Astrology: నవంబర్ 2 న సూర్యుడు స్వాతి నక్షత్రం లోనికి ప్రవేశం. ఈ మూడు రాశుల వారికి అదృష్టం..

సూర్యగ్రహం నవంబర్ రెండవ తేదీ స్వాతి నక్షత్రం లోనికి ప్రవేశించడం వల్ల అన్ని రాశులు వారికి సానుకూల ఫలితాలు ఉంటాయి.

astrology

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాల రాజు సూర్యుడు. సూర్యగ్రహం నవంబర్ రెండవ తేదీ స్వాతి నక్షత్రం లోనికి ప్రవేశించడం వల్ల అన్ని రాశులు వారికి సానుకూల ఫలితాలు ఉంటాయి. వారి జీవితం అభివృద్ధి వైపు వెళుతుంది. కొత్త అవకాశాలు వస్తాయి. అయితే ముఖ్యంగా మూడురాశుల వారికి చాలా మేలు జరుగుతుంది. ఆ మూడు రాశులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

కన్యారాశి- సూర్యుడు స్వాతి నక్షత్రంలోనికి మారడం ద్వారా ఈ రాశి వారికి అనేక ఫలితాలు వస్తాయి. వీరు సామాజిక సేవకు పట్ల ఆసక్తిని కలిగి ఉంటారు. దీని వల్ల సమాజంలో మీ గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. వ్యాపారంలో పురోగతి ఉంటుంది. దీని వల్ల ధన వృద్ధి ఆర్థిక పరిస్థితి మరింతగా బలపడుతుంది. ఏ ఆలోచన తీసుకున్న కూడా అది మీ విజయానికి దారితీస్తుంది. వీరు ఆర్థిక లాభాల కోసం కొత్త అవకాశాలు ఈ వెంట వస్తాయి. కుటుంబ సంబంధాలు బలపడతాయి. స్నేహిత కలయిక వల్ల మీకు ప్రయోజనాలు ఉంటాయి. నూతన గృహాన్ని కొనుగోలు చేస్తారు.

Vastu Tips: వాస్తు ప్రకారం బెడ్రూంలో మంచం ఏ దిశలో ఉండాలి, 

తులారాశి- తులారాశి వారికి స్వాతి నక్షత్రంలోనికి సూర్యుడు ప్రవేశించడం ద్వారా అనేక మార్పులు చోటుచేసుకుంటాయి. వీరు సూర్యుడు లాగా ప్రజల జీవితాల్లో వెలుగును నింపుతారు. వ్యాపార విస్తరణ కోసం కొత్త అవకాశాలు వస్తాయి. విదేశాల్లో పెట్టుబడులు పెడతారు. కుటుంబ సభ్యుల మధ్య సంబంధాలు పెరుగుతాయి. సమాజంలో కొత్త గుర్తింపును తెచ్చుకొని ముందుకు సాగుతారు. విద్యార్థులు పోటీ పరీక్షల్లో దీన్లో అవుతారు. విదేశాల్లో చదవాలనుకున్న కళ నెరవేరుతుంది. నూతన వాహనాన్ని కొనుగోలు చేస్తారు. కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలకు వెళతారు.

ధనస్సు రాశి- ధనస్సు రాశి వారికి సూర్యుడు స్వాతి నక్షత్రంలోనికి ప్రవేశించడం ద్వారా కొత్త విజయ అవకాశాలు లభిస్తాయి. రానున్న రోజుల్లో వీరికి అన్ని శుభ ఫలితాలు వస్తాయి. వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఆర్థిక సంక్షేమం నుండి బయటపడతారు ఎప్పటినుంచో ఇబ్బంది పెడుతున్న అనారోగ్య సమస్య నుండి ఉపశమనాన్ని పొందుతారు. ఎప్పటినుంచ ఇబ్బంది పడుతున్న ఒత్తిడి ఆందోళన వంటి వాటి నుండి విముక్తి పొందుతారు. కుటుంబంలో కొన్ని శుభకార్యాలు జరుగుతాయి. ఉద్యోగం చేసే వారికి ప్రమోషన్ లభిస్తుంది. ఇది మీ ఆదాయాన్ని పెంచుకోవడానికి ఉపయోగపడుతుంది. ఖర్చులు తగ్గుతాయి ఆదాయం పెరుగుతుంది. ఎప్పటినుంచ ఇబ్బంది పెడుతున్న అనారోగ్య సమస్య నుంచి బయటపడతారు. దీనివల్ల మానసిక ఆందోళన తగ్గుతుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది.

Disclaimer: పైన పేర్కొన్న సమాచారం మత విశ్వాసాల ఆధారంగా పేర్కొనడం జరిగింది. జ్యోతిష్యం, జాతకం విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు.