APPSC Revises Exam Schedules: ఏపీపీఎస్సీ పరీక్షల షెడ్యూల్లో మార్పు, ఏప్రిల్ నుంచి మే నెలకు వాయిదా, సవరించిన పరీక్షల తేదీల వివరాలు ఓ సారి తెలుసుకోండి
కమిషన్ కార్యదర్శి పిఎస్ఆర్ అంజనేయులు విడుదల చేసిన ప్రకటన ప్రకారం, మార్చి 21 , 22వ తేదీ జరగాల్సిన డిగ్రీ కళాశాల లెక్చరర్ల పోస్టుకు నియామకం కోసం జరగాల్సిన పరీక్షను ఏప్రిల్ 3 మరియు 4 తేదీకి సవరించారు. ఈనెల 21, 22, 27, 28, 29 తేదీల్లో జరగాల్సిన ఈ పరీక్షలను ఏప్రిల్, మేలో నిర్వహించేలా కొత్త షెడ్యూళ్లను ప్రకటించింది.
Amaravati, Mar 19: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) కొన్ని పోస్టుల నియామకాలకు సంబంధించిన ప్రధాన పరీక్ష తేదీలను (APPSC Revises Exam Schedules) సవరించింది. కమిషన్ కార్యదర్శి పిఎస్ఆర్ అంజనేయులు విడుదల చేసిన ప్రకటన ప్రకారం, మార్చి 21 , 22వ తేదీ జరగాల్సిన డిగ్రీ కళాశాల లెక్చరర్ల పోస్టుకు నియామకం కోసం జరగాల్సిన పరీక్షను ఏప్రిల్ 3 మరియు 4 తేదీకి సవరించారు. ఈనెల 21, 22, 27, 28, 29 తేదీల్లో జరగాల్సిన ఈ పరీక్షలను ఏప్రిల్, మేలో నిర్వహించేలా కొత్త షెడ్యూళ్లను ప్రకటించింది.
ఏపీలో అన్ని స్కూళ్లు, కాలేజీలు మూసివేత
అదేవిధంగా టెక్నికల్ అసిస్టెంట్ (జియోఫిజిక్స్) పోస్టులకు నియామకాలు, భూగర్భజల ఉప-సేవలకు సంబంధించిన పరీక్షలను మార్చి 27 , 29 నుండి మే 18, 20 తేదీల్లో నిర్వహించనున్నారు. అదేవిధంగా, AP గ్రౌండ్ వాటర్ సబ్-సర్వీస్‌లో టెక్నికల్ అసిస్టెంట్స్ (హైడ్రాలజీ) పోస్టులకు సంబంధించిన పరీక్షలను మార్చి 28 నుండి మే 19కు రీ షెడ్యూల్ చేశారు.
ఎపి సైనిక్ వెల్ఫేర్ సబ్ సర్వీస్‌లో వెల్ఫేర్ ఆర్గనైజర్ పదవికి ఎపిపిఎస్‌సి నియామక పరీక్ష తేదీని మార్చి 28 నుంచి మే 19 వరకు మార్చారు. అంతేకాకుండా, సైనిక్ వెల్ఫేర్ సర్వీస్‌లో జిల్లా సైనిక్ సంక్షేమ అధికారుల నియామకాన్ని మార్చి 28, 29 నుంచి మార్చారు. ఈ పరీక్ష మే 19, 20 తేదీల్లో జరగనుంది. అదేవిధంగా, మార్చి 28 ,29వ తేదీల్లో జరగాల్సిన AP ఆర్కియాలజీ మరియు మ్యూజియమ్స్ సబ్-సర్వీస్‌లో టెక్నికల్ అసిస్టెంట్ల పోస్టులకు సంబంధించిన పరీక్షలను మే 19, 20 వ తేదీలకు మార్చారు. మార్చబడిన షెడ్యూల్ గురించి మరింత సమాచారం కమిషన్ వెబ్‌సైట్ www.psc.ap.gov.in లో చూడగలరు.
సవరించిన పరీక్షల తేదీల వివరాలు
డిగ్రీ కాలేజీ లెక్చరర్లు - ఏప్రీల్ 3, 4 వ తేదీలు
టెక్నికల్ అసిస్టెంట్స్-జియోఫిజిక్స్ ( గ్రౌండ్ వాటర్) : మే 18, 20
టెక్నికల్ అసిస్టెంట్స్-హైడ్రాలజీ ( గ్రౌండ్ వాటర్ : మే 19
వెల్పేర్ ఆర్గనైజర్-(సైనిక వెల్ఫేర్ ) : మే 19
జిల్లా సైనిక వెల్ఫేర్ ఆఫీసర్ : మే 19, 20
టెక్నికల్ అసిస్టెంట్స్ ( ఆర్కియాలజీ మ్యూజియం) - మే 19 ,20
టెక్నికల్ అసిస్టెంట్స్ ( మైన్స్, జియాలజీ) - మే 20
డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ సర్వే ( సర్వే ల్యాండ్ రికార్డ్స్) - మే 20