UP Shocker: ఇదేమి కోపం బాబోయ్, పనోడి ముక్కు కొరికేసిన రాజకీయ నాయకుడు, యూపీలో ఘటన వెలుగులోకి, నిందితుడిని సచిన్ సాహుగా గుర్తించిన పోలీసులు

ఈ సంఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని లలిత్‌పుర్‌లో సోమవారం వెలుగులోకి వచ్చింది.

Representational Image | (Photo Credits: PTI)

Lalitpur, August 8: లలిత్‌పూర్‌కు చెందిన ఓ రాజకీయ నాయకుడు ఆవేశంతో (Angry political leader) 16 ఏళ్ల నిరుపేద బాలుడి ముక్కును కొరికాడని ( bites off minor’s nose) సోమవారం పోలీస్ వర్గాలు తెలిపాయి. ఈ సంఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని లలిత్‌పుర్‌లో సోమవారం వెలుగులోకి వచ్చింది.తీవ్ర రక్తస్రావమైన బాలుడిని శనివారం రాత్రి స్థానిక ఆసుపత్రిలో చేర్చి, చికిత్స కోసం ఝాన్సీ మెడికల్ కాలేజీకి రెఫర్ చేశారు. కత్తుల, బీరు బాటిళ్లతో వెంబడించి కానిస్టేబుల్ దారుణ హత్య, నంద్యాలలో నడిరోడ్డు మీద దారుణం, కేసు నమోదు చేసుకున్న పోలీసులు

నివేదికల ప్రకారం, బాలుడు అభయ్ నామ్‌దేవ్, ఓ రాజకీయ నాయకుడి ఇంట్లో గృహ సహాయకుడిగా పనిచేస్తున్నాడు. అయితే ఒక చిన్న విషయంపై అతనితో కోపం తెచ్చుకున్నాడు. వెంటనే పట్టుకుని అతని ముక్కు కొరికాడు.అయితే బాలుడి కుటుంబీకులు ఇప్పటి వరకు ఎలాంటి ఫిర్యాదు చేయకపోవడంతో ఎలాంటి చర్యలు తీసుకోలేదు.మరోవైపు నిందితుడిని సచిన్ సాహుగా గుర్తించామని, అతడు మానసిక స్థితి సరిగా లేదని ఎస్పీ లలిత్‌పూర్ నిఖిల్ పాఠక్ తెలిపారు.