AP Cabinet key Decisions: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవిగో, కర్నూల్‌లో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం, ఈగల్ పేరుతో యాంటీ నార్కోటిక్స్ విభాగం ఏర్పాటు

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ సమావేశంలో రాష్ట్రంలో రూ. 85 వేల కోట్ల పెట్టుబడులకు సంబంధించి ఎస్ఐపీబీ నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

AP Cabinet key Decisions: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవిగో, కర్నూల్‌లో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం, ఈగల్ పేరుతో యాంటీ నార్కోటిక్స్ విభాగం ఏర్పాటు
Andhra Pradesh cabinet meeting (Phoot-X/APCMO)

Vjy, Nov 20: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ సమావేశంలో రాష్ట్రంలో రూ. 85 వేల కోట్ల పెట్టుబడులకు సంబంధించి ఎస్ఐపీబీ నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఏపీ టూరిజం పాలసీకి కేబినెట్ ఆమోదం తెలిపింది.

జ్యుడిషియల్ ప్రివ్యూ రద్దు బిల్లుకు మంత్రి వర్గ సమావేశం ఆమోదం తెలిపింది. ఏపీ ఇన్ ఫ్రా ట్రాన్స్ పరెన్సీ యాక్ట్ 2019 రిపీట్ చేయాలని కేబినెట్ సమావేశం ప్రతిపాదించింది. ఇక పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో స్థానిక సంస్థల్లో ఛైర్మన్లపై అవిశ్వాసం పెట్టే అంశంపై చట్ట సభరణ బిల్లుకు కేబినెట్ సమావేశం ఆమోదం తెలిపింది.

రాష్ట్రంలో నేరాలను నియంత్రించేందుకు పీడీ యాక్ట్ పటిష్టం చేస్తూ సవరణ బిల్లుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. లోకాయుక్త చట్ట సవరణ బిల్లుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అవిశ్వాసం గడువును నాలుగేళ్ల నుంచి రెండేళ్లకు కుదిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో పాటు క్రీడా పాలసీకి కూడా మంత్రి వర్గ సమావేశం ఆమోదం తెలిపింది.

పదేళ్లు చంద్రబాబు సీఎం అంటూ పవన్ వ్యాఖ్యలపై స్పందించిన జగన్, మంచి పనులు చేసినవారిని ప్రజలు ఆశీర్వదిస్తారని వెల్లడి

ఏపీ టవర్స్ లిమిటెడ్ ను ఏపీ స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్ లో విలీనం చేసేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఎస్ఐపీబీ నిర్ణయాలకు కేబినెట్ సమావేశం ఆమోదం తెలిపింది. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు కూడా మంత్రి వర్గ సమావేశం ఆమోదం తెలిపింది. అమరావతి సాంకేతిక కమిటీ ప్రతిపాదనలకు కూడా ఆమోదం తెలిపింది.డ్రగ్స్ నియంత్రణ కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన యాంటీ నార్కోటిక్స్ టాస్క్ ఫోర్స్ పేరును ఈగల్‌గా (ఎలైట్ యాంటీ నార్కటిక్ గ్రూప్‌గా) మారుస్తూ క్యాబినెట్ తీర్మానం చేసింది.

ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2.0 కోసం గృహ నిర్మాణ శాఖ చేసుకోనున్న ఒప్పందానికి క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఏపీ టవర్స్ లిమిటెడ్‌ను ఏపీ స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్‌లో విలీనం చేసేందుకు క్యాబినెట్ ఆమోదం లభించింది. ఏపీ టవర్స్ లిమిటెడ్‌కు చెందిన మూలధనం, ఆస్తులు, అప్పులు బదలాయిస్తూ ప్రతిపాదన చేశారు.

AP కేబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు ఇవే..

85వేల కోట్ల పెట్టుబడులకు సంబంధించి ఎస్ఐపీబీ నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదం

నేరాలను నియంత్రించేందుకు పీడీ యాక్ట్ పటిష్టం చేస్తూ సవరణ బిల్లుకు మంత్రివర్గం ఆమోదం

లోకాయుక్త చట్ట సవరణ బిల్లు కు మంత్రివర్గం ఆమోదం

లోకాయుక్త నియామకంలో ప్రతిపక్ష నేత లేనప్పుడు ఏం చేయాలనేదానిపై చర్చ

పార్లమెంట్ లో అనుసరించిన విధానం కొనసాగించాలని నిర్ణయం

దేవాలయ కమిటీల్లో ఇద్దరు సభ్యులకు చోటు కల్పించేలా చట్టసవరణ బిల్లుకు మంత్రివర్గం ఆమోదం

కర్నూల్ లో హైకోర్టు బెంచ్ ఏర్పాటు కు నిర్ణయం

ఈగల్ పేరు తో యాంటీ నార్కోటిక్స్ విభాగం ఏర్పాటుకు నిర్ణయం. ఈగల్ పేరును సూచించిన సీఎం చంద్రబాబు.

కాంట్రాక్టర్లకు మొబిలైజేషన్ అడ్వాన్స్ లు పునరుద్ధరించాలని నిర్ణయం

ఏపీ టవర్ కార్పొరేషన్ ను ఫైబర్ గ్రిడ్ లో విలీనం చేయాలని నిర్ణయం

అమరావతి సాంకేతిక కమిటీ ఇచ్చిన ప్రతిపాదనలకు ఆమోదం

కొత్తగా టెండర్లు పిలిచి అమరావతి నిర్మాణ పనులు కొంసాగించేలా సాంకేతిక కమిటీ ప్రతిపాదనలు

స్పోర్ట్స్ పాలసీ, పర్యాటక పాలసీలకు మంత్రివర్గం ఆమోదం.

విజయవాడ విశాఖ మెట్రో రైల్ కు 100 శాతం కేంద్ర నిధులతో నిర్మాణానికి కేబినెట్ ఆమోదం

కల్చరల్ హెరిటేజ్ టెక్స్‌టైల్ టూరిజంతో పాటు సేఫ్టీ పాలసీపైన కూడా కేబినేట్‌లో సూచనలు

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)


సంబంధిత వార్తలు

Makaravilakku 2025 Date And Makara Jyothi Timings: శబరిమల మకరజ్యోతి దర్శన సమయం ఎప్పుడు.. వివరాలు ఇక్కడ తెలుసుకోండి..

Silo Collapses At Chhattisgarh: చత్తీస్‌గఢ్‌లో భారీ ప్రమాదం, సైలో కంపెనీలో నిర్మాణం కుప్పకూలి నలుగురు మృతి

Pushpa 2 To Release In China: చైనాలో రఫ్పాడించేందుకు సిద్దమైన పుష్ప-2, ఇక దంగల్ రికార్డులను బద్దలు కొట్టడమే అల్లు అర్జున్ లక్ష్యం

Vaikunta Ekadasi 2025 Wishes In Telugu: వైకుంఠ ఏకాదశి రోజున మీ సన్నిహితులు, స్నేహితులు, బంధువులకు శుభాకాంక్షలను ఫోటో గ్రీటింగ్స్ రూపంలో తెలియజేయండి..

Share Us