మాజీ స్పీకర్, ఎంఎల్ఎ కేఆర్ రమేశ్ కుమార్ తన వ్యాఖ్యల పట్ల క్షమాపణలు చెప్పారు. తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా రమేశ్ కుమార్ క్షమాపణలు (MLA Ramesh Kumar Apology) కోరుతూ.. రేప్ గురించి నిర్లక్ష్యపూరిత, అసంబద్ధమైన వ్యాఖ్యలు చేసినట్లు ఆయన ((kr Ramesh kumar) తెలిపారు.
చాలా హేయమైన ఆ నేరం గురించి తానేమీ నవ్వులాటగా మాట్లాడలేదని, అనాలోచితంగా వ్యాఖ్యలు చేసినట్లు ఆయన అన్నారు. ఇక నుంచి తాను జాగ్రత్తగా మాట్లాడనున్నట్లు రమేశ్ కుమార్ తెలిపారు. ఆయన అత్యాచారంపై మాట్లాడుతూ..రేప్ అనివార్యమైనప్పుడు, పడుకుని ఎంజాయ్ చేయండి” అని అన్నారు. ఆయన వ్యాఖ్యలు సభలో పెద్ద దుమారాన్ని రేపాయి. ఈ వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీ ఖండించింది. సభలో కర్నాటక అసెంబ్లీ స్పీకర్ & సీనియర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేల మధ్య అత్యంత అభ్యంతరకరమైన & అనుచితమైన పరిహాసాన్ని కాంగ్రెస్ పార్టీ ఆమోదించలేదు. సంరక్షకునిగా స్పీకర్ & సీనియర్ శాసనసభ్యులు రోల్ మోడల్‌గా ఉండాలని మరియు అలాంటి ఆమోదయోగ్యం కాని ప్రవర్తనకు దూరంగా ఉండాలని రణదీప్ సింగ్ సుఘేవాల ట్వీట్ చేశారు.
అయితే కర్ణాటక అసెంబ్లీ మాజీ స్పీకర్ కేఆర్ రమేశ్ కుమార్ (Senior Congress leader Ramesh Kumar) ఈ తరహా వ్యాఖ్యలు చేయడం ఇదే తొలిసారి కాదు. ఇలాంటి అభ్యంతర వ్యాఖ్యలు గతంలో కూడా చేసి తన పరువును కాస్తా పోగొట్టుకున్నారు. 2019లో కర్ణాటక అసెంబ్లీ స్పీకర్‌గా వున్న రమేశ్ కుమార్ తనను తాను అత్యాచార బాధితుడితో పోల్చుకున్నారు. పార్టీ నుంచి రూ.50 కోట్ల లంచం తీసుకున్నారంటూ బీజేపీ నేతలు అతని ఆడియో క్లిప్ ను హైలెట్ చేశారు. ఈ ఆడియో క్లిప్‌లో తన పేరు వినిపించిన తర్వాత రమేశ్ కుమార్ ఈ వ్యాఖ్యలు చేశారు.
MLA Ramesh Kumar Apology
Karnataka Congress MLA KR Ramesh Kumar "Enjoy Rape"
అప్పటి ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి విడుదల చేసిన ఆడియో టేపుల్లో తనపై ఆరోపణలు చేయడంతో అసెంబ్లీలోనే తన పరిస్ధితి అత్యాచార బాధితురాలిగా వుందని రమేశ్ కుమార్ వ్యాఖ్యానించారు. అయితే ఈ వ్యాఖ్యలపై మహిళా శాసనసభ్యులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో రమేశ్ కుమార్ సభకు క్షమాపణలు చెప్పారు. అత్యాచార బాధితురాలిని న్యాయస్థానంలో రేప్ బాధితురాలిని క్రాస్ ఎగ్జామినేషన్ చేసినప్పుడు పదే పదే గుచ్చిగుచ్చి అడగటాన్ని ఉద్దేశిస్తూ ఈ వ్యాఖ్యలు చేశానని రమేశ్ కుమార్ వివరణ ఇచ్చారు.
ఇక 2020 సెప్టెంబర్‌లోనూ స్పీకర్ విశ్వేశ్వర్ హెగ్డే కాగేరీని వెంటనే అసెంబ్లీ నుంచి బహిష్కరించాలని చెబుతూ రమేశ్ కుమార్ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. కోవిడ్ 19 చర్చ సందర్భంగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కే.సుధాకర్ సమాధానంపై అసహనం వ్యక్తం చేసిన రమేష్.. పీపీఈ కిట్‌లు కొనుగోలు చేసిన ధరల్లోని వ్యత్యాసాన్ని పునరుద్ఘాటించారు. అంతేకాదు పీపీఈ కిట్‌లకు సంబంధించి పలు కమిటీలు పనిచేశాయి.
అయితే ఆ కమిటీల్లో గొప్ప వ్యక్తులు ---- ( బూతు పదం) అలాంటి పనులు చేస్తూ వుంటారంటూ రమేశ్ కుమార్ అసభ్యకర వ్యాఖ్యలు చేశారు. అయితే ఆయన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసిన బీజేపీ నేతలు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. హోంమంత్రి ఈశ్వరప్ప.. రమేశ్ కుమార్‌ని --- (బూతు పదం) మేం ఆ మాట అంటే ఎలా వుంటుందో చెప్పాలన్నారు. తమ ఇంట్లో ఆ పదం పిల్లలు ఉపయోగిస్తే ఖచ్చితంగా దండిస్తామన్నారు. ఎట్టకేలకు స్పీకర్ జోక్యం చేసుకోవడంతో ఆ పదం ‘‘అన్‌పార్లమెంటరీ’’ అని తేల్చిచెప్పారు.