Amaravathi Capital Change Issue: ఏపీ రాజధాని అమరావతే, రాజధానిని అమరావతి నుంచి తరలించే ప్రసక్తే లేదు, అసెంబ్లీలో లిఖిత పూర్వక సమాధానం ఇచ్చిన మంత్రి బొత్స సత్యనారాయణ

ఏపీ రాజధానిగా అమరావతి (Amaravathi) ఉంటుందని దానిని ఎక్కడికి తరలించబోమని ఏపీ సర్కార్ స్పష్టం చేసింది. అసెంబ్లీలో ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. అమరావతిని మారుస్తున్నారా ? అని మండలిలో టీడీపీ (TDP) సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి బొత్స సత్యానారాయణ (Minister Botsa Satyanarayana) లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు.

ap-government-clarity-on-amaravati-capital-change-issue (Photo-wikimedia commons)

Amaravathi, December 14: గత కొద్ది రోజులుగా సస్పెన్స్ క్రియేట్ చేస్తున్న ఆంధ్రప్రదేశ్ రాజధాని (Andhra pradesh Captial) అంశంపై జగన్ సర్కార్ (YS Jagan GOVT) క్లారిటీ ఇచ్చింది. ఏపీ రాజధానిగా అమరావతి (Amaravathi) ఉంటుందని దానిని ఎక్కడికి తరలించబోమని ఏపీ సర్కార్ స్పష్టం చేసింది.

అసెంబ్లీలో ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. అమరావతిని మారుస్తున్నారా ? అని మండలిలో టీడీపీ (TDP) సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి బొత్స సత్యానారాయణ (Minister Botsa Satyanarayana) లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు. రాజధానిని మార్చడం లేదని ఈ సందర్భంగా  స్పష్టం చేశారు. మరోవైపు రాజధానిపై ప్రభుత్వం నిపుణుల కమిటీని నియమించిన విషయం తెలిసిందే.

కాగా వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాజధానిపై తరలిస్తారన్న చర్చ జరిగింది. మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు అప్పట్లో తీవ్ర దుమారం రేపాయి. ప్రభుత్వ వైఖరి ఏంటో చెప్పాలని డిమాండ్స్ వినిపించాయి. రాజధానిని అక్కడే కొనసాగించాలని, వేలాది ఎకరాల భూములు ఇచ్చామని వెల్లడిస్తున్నారు. కాగా రాజధాని నిర్మాణ పనులను కొనసాగించాలని ఈ మధ్యనే సీఎం జగన్ ఆదేశాలు ఇచ్చారు. తాజాగా మంత్రి బొత్స లిఖిత పూర్వక ప్రకటనతో అమరావతిని ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ఉంటుందని స్పష్టత వచ్చింది.