Andhra Pradesh: వీడియో ఇదిగో, అర్థరాత్రి పోలీస్ స్టేషన్లో మహిళా హోంగార్డుతో హెడ్ కానిస్టేబుల్‌ దారుణం, చేయి పట్టుకుని అసభ్య ప్రవర్తన, సస్పెండ్ చేసిన ఉన్నతాధికారులు

డ్యూటీలో ఉన్న మహిళా హోంగార్డును అర్ధరాత్రి రెండు గంటలకు చెయ్యి పట్టుకుని అసభ్యకరంగా ప్రవర్తించాడు హెడ్ కానిస్టేబుల్ ప్రసాద్

head-constable-misbehaves-with-female-home-guard in Bommuru Police Station

తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో బొమ్మూరు పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్ దుశ్చర్యకు పాల్పడ్డాడు. డ్యూటీలో ఉన్న మహిళా హోంగార్డును అర్ధరాత్రి రెండు గంటలకు చెయ్యి పట్టుకుని అసభ్యకరంగా ప్రవర్తించాడు హెడ్ కానిస్టేబుల్ ప్రసాద్.   ఫోన్లో దీన్నిమహిళా హోంగార్డు చిత్రీకరించింది. బాధిత హోంగార్డ్ భర్తతో కలిసి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో ఎస్పీ ఆదేశాలతో ఎఫ్ఆర్ నమోదు చేసి కానిస్టేబుల్ ను సస్పెండ్ చేశారు అధికారులు.

 హైదరాబాద్‌ లో ఘోరమైన హత్యలు.. బేగంబజార్‌ లో భార్య, కుమారుడి మర్డర్.. ఆపై ఉరేసుకొని సూసైడ్ చేసుకున్న భర్త.. చాకచక్యంగా తప్పించుకున్న పెద్ద కొడుకు (వీడియో) 

ఈ నెల 8వ తేదీన బాధిత మహిళ బొమ్మూరు స్టేషన్‌లో నైట్ డ్యూటీలో ఉన్నారు. ఆమెతో పాటు ఓ మహిళా పీసీ కూడా విధుల్లో ఉండగా.. ఆమె నిద్రలోకి జారుకున్నారు. హోంగార్డు ఉన్న బాధిత మహిళ తన ఫోన్ చూసుకుంటూ ఉన్నారు. అయితే అర్ధరాత్రి దాటాక హెడ్ కానిస్టేబుల్ సాగర్ ప్రసాద్ అక్కడికి వచ్చాడు. ఒంటరిగా ఉన్న ఆమెతో ప్రసాద్‌ అసభ్యకరంగా మాట్లాడి, చెయ్యి పట్టుకునేందుకు యత్నించాడు. అయితే ఈ చర్యను బాధిత మహిళ ప్రతిఘటించారు.

head-constable-misbehaves-with-female-home-guard in Bommuru Police Station

హెడ్ కానిస్టేబుల్ సాగర్ ప్రసాద్ అసభ్య ప్రవర్తనను ఫోన్‌లో చిత్రీకరించేందుకు ఆమె ప్రయత్నించారు. దీంతో సాగర్ ప్రసాద్ వెటనే స్టేషన్ నుంచి వెళ్లిపోయాడు. ఈ ఘటనకు సంబంధించి బాధితురాలు తన భర్తతో బుధవారం రోజున జిల్లా పోలీసు ఉన్నతాధికారులను కలిసి ఫిర్యాదు చేశారు. ఎస్పీ ఆదేశాలతో ప్రసాద్‌ను సస్పెండ్‌ చేసినట్లు సీఐ చెప్పారు.



సంబంధిత వార్తలు

Andhra Pradesh: వీడియో ఇదిగో, అర్థరాత్రి పోలీస్ స్టేషన్లో మహిళా హోంగార్డుతో హెడ్ కానిస్టేబుల్‌ దారుణం, చేయి పట్టుకుని అసభ్య ప్రవర్తన, సస్పెండ్ చేసిన ఉన్నతాధికారులు

Weather Forecast: బంగాళాఖాతంలో మరో రెండు అల్పపీడనాలు, వాయుగుండంగా మారే అవకాశం, ఏపీకి భారీ వర్షాలు తప్పవని సూచన, తెలంగాణను చంపేస్తోన్న చలి పులి

Swarnandhra-2047: స్వర్ణాంధ్ర 2047 విజన్‌ డాక్యుమెంట్‌ను ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు, పరిపాలన ప్రారంభించిన 6 నెలల్లోనే విజన్‌ డాక్యుమెంట్‌ రూపొందించామని వెల్లడి

Swarnandhra Vision 2047: నేడు స్వర్ణాంధ్ర విజన్-2047 కార్యక్రమం... విజయవాడలో ట్రాఫిక్ ఆంక్షలు.. ఉదయం 8 గంటల్లోపు ఆఫీసులు, దుకాణాలకు వెళ్లాలని సూచన