Coal Shortage: దేశంలో తరుముకొస్తున్న బొగ్గు సంక్షోభం, పారిశ్రామిక రంగంలో ఒక్కసారిగా పెరిగిన విద్యుత్ డిమాండ్, ఢిల్లీలో విద్యుత్ సంక్షోభం విషయంలో జోక్యం చేసుకోవాలని ప్రధానికి లేఖ రాసిన సీఎం కేజ్రీవాల్
శంలో బొగ్గు సంక్షోభం (Coal Shortage) ఏర్పడుతోంది. కరోనా సెకండ్ వేవ్ తదనంతరం పారిశ్రామిక రంగంలో విద్యుత్ డిమాండ్ ఒక్కసారిగా పెరగడంతో డిమాండ్‌కు తగ్గట్లుగా బొగ్గు సరఫరా లేకపోవడమే ఇందుకు ప్రధాన కారణం. దీంతో థర్మల్ విద్యుత్ కేంద్రాలు తీవ్ర బొగ్గు సమస్యను ఎదుర్కొంటున్నాయి
New Delhi, October 9: దేశంలో బొగ్గు సంక్షోభం ఆందోళన కలిగిస్తోంది. కరోనా సెకండ్ వేవ్ తదనంతరం పారిశ్రామిక రంగంలో విద్యుత్ డిమాండ్ ఒక్కసారిగా పెరగడంతో డిమాండ్‌కు తగ్గట్లుగా బొగ్గు సరఫరా లేకపోవడమే ఇందుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి (AP CM YS jagan) ఈ సమస్య గురించి ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. తాజాగా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) కూడా ప్రధానికి లేఖ రాసినట్లు తెలిపారు.
ఢిల్లీలో విద్యుత్ సంక్షోభం ఏర్పడే అవకాశం ఉంది. విద్యుత్ కేంద్రాలలో ఒక రోజుకు సరిపడా మాత్రమే బొగ్గు నిల్వ ఉంది. తక్షణమే బొగ్గు సరఫరా, గ్యాస్ సరఫరాను అందించాలి. లేదంటే రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభం ఏర్పడే అవకాశం ఉంది. ఇప్పటికే బహిరంగ మార్కెట్లో యూనిట్ విద్యుత్ ధర 20 రూపాయలకు పెంచారు. దీన్ని నియంత్రించాలి. విద్యుత్తు కొరతను అధిగమించేందుకు అవకాశాన్ని వ్యక్తిగతంగా పరిశీలిస్తున్నాను. సంక్షోభాన్ని అధిగమించేందుకు సాధ్యమైనంత మేర పని చేస్తున్నాం. అంతేకాక ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని ప్రధానమంత్రికి లేఖ రాశాను’’ అని తెలిపారు.
ఈ క్రమంలో టాటా పవర్ ఆర్మ్ టాటా పవర్ ఢిల్లీ డిస్ట్రిబ్యూషన్ లిమిటెడ్ విద్యుత్ కొరత గురించి వినియోగదారులకు ఎస్‌ఎమ్‌ఎస్ ద్వారా సమాచారం ఇచ్చింది. శనివారం పంపిన ఎస్‌ఎమ్‌ఎస్‌లో ‘‘ఉత్తర జనరేషన్ ప్లాంట్లలో బొగ్గు లభ్యత తక్కువగా ఉన్నందున, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 6 గంటల మధ్య విద్యుత్ సరఫరా క్లిష్ట స్థాయిలో ఉంటుంది. విద్యుత్‌ని తెలివిగా వినియోగించుకోండి. బాధ్యతాయుతమైన పౌరుడిగా ఉండండి. అసౌకర్యానికి చింతిస్తున్నామంటూ టాటా పవర్ డీడీఎల్ మెసేజ్ చేసింది.
దేశంలో బొగ్గు సంక్షోభం (Coal Shortage) ఏర్పడుతోంది. కరోనా సెకండ్ వేవ్ తదనంతరం పారిశ్రామిక రంగంలో విద్యుత్ డిమాండ్ ఒక్కసారిగా పెరగడంతో డిమాండ్‌కు తగ్గట్లుగా బొగ్గు సరఫరా లేకపోవడమే ఇందుకు ప్రధాన కారణం. దీంతో థర్మల్ విద్యుత్ కేంద్రాలు తీవ్ర బొగ్గు సమస్యను ఎదుర్కొంటున్నాయి. ఇదే సమయంలో ప్రపంచ వ్యాప్తంగా బొగ్గు ధరలూ ఆకాశాన్నంటుతున్నాయి. ఈ ప్రభావం భారత్‌పైనా పడుతోంది.
పారిశ్రామిక, గృహ అవసరాల కోసం దేశంలో ఉత్పత్తి అయ్యే విద్యుత్‌లో సింహభాగం థర్మల్ కేంద్రాల నుంచే వస్తోంది. ఎన్టీపీసీ, టాటా పవర్, టొరెంట్ పవర్ ఇలా ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లోని చిన్నా పెద్దా అన్నీ కలిపి 135 థర్మల్ విద్యుత్ ప్లాంట్లు ఉండగా అవన్నీ ఇప్పుడు బొగ్గు కొరతను ఎదుర్కొంటున్నాయి. అసలు దేశవ్యాప్తంగా విద్యుదుత్పత్తి చేసే కేంద్రాల్లో బొగ్గు ఆధారిత ప్లాంట్ల వాటా 70శాతంగా ఉంది.
వీటిలో ఇప్పటికే 16 ప్లాంట్లలో బొగ్గు నిల్వలు అయిపోయి మూతపడ్డాయి. అంటే 16,880 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. 30 ప్లాంట్లలోని నిల్వలు కేవలం ఒక రోజులో అయిపోతాయి. దీంతో 37,345 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి ఆగిపోతుంది. 18 ప్లాంట్లు రెండు రోజుల్లోనూ, 19 ప్లాంట్లు 3 రోజుల్లోనూ, 9 ప్లాంట్లు నాలుగు రోజుల్లోనూ, 6 ప్లాంట్లు 5 రోజుల్లోనూ, 10 ప్లాంట్లు ఆరు రోజుల్లోనూ, ఒక ప్లాంటు ఏడు రోజుల్లోనూ బొగ్గు సరఫరా జరగకపోతే మూసుకోవాల్సిన పరిస్థితిలో ఉన్నాయి. ఇవన్నీ మూతపడితే దేశవ్యాప్తంగా 1,36,159 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోతుంది.
అంతర్జాతీయ మార్కెట్‌లో బొగ్గు ధరలు రికార్డు స్థాయిలో అంటే దాదాపు నలభై శాతం పెరిగాయి. ఇక దేశంలోని బొగ్గు ఉత్పత్తిలో 80శాతం వాటా కలిగిన కోల్ ఇండియా.. ప్రపంచ బొగ్గు ధరల్లో పెరుగుదల కారణంగా, దేశీయ బొగ్గు ఉత్పత్తిపై తాము ఆధారపడాల్సి వస్తోందని వెల్లడించింది. డిమాండ్‌కు తగ్గట్లుగా సరఫరా లేకపోవడంతో ఈ పరిస్థితి వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా విద్యుత్ ఉత్పత్తి, వినియోగంలో టాప్–2 దేశాలైన భారత్, చైనాలపైనే ఈ ప్రభావం ఎక్కువగా ఉంది.
ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే.. కొద్దిరోజుల్లోనే మన దేశం అసాధారణ విద్యుత్ సంక్షోభాన్ని ఎదుర్కోవడం ఖాయం. అదే జరిగితే విద్యుత్‌తో ముడిపడి ఉన్న అన్ని రకాల వ్యవస్థలపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంది. అంతేకాక.. విద్యుత్ అంతరాయాలు ఏర్పడే అవకాశాలున్నాయని అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో.. బొగ్గు ఉత్పత్తిని కనీసం 10–18 శాతానికి పెంచాలని కోల్ ఇండియా నిర్ణయించింది. దీనికి కేంద్రం ఆమోదం తెలపాల్సి ఉంది.
దేశంలో తలెత్తిన బొగ్గు కొరతతో ఉత్తరప్రదేశ్‌లోని 8 విద్యుత్ ప్లాంట్లు, ఇతర కారణాలతో మరో 6 విద్యుత్ ప్లాంట్లు మూతపడ్డాయి. దీంతో యూపీలో తాత్కాలికంగా మూతపడిన విద్యుత్ ప్లాంట్ల సంఖ్య 14కు చేరింది. ప్రస్తుతం విద్యుత్ డిమాండ్ 20,000 నుంచి 21,000 మెగావాట్లు ఉండగా, సరఫరా 17,000 మెగావాట్లు ఉంది. విద్యుత్ కొరతను అధిగమించేందుకు గ్రామీణ ప్రాంతాల్లో నాలుగు నుంచి ఐదు గంటల విద్యుత్ కోత విధిస్తున్నట్టు అధికారులు ప్రకటించారు.
తాత్కాలికంగా మూతపడిన 14 విద్యుత్ ప్లాంట్లు 4530 మెగావాట్ల విద్యుత్‌ను సరఫరా చేస్తున్నాయి. దీంతో ఎక్స్ఛేంజ్‌పై యూనిట్ విద్యుత్ రేటు రూ.20కి పైనే పెరిగే అవకాశం ఉంది. ఫలితంగా యూపీ ప్రభుత్వం ఒక్కో యూనిట్ రూ.15 నుంచి రూ.20కి కొనుగోలు చేయాల్సి వస్తుంది. అదీగాక, బొగ్గు బకాయిలను అధికారులు ఇంకా చెల్లించాల్సి ఉన్నందున కొత్త బొగ్గు సేకరణ మరింత క్లిష్టమవుతుందని అంటున్నారు.
(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)