AP CM Chandrababu: గత ఐదేళ్లలో వ్యవస్థలన్నీ విధ్వంసానికి గురయ్యాయి..జీవోలను రహస్యంగా ఉంచారని సీఎం చంద్రబాబు మండిపాటు, అధికారాన్ని దుర్వినియోగం చేయడం రాజ్యాంగ ఉల్లంఘనే అని కామెంట్
గత ఐదేళ్లలో జీవోలను రహస్యంగా ఉంచారు అని వైసీపీ అధినేత జగన్‌పై మండిపడ్డారు ఏపీ సీఎం చంద్రబాబు. ఏపీ సచివాలయం 5వ బ్లాక్ లో నిర్వహించిన రాజ్యాంగ దినోత్సవంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు , ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ , మంత్రులు, అధికారులు పాల్గొన్నారు.
Vijayawada, Nov 26: గత ఐదేళ్లలో వ్యవస్థలన్నీ విధ్వంసానికి గురయ్యాయి. గత ఐదేళ్లలో జీవోలను రహస్యంగా ఉంచారు అని వైసీపీ అధినేత జగన్‌పై మండిపడ్డారు ఏపీ సీఎం చంద్రబాబు. ఏపీ సచివాలయం 5వ బ్లాక్ లో నిర్వహించిన రాజ్యాంగ దినోత్సవంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు , ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ , మంత్రులు, అధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడిన చంద్రబాబు...అందరికీ పవిత్రమైన, విశిష్టమైన రాజ్యాంగ వజ్రోత్సవ శుభాకాంక్షలు అన్నారు. భారత రాజ్యాంగం ప్రపంచంలోనే అతి పెద్దది... భవిష్యత్‌లో ఎదురయ్యే సవాళ్లను ఊహించి రాజ్యాంగం రచించారు అన్నారు.
ప్రపంచ దేశాల రాజ్యాంగాలను అధ్యయనం చేసి, ఉత్తమమైన రాజ్యాంగంగా భారత రాజ్యాంగాన్ని డాక్టర్ అంబేద్కర్ గారు తీర్చిదిద్దారు. రాజ్యాంగ పరిషత్‌లో తెలుగువాళ్లు ప్రధానపాత్ర పోషించారు అని గుర్తు చేశారు. సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయం అందరికీ అందాలనే లక్ష్యంతో రాజ్యాంగాన్ని రూపొందించారు అన్నారు. ఏపీలో మూడు రాజ్యసభ స్థానాలకు నోటిఫికేషన్, వైసీపీ ఎంపీల రాజీనామాతో ఖాళీ అయిన స్థానాలు..మూడు టీడీపీ ఖాతాలోకే!
రాజ్యాంగ స్ఫూర్తిని అందరూ గుర్తుపెట్టుకోవాలని... ఓటు హక్కు ద్వారా రాజ్యాంగాన్ని కాపాడుకోగలుగుతున్నాం అన్నారు. రాజ్యాంగాన్ని దుర్వినియోగం చేసిన నేతలకు ఓటు ద్వారా ప్రజలు బుద్ధి చెబుతున్నారు అన్నారు. గత 5 ఏళ్ళలో ప్రాథమిక హక్కులను కూడా ఎలా కాలరాశారో చూశాం. అధికారాన్ని దుర్వినియోగం చేయడం రాజ్యాంగ ఉల్లంఘనే. రాజ్యాంగం ఇచ్చిన అధికారాన్ని ప్రజల కోసం ఉపయోగించాలన్నారు. ఆర్థిక స్వాతంత్య్రాన్ని అందరికీ కల్పిస్తే.. సామాజిక న్యాయం జరుగుతుందన్నారు.