Tomato Price Hike: ఇక టమాటోకి రాంరాం, కిలో రూ. 160కి చేరుకున్న టమోటాల ధర, తీవ్ర పభావం చూపుతున్న వర్షాలు, గగ్గోలు పెడుతున్న వినియోగదారులు
ఇంకా చెప్పాలంటే ఇది పెట్రోల ధరను (After petrol, tomato price Hits 160/kg) దాటేసింది. రెండు నెలల క్రితం కిలో టమోటా ధర (Tomoto Price) రూ.10లు ఉండగా.. ఇప్పుడు 10 రెట్లు పెరిగింది. దేశంతో పాటు తెలుగు రాష్ట్రాల్లోనూ టమాటో ధరలు విపరీతంగా పెరగడంతో సామాన్యులు తలపట్టుకుంటున్నారు.
Hyd, Nov 23: ఒకప్పుడు ఉల్లి ధర వినియోగదారులను హడలెత్తించగా ఇప్పుడు టమోటా ధర (Tomato Price Hike) చుక్కలు చూపిస్తోంది. ఇంకా చెప్పాలంటే ఇది పెట్రోల ధరను (After petrol, tomato price Hits 160/kg) దాటేసింది. రెండు నెలల క్రితం కిలో టమోటా ధర (Tomoto Price) రూ.10లు ఉండగా.. ఇప్పుడు 10 రెట్లు పెరిగింది. దేశంతో పాటు తెలుగు రాష్ట్రాల్లోనూ టమాటో ధరలు విపరీతంగా పెరగడంతో సామాన్యులు తలపట్టుకుంటున్నారు.
కిలో టమోటో ధర రూ.160కి చేరుకోవడంతో సామాన్యులు బెంబేలెత్తిపోతున్నారు. వర్షాలు, వరదల (Andhra Pradesh Floods) కారణంగా దిగుబడి సరిగా రాకపోవటంతో తీవ్రమైన టమాటో కొరత ఇప్పుడు దేశాన్ని వేధిస్తుంది. ఏ రాష్ట్రంలో చూసినా టమాటోలకు ఇబ్బంది ఉంది. టమాటోలకు అతిపెద్ద మార్కెట్ అయిన కోలార్ లో కూడా టమాటా ధరలు రికార్డ్ స్థాయిలో పెరిగాయి. 15 కిలోల టమాటాల బాక్స్ వెయ్యి రూపాయలకు పైగా పలుకుతుంది.
కూరగాయలలోనే అత్యధిక వినియోగం ఉండే టమాటో ధరలు చుక్కల్లో ఉండటంతో ధరలను తగ్గించాలని ప్రభుత్వాలకు సామాన్య ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లోనూ టమాట ధరలు విపరీతంగా పెరగడంతో సామాన్యులు కొనుగోలు చేయలేని పరిస్థితి నెలకొంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం కురుస్తున్న విపరీతమైన వర్షాలు, వరదలు కూడా టమాట ధరల పెరుగుదలకు కారణంగా కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లోని టమాటోలకు ఫేమస్ అయిన మదనపల్లి నుండి అత్యంత డిమాండ్ ఉన్న కూరగాయల సరఫరాకు అంతరాయం ఏర్పడింది. దీంతో హైదరాబాద్ మార్కెట్ లోనూ ధరలు అకస్మాత్తుగా పెరిగాయి.
ఈ నేపథ్యంలో తెలంగాణా రాష్ట్రంలో టమాటా ధరలు చుక్కలను చూస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో వరదల ప్రభావం తెలంగాణలోని కరీంనగర్ జిల్లాలో టమోటా ధరపైకూడా పడింది. మదనపల్లి నుండి కరీంనగర్ కు కూరగాయల సరఫరాకు అంతరాయం ఏర్పడింది. దీంతో అకస్మాత్తుగా టమాటా ధర పెరిగింది. ప్రస్తుతం కరీంనగర్ సహా తెలంగాణలోని పలు జిల్లాలో కిలో టమాటా ధర రూ. 100 లకంటే ఎక్కువగా ఉంది.
భారీవర్షాలు పడడంతో టమోటా రావడమే తగ్గిపోయింది. ధరలు తగ్గాలంటే ఇంకా చాలా కాలం పడుతుందని వ్యాపారులు అంటున్నారు. టమోటాకు బదులు ఇతర కూరగాయలు వాడుతున్నామని మహిళలు చెబుతున్నారు. కర్రీ సెంటర్లలో టమోటా పేరు చెబితే కనిపించడం లేదు. కూరల్లో టమోటాను నిషేధించారు. సాంబారు, టమోటా చట్నీకి రాం రాం చెప్పారు. టమోటా చట్నీ కావాలంటే అదనంగా చెల్లించాలని టిఫిన్ సెంటర్లవారు అంటున్నారు.
ఇక బెంగుళూరు నగరంలో అయితే టమోటా ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. అక్కడ ఈ రోజు కేజీ రూ. 160 దాకా పలికింది.