Amaravati, Mar 18: దేశ వ్యాప్తంగా కరోనావైరస్ (CoronaVirus) పంజా విసురుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (AP Govt) కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీలో (Andhra Pradesh) రేపటి నుంచి అన్ని విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించింది.
అన్ని యూనివర్సిటీలు, కాలేజీలు, పాఠశాలలు, కోచింగ్ సెంటర్లకు ఏపీ ప్రభుత్వం సెలవు (Schools and Colleges Closed in AP) ప్రకటించింది.దేశ వ్యాప్తంగా ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో స్కూళ్లకు సెలవులు ప్రకటించిన విషయం విదితమే.
ఒకేచోట ఎక్కువ మంది జనం గుమిగూడకూడదనీ, ప్రజలంతా కరోనాపై అప్రమత్తంగా ఉండాలని సీఎం ఈ సందర్భంగా ప్రజలకు సూచించారు. వైద్యుల సూచనల మేరకు పలు జాగ్రత్తలు పాటిస్తే.. కరోనా వైరస్‌ను దరిచేయనీయకుండా చేయొచ్చని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.
ఏపీలో తక్షణం ఎన్నికల కోడ్ ఎత్తేయండి
ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని విద్యాసంస్థలు మూసివేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లాలో ప్రస్తుతం ఓ కరోనా పాజిటివ్ కేసు మాత్రమే నమోదై ఉంది. ఇప్పటి వరకు అదనంగా ఎలాంటి కేసు కొత్తగా నమోదు కాలేదు.
ఏపీలో కరోనా నియంత్రణకు ఇప్పటికే గట్టి చర్యలు తీసుకుంటున్నట్టు ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఏపీలో విద్యాసంస్థలకు కూడా సెలవు ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అడిషనల్ చీఫ్ సెక్రటరీగా ఉన్న పీవీ రమేష్ ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీలు, కళాశాలలు, పాఠశాలలు, కోచింగ్ సెంటర్లతో సహా అన్ని విద్యాసంస్థలకు సెలవు ఇస్తున్నట్టు చెప్పారు.
Here's AP CM Addl Chief Secretary Tweet
To strengthen ongoing measures to prevent & contain #COVID19 in #AndhraPradesh, #government has decided to close all #Educational #Institutions with immediate effect. Strong advice to every person to act #responsibly & contribute to me mitigation of the #pandemic
— PV Ramesh (@RameshPV2010) March 18, 2020
ఈ నెల 31వరకు స్కూల్స్, కాలేజీలు బంద్ చేయాలని నిర్ణయం. కోచింగ్ సెంటర్ తో పాటు అన్నీ బంద్ చేయాలని ఆర్డర్ ఇచ్చింది.కాగా పరీక్షలు మాత్రం యధావిధిగా జరుగుతాయని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. కరోనా వైరస్ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడ్డాయి.
తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే మార్చి 31 వరకు సెలవులను ప్రకటించారు. అక్కడ పరీక్షలు మాత్రం యధావిధిగా జరుగుతాయని స్పష్టం చేశారు. ఇక కర్ణాటక, తమిళనాడులో కూడా గట్టి క్రమశిక్షణ చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో ఏపీ ప్రభుత్వం కూడా కరోనా వైరస్ నివారణకు ముందస్తు చర్యల్లో భాగంగా విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించింది.