Ram Gopal Varma: రామ్ గోపాల్ వర్మకు అన్నీ కేసుల్లో షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన ఏపీ హైకోర్టు, పోలీసుల విచారణకు సహకరించాలని సూచన
ఆర్జీవీకి అన్నీ కేసుల్లో షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. సోషల్ మీడియా పోస్టుల వ్యవహారంలో ఆర్జీవీపై ప్రకాశం జిల్లా మద్దిపాడు, గుంటూరు జిల్లా తుళ్లూరు, అనకాపల్లి జిల్లా రావికమతం స్టేషన్‌లలో కేసులు నమోదయ్యాయి.
ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మకు ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. ఆర్జీవీకి అన్నీ కేసుల్లో షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. సోషల్ మీడియా పోస్టుల వ్యవహారంలో ఆర్జీవీపై ప్రకాశం జిల్లా మద్దిపాడు, గుంటూరు జిల్లా తుళ్లూరు, అనకాపల్లి జిల్లా రావికమతం స్టేషన్‌లలో కేసులు నమోదయ్యాయి.
తనపై నమోదు చేసిన కేసుల్లో ముందస్తు బెయిలు మంజూరు చేయాలంటూ ఆర్జీవీ హైకోర్టును ఆశ్రయించారు. పిటిషన్లపై ఏపీ హైకోర్టు మంగళవారం (డిసెంబర్10) విచారణ చేపట్టిన కోర్టు ఆర్జీవీపై నమోదైన అన్నీ కేసుల్లో షరతులతో కూడిన ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. నమోదైన కేసుల విషయంలో పోలీసుల విచారణకు సహకరించాలని సూచించింది.