AIIMS Doctors Saves Jawan Life: ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 90 నిమిషాల పాటు ఆగిపోయిన యువ సైనికుడి గుండె.. బతికించిన భువనేశ్వర్ ఎయిమ్స్ డాక్టర్లు.. వైద్య చరిత్రలోనే అరుదైన సంఘటన

ఇదీ అలాంటి ఘటనే. గంటన్నరపాటు ఆగిపోయిన ఓ యువ సైనికుడి గుండెను భువనేశ్వర్ లోని ఎయిమ్స్ వైద్యులు తిరిగి కొట్టుకునేలా చేశారు.

AIIMS Doctors Saves Jawan Life (Credits: X)

Newdelhi, Nov 19: వైద్య చరిత్రలో ఎన్నో అద్భుతమైన ఘటనలు జరుగుతుంటాయి. ఇదీ అలాంటి ఘటనే. గంటన్నరపాటు ఆగిపోయిన ఓ యువ సైనికుడి (Jawan) గుండెను (Heart) భువనేశ్వర్ లోని ఎయిమ్స్ వైద్యులు తిరిగి కొట్టుకునేలా చేశారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. 24 ఏళ్ల జవాను శుభాకాంత్ సాహు గత నెల 1న అనారోగ్యంతో భువనేశ్వర్‌ లోని ఎయిమ్స్‌ లో చేరాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే అతడి గుండె పనిచేయడం మానేసింది. అతడిని బతికించేందుకు వైద్యులు 40 నిమిషాలపాటు సీపీఆర్‌ చేసినా ఫలితం లేకుండా పోయింది. దీంతో ఎక్స్‌ ట్రాకార్పోరియల్ కార్డియో పల్మనరీ రిససిటేషన్ (ఈసీపీఆర్) ప్రయోగించాలని వైద్యులు నిర్ణయించారు.

‘కాగ్’ చీఫ్ గా తొలి తెలుగు వ్యక్తి సంజయ్‌ మూర్తి.. సంజయ్‌ మూర్తి తండ్రి కేఎస్ఆర్ మూర్తి అమలాపురం మాజీ ఎంపీ

90 నిమిషాల తర్వాత..

వైద్య బృందం ఎక్స్‌ ట్రాకార్పోరియల్ మెంబ్రేన్ ఆక్సిజనేషన్ (ఎక్మో)తో చికిత్స ప్రారంభించింది. దీంతో 90 నిమిషాల తర్వాత సాహు గుండెలో చలనం వచ్చి కొట్టుకోవడం ప్రారంభించింది. ఇప్పుడు జవాన్ కోలుకుంటున్నాడు. వైద్య చరిత్రలో ఇదో అరుదైన ఘటన అని పలువురు పేర్కొన్నారు.

తెలంగాణలో నేటి నుంచి డిగ్రీ, పీజీ కాలేజీల నిరవధిక బంద్‌.. కారణం ఏంటంటే?



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif