Varikuntla Subbaiah Funeral: సైనిక లాంచనాలతో ముగిసిన ఆర్మీ జవాను వరికుంట్ల సుబ్బయ్య అంత్యక్రియలు, మతాలకతీతంగా భారీ ఎత్తున తరలివచ్చన ప్రజానీకం
అనంతపురం జిల్లా, శింగనమల నియోజకవర్గం నార్పలలో అశేష జనవాహిని మధ్య అంత్యక్రియలు జరిగాయి. మతాలకతీతంగా భారీ ఎత్తున ప్రజలు తరలివచ్చారు.
విధి నిర్వహణలో ఎల్‌ఓసీలో అమరుడైన వరికుంట్ల సుబ్బయ్య అంత్యక్రియలు సైనిక లాంఛనాలతో ముగిసాయి. అనంతపురం జిల్లా, శింగనమల నియోజకవర్గం నార్పలలో అశేష జనవాహిని మధ్య అంత్యక్రియలు జరిగాయి. మతాలకతీతంగా భారీ ఎత్తున ప్రజలు తరలివచ్చారు. ఆర్మీ అధికారులు సుబ్బయ్య భార్య, తల్లికి సుబ్బయ్య భౌతిక కాయంపై ఉంచిన జాతీయ జెండాను సైనిక లాంచనాలతో అందజేశారు.
కంభం మండలం రావిపాడుకు చెందిన వరికుంట్ల సుబ్బయ్య ఆర్మీలో రాష్ట్రీయ రైఫిల్స్‌లో హవల్దార్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఈ తరుణంలో జమ్మూకశ్మీర్‌లోని మినీ కాశ్మీర్‌గా పేరొందని పూంచ్ జిల్లా, పూంచ్ సెక్టార్ పరిధిలోని నియంత్రణ రేఖ(ఎల్‌ఓసీ) వెంట సహచర జవాన్లతో కలిసి పెట్రోలింగ్ చేస్తున్నారు. ఆ సమయంలో భూమిలో పాతిపెట్టిన మందుపాతరపై కాలు మోపారు. ఈ విషయాన్ని గుర్తించిన జవాను సుబ్బయ్య సహచరులను అప్రమత్తం చేసి వారిని ప్రమాదం నుంచి కాపాడారు. ఆ మందుపాతర నుంచి తాను మాత్రం తప్పించుకోలేకపోయాడు. ఎల్‌ఓసీలో అమరుడైన సుబ్బయ్య పార్ధీవ దేహాన్ని ఆర్మీ అధికారులు ప్రత్యేక వాహనంలో బుధవారం అర్ధరాత్రి అనంతపురం జిల్లా నార్పలకు తీసుకువచ్చారు. నేడు అంత్యక్రియలు నిర్వహించారు.
Varikuntla Subbaiah Funeral:
రియల్ హీరో సుబ్బయ్యకు సెల్యూట్
జమ్మూలో విధి నిర్వహణలో ఉన్న ప్రకాశం జిల్లా రావిపాడుకు చెందిన ఆర్మీ జవాన్ వరికుంట్ల సుబ్బయ్య ల్యాండ్‌మైన్ ఉచ్చు నుంచి తనతోటి జవాన్‌లు 30 మందిని కాపాడి, తాను మాత్రం దాని బారిన పడి ప్రాణాలుకోల్పోవడం బాధాకరం. తన కుటుంబ సభ్యులకు దేవుడు ధైర్యం…
వీర జవాను సుబ్బయ్యకు వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ నివాళులర్పించారు. ‘రియల్ హీరో సుబ్బయ్యకు సెల్యూట్. జమ్మూలో విధి నిర్వహణలో సుబ్బయ్య వీరమరణం చెందారు. ల్యాండ్‌మైన్ నుంచి 30 మంది జవాన్లను కాపాడి తాను మాత్రం ప్రాణాలు కోల్పోవడం బాధాకరం. సుబ్బయ్య కుటుంబ సభ్యులకు దేవుడు ధైర్యం ప్రసాదించాలి. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నివాళులర్పిస్తున్నా’అని వైఎస్ జగన్ ట్వీట్‌లో పేర్కొన్నారు.