Assembly Election Results 2022: ఎన్నికల సంఘం కీలక నిర్ణయం, ఐదు రాష్ట్రాల్లో విజయోత్సవాలపై నిషేధం ఎత్తివేత

దేశంలో ఐదు రాష్ట్రాల ఎన్నికలు ఎంత కీలకంగా మారాయో తెలిసిందే. అయితే ఇంత ముఖ్యమైన ఎన్నికల ఫలితాల సమయంలో వేడుకలు చేసుకోవడానికి వీల్లేదని ఎన్నికల సంఘం (EC) ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. ఫలితాలు (Assembly Election Results 2022) వెలువడుతున్న గురువారం నాడు పార్టీలకు ఈసీ గుడ్ న్యూస్ చెప్పింది.

Election Commission of India. File Image. (Photo Credits: PTI)

దేశంలో ఐదు రాష్ట్రాల ఎన్నికలు ఎంత కీలకంగా మారాయో తెలిసిందే. అయితే ఇంత ముఖ్యమైన ఎన్నికల ఫలితాల సమయంలో వేడుకలు చేసుకోవడానికి వీల్లేదని ఎన్నికల సంఘం (EC) ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. ఫలితాలు (Assembly Election Results 2022) వెలువడుతున్న గురువారం నాడు పార్టీలకు ఈసీ గుడ్ న్యూస్ చెప్పింది. కౌంటింగ్ ముందు, కౌంటింగ్ తర్వాత విజయోత్సవ ర్యాలీలపై నిషేధాన్ని ఉపసంహరించుకుంటున్నట్టు (EC lifts ban on victory processions) ప్రకటన విడుదల చేసింది. అయితే, ఎస్‌డీఎంఏ ఆదేశాలు, జిల్లా అధికారుల ఆంక్షలకు అనుగుణంగానే సడలింపులు ఉంటాయని పేర్కొంది.

దీనికి ముందు, కోవిడ్ కారణంగా విజయోత్సవ ర్యాలీలతో సహా ఇతర ఎన్నికల అంశాలను పరిగణనలోకి తీసుకున్న ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలను విడుదల చేసింది. క్రమంగా కోవిడ్ పరిస్థితులు మెరుగుపడటంతో కేంద్ర ఆరోగ్య శాఖ, రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రదింపులు జరిపి ఎన్నికల నిబంధనలను ఈసీ సడలిస్తూ వచ్చింది. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్, పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ గురువారం జరుగుతుండటం, ఫలితాలు వెలువడుతుండటంతో గెలుపు దిశగా పయనిస్తున్న పార్టీలు సంబరాలకు సిద్ధం అవుతున్నాయి.

యోగీ దెబ్బకు పాత రికార్డులన్నీ బద్దలు, వరుసగా రెండో సారి ముఖ్యమంత్రిగా రికార్డు సృష్టించనున్న యోగీ ఆదిత్యనాథ్

ఈ రాష్ట్రాల్లో విజేతలు వేడుకలు చేసుకోవడానికి అనుమతి ఇచ్చింది. ప్రస్తుతం పంజాబ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్ రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ రాష్ట్రాల్లో కరోనా పరిస్థితిని పరిగణనలోకి తీసుకోవడం వల్లే విజయోత్సవాలపై నిషేధం ఎత్తివేస్తున్నట్లు ఈసీ పేర్కొంది. అంతకుముందు కరోనా మహమ్మారి కారణంగా విజయోత్సవ వేడుకలపై నిషేధం విధించామని, ఇప్పుడు పరిస్థితులు మారడంతో ఈ ఆంక్షలను సడలించామని తెలిపింది.

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now

సంబంధిత వార్తలు

Andhra Pradesh: నారా లోకేశ్‌ని డిప్యూటీ సీఎం చేయాలని డిమాండ్, జనసేన ఎదురుదాడితో దిద్దుబాటు చర్యలకు దిగిన టీడీపీ అధిష్ఠానం, అధికార ప్రతినిధులకు కీలక ఆదేశాలు జారీ

World Economic Forum in Davos: దావోస్ పర్యటనలో కలుసుకున్న తెలుగు రాష్ట్రాల సీఎంలు, విదేశీ పెట్టుబడుల కోసం వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సుకు హాజరైన చంద్రబాబు, రేవంత్ రెడ్డి

Kakani Govardhan Reddy: వీడియో ఇదిగో, మళ్లీ వైసీపీ వస్తుంది..మీ గుడ్డలు ఊడదీసి రోడ్డు మీద నిలబెడతాం, కాకాణి గోవర్ధన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Mahakumbh Fire: మహా కుంభమేళా అగ్ని ప్రమాదం, వీడియోలు రికార్డ్ చేయడం మానేసి బాధితులకు సాయం చేయండి, పలు సూచనలు జారీ చేసిన ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం

Share Now