Anil Kumar Yadav: మేము అధికారంలోకి వచ్చిన తర్వాత వడ్డీతో సహా చెల్లిస్తాం, వైసీపీ నేతల అరెస్టులపై స్పందించిన అనిల్ కుమార్ యాదవ్, పార్టీ మారుతున్నారనే వార్తలు కొట్టివేత

మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కూడా పార్టీ మారబోతున్నారనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఈ వార్తలపై అనిల్ కుమార్ యాదవ్ స్పందించారు.

Nara Lokesh vs Anil Kumar Yadav

Nellore, Nov 20: కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత పలువురు వైసీపీ నేతలు ఆ పార్టీని వీడారు. మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కూడా పార్టీ మారబోతున్నారనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఈ వార్తలపై అనిల్ కుమార్ యాదవ్ స్పందించారు. తనపై కొన్ని మీడియా ఛానళ్లు దుష్ప్రచారం చేస్తున్నాయని, రేటింగ్ లు పెంచుకునేందుకే ఇలా చేస్తున్నారని మండిపడ్డారు.

వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌ను మళ్లీ ముఖ్యమంత్రిని చేస్తామన్నారు. అలాగే, రాష్ట్రంలో వైఎస్సార్‌సీపీకి పూర్వవైభవం తీసుకొస్తామని చెప్పుకొచ్చారు.నెల్లూరులో మీడియాతో మాట్లాడుతూ..నేను పార్టీ మారుతున్నానంటూ కొన్ని చానల్స్‌ తప్పుడు ప్రచారం చేస్తున్నాయి. నేను రాజకీయాల్లో ఉన్నంత కాలం వైఎస్‌ జగన్‌ వెంటే ఉంటాను. వచ్చే ఎన్నికల్లో నెల్లూరు జిల్లాను క్లీన్‌స్వీప్‌ చేసేలా కృషి చేస్తాం. వైఎస్‌ జగన్‌ను మళ్లీ ముఖ్యమంత్రిని చేస్తామని అన్నారు.

పదేళ్లు చంద్రబాబు సీఎం అంటూ పవన్ వ్యాఖ్యలపై స్పందించిన జగన్, మంచి పనులు చేసినవారిని ప్రజలు ఆశీర్వదిస్తారని వెల్లడి

కొన్ని వ్యక్తిగత కారణాల రీత్యా కొద్ది రోజులు జిల్లా రాజకీయాలకు దూరంగా ఉన్నాను. త్వరలోనే జిల్లా రాజకీయాల్లో యాక్టివ్ అవుతాను.. నాన్ స్టాప్ కార్యక్రమాలు చేస్తాం. పాత కేసుల్లో తనను అక్రమంగా అరెస్టు చేయాలంటూ కొందరు లోకేష్ వెంట తిరుగుతున్నారు. అధికారం చేతిలో పెట్టుకుని.. నాపై అక్రమ కేసులు పెట్టించి శునకానందం పొందాలని చూస్తున్నారు. ఎన్ని కేసులు అయినా పెట్టుకోండి భరిస్తా.. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత వడ్డీతో సహా చెల్లిస్తా.

ఎవరు పోస్టింగ్‌ పెట్టినా వైఎస్సార్‌సీపీ సోషల్‌ మీడియా యాక్టివిస్టులను అరెస్ట్‌ చేస్తూ కూటమి ప్రభుత్వం శునకానందం పొందుతోంది. నాలుగు కేసులు పెట్టినంత మాత్రాన మేము భయపడతాం అనుకుంటే అంతకన్నా పొరపాటు మరొకటి లేదు. ఇక్కడ భయపడే వారు ఎవరూ లేరు. గతంలో మా ప్రభుత్వంలో మేము ఇలాగే కేసులు పెట్టాలనుకుంటే ఇంతకన్నా ఎక్కువ కేసులు అయ్యేవి.

కానీ, మేము అలా చేయలేదు. రానున్న కాలంలో మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పరిస్థితులు వేరేగా ఉంటాయి. అరెస్ట్‌లపై కూటమి నేతలు మాకు ఒక దారి చూపించారు. రానున్న కాలంలో తప్పకుండా తప్పులకు పాల్పడిన వారికి శిక్ష తప్పదు అంటూ హెచ్చరించారు.



సంబంధిత వార్తలు