Bengaluru, Mar 3: యువతితో రాసలీలలు జరుపుతూ వీడియోకు చిక్కిన కర్ణాటక జలవనరుల శాఖ మంత్రి, భారతీయ జనతా పార్టీ నేత రమేశ్ జార్కిహొళి తన మంత్రి పదవికి బుధవారం రాజీనామా (MP Ramesh Jarkiholi's Resignation) చేశారు. తన పదవికి రాజీనామా చేసే ప్రసక్తే లేదని మంగళవారం సాయంత్రం వీడియో సందేశం ద్వారా రమేష్ చెప్పినప్పటికీ.. పార్టీ నుంచి వచ్చిన ఒత్తిడిల కారణంగా బుధవారం రాజీనామా నిర్ణయం తీసుకున్నారు.
"నాపై వచ్చిన ఆరోపణలు పూర్తిగా అవాస్తవం. ఈ విషయంలో స్పష్టమైన దర్యాప్తు అవసరం. అది ఫేక్ వీడియో.. నేను నిర్దోషిగా బయటకు వస్తానని నాకు నమ్మకం ఉంది. నేను నైతిక కారణాల వల్ల రాజీనామా చేస్తున్నాను.. దీనిని ఆమోదించాల్సిందిగా కోరుతున్నాను" అని రమేశ్ తన రాజీనామ లేఖలో పేర్కొన్నారు. ఈ రాజీనామాను కర్ణాటక ముఖ్యమంత్రి యడ్డ్యూరప్ప (CM B. S. Yeduiyurappa) ఆమోదించారు. అప్రూవల్ కోసం గవర్నర్ కు పంపారు. ఈ రాజీనామాను గవర్నర్ వాజుభాయ్ వాలా ఆమోదించారు.
ఈ అంశంపై బీజేపీ కూడా స్పందించింది. ఈ విషయాన్ని పూర్తిగా దర్యాప్తు చేసి తదుపరి చర్యలు తీసుకుంటామని వెల్లడించింది. యువతి డాక్యుమెంటరీ విషయమై కొద్ది రోజుల కిందట మంత్రి రమేశ్ వద్దకు వచ్చింది. ఈ క్రమంలో మంత్రి ఆమెను లోబచర్చుకున్నట్లు తెలిసింది. ఇందుకు సంబంధించిన వీడియో, ఆడియో సీడీలను పౌరహక్కుల పోరాట సమితి అధ్యక్షుడు దినేశ్ కల్లహళ్లి బెంగళూరు నగర పోలీసు కమిషనర్ కమల్‌పంత్‌కు అందజేసిన సంగతి తెలిసిందే.
మరొక కథనం ప్రకారం.. కేపీటీసీఎల్‌లో (కర్ణాటక పవర్ ట్రాన్స్‌మిషన్ కార్పొరేషన్ లిమిటెడ్) ఉద్యోగం ఇప్పిస్తానని బెంగళూరు ఆర్‌టీ నగర్‌కు చెందిన యువతిని లొంగదీసుకున్న మంత్రి రమేశ్‌జార్కిహొళి ఆమెతో రాసలీలలు జరిపినట్టు తెలుస్తోంది. మంత్రి రమేశ్ జార్కిహొళి ఓ యువతితో రాసలీలలు జరుపుతున్న వీడియోను దినేశ్ కల్లహళ్లీ అనే సామాజిక కార్యకర్త బెంగళూరు మీడియాకు విడుదల చేశారు.
ఈ కేసుపై దర్యాప్తు ప్రారంభమైందని, మంత్రిపై వచ్చిన ఫిర్యాదు ఆధారంగా విచారణ కొనసాగుతుందని కర్ణాటక హోమంత్రి బసవరాజ్ బొమ్మై అన్నారు. ఉప ఎన్నికల నేపథ్యంలో శృంగార సీడీ బయకు రావడంతో బీజేపీ చిక్కుల్లో పడింది. కాంగ్రెస్, జేడీఎస్ ప్రభుత్వాన్ని కూల్చి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పటికీ నుంచి మెరుపు వేగంతో కర్ణాటకలో దూసుకుపోతున్న బీజేపీకి ఇది గట్టి దెబ్బ అని అంటున్నారు.