Hyd, Dec 2: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తనపై నమోదైన కేసులపై టాలీవుడ్ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ మరోసారి స్పందించారు. హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్‌లో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో తనపై నమోదైన కేసులపై మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ.. ఏడాది క్రితం తాను పెట్టిన పోస్టుపై ఎవరి మనోభావాలో దెబ్బతిన్నాయని కేసులు పెట్టడం ఏంటో నాకర్థం కావడం లేదన్నారు.
ఒక ఏడాదిలో నేను వందల పోస్టులు పెడతానని.. కానీ అవన్నీ నాకు గుర్తుండవని ఆర్జీవీ తెలిపారు. నేను పోస్ట్ పెట్టిన ఏడాది తర్వాత నలుగురు, ఐదుగురు ఎందుకు కేసులు పెడుతున్నారని ఆయన ప్రశ్నించారు. గతనెల 25న విచారణకు రావాలని పోలీసులు నోటీసులు పంపించారని ఆర్జీవీ వెల్లడించారు. ఆ తర్వాత నేను పోలీసులకు మేసేజ్ పెట్టానని.. కానీ వాళ్లు కొందరు మీడియావాళ్లతో కలిసి వచ్చారని తెలిపారు.
దానికి ఆ మీడియా సంస్థలు ఏవేవో కథనాలు రాశాయని అన్నారు. సోషల్ మీడియా కంటే ముందుగా మెయిన్ స్ట్రీమ్ మీడియా నన్ను టార్గెట్ చేసి పోస్టులు పెడుతున్నారని పేర్కొన్నారు. సోషల్ మీడియాలో ఎవరెవరో ఏవేవో రాస్తారని.. నేను టీవీ ఛానెల్స్‌కి ఇంటర్వ్యూ ఇస్తుంటే పారిపోయాడంటూ ప్రచారం చేశారని రాంగోపాల్ వర్మ వెల్లడించారు.
ప్రభుత్వం మారినా పోలీసులు ఇంకా వైసీపీకి సపోర్ట్ చేస్తున్నారని కొందరు తప్పుడు కథనాలు నాపై ప్రసారం చేశారని మండిపడ్డారు. మీ అభిప్రాయం చెప్పినప్పుడు.. నా అభిప్రాయంగా కూడా తీసుకోవాలి కదా.. అదే స్పిరిట్ అని ప్రశ్నించారు. నేను ఏదైనా పోస్ట్ పెడితే 90శాతం నెగిటివ్ కామెంట్స్ ఉంటాయని ఆయన తెలిపారు. ఇంత మంది ఒకేసారి కేసులు పెట్టడంపై ముందస్తు బెయిల్‌కు పిటిషన్ వేసినట్లు వెల్లడించారు.
Ram Gopal Varma Reacts Again on Andhra Pradesh Police Notice
మెయిన్ స్ట్రీమ్ మీడియాపై ఆర్జీవీ విసుర్లు..
కథ, స్క్రీన్ ప్లే మొత్తం క్రియేట్ చేసేశారు
సోషల్ మీడియా కంటే మెయిన్ స్ట్రీమ్ మీడియా డేంజర్
నా డెన్ లోకి పోలీసులు రాలేదు
నేను పరారీలో ఉన్నానని ప్రచారం చేసేశారు
- రామ్ గోపాల్ వర్మ pic.twitter.com/YKX6vEslnJ
— ChotaNews (@ChotaNewsTelugu) December 2, 2024
అరెస్ట్ చేస్తమని పోలీసులు చెప్పలేదు : రామ్ గోపాల్ వర్మ#ramgopalvarma #newsreporter #pressmeet #V6News #V6 #V6Velugu pic.twitter.com/FsT3LUf7nr
— V6 News (@V6News) December 2, 2024
అయితే నేను వ్యూహం రిలీజ్ టైములో పొలిటికల్ సినిమా తీయనని చెప్పానని.. ఆ మూవీ విషయంలో సెన్సర్ వాళ్లతో ఇబ్బంది పడి ఇక చేయనని చెప్పినట్లు ఆర్జీవీ క్లారిటీ ఇచ్చారు. నన్ను అరెస్ట్ చేయడానికి డెన్‌కు వచ్చామని పోలీసులు ఎక్కడా చెప్పలేదని తెలిపారు. కాగా.. సోషల్ మీడియాలో ఆయన పెట్టిన పోస్టులపై కొందరు ఏపీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఇప్పటికే ఆ కేసులను క్వాష్ చేయాలంటూ ఆర్జీవీ పిటిషన్ వేశారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది.