Ayodhya Case Final Judgment: అయోధ్య కేసుపై చారిత్రాత్మక తీర్పు, అయోధ్య ట్రస్టుకు వివాదాస్పద భూమిని కేటాయించాలి, బాబ్రీ మసీదుకు వేరే స్థలం కేటాయించాలి, ప్రభుత్వం 3 నెలల్లో ఈ ప్రాసెస్ పూర్తి చేయాలన్న దేశ అత్యున్నత న్యాయస్థానం

అయోధ్యలోని రామజన్మభూమి-బాబ్రీ మసీదు స్థల వివాదం కేసులో సుప్రీం కోర్టు చారిత్రాత్మకమైన తీర్పును ఇచ్చింది. సరిగ్గా 10:30 గంటలకు సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ రంజన్ గొగొయ్ తీర్పును చదివి వినిపించారు.

Ayodhya Case Final Judgment Hindus to get disputed land subject to conditions, Muslims to get alternate land: SC (Photo-Twitter)

New Delhi, Novemebr 9: దశాబ్దాలుగా నలుగుతున్న అయోధ్య భూవివాదం కేసు (Ayodhya Case Verdict) పై సుప్రీంకోర్టు ఈ రోజుల కీలక తీర్పును ఇచ్చింది. అయోధ్యలోని రామజన్మభూమి-బాబ్రీ మసీదు(Ram Janmbhoomi - Babri Masjid) స్థల వివాదం కేసులో సుప్రీం కోర్టు చారిత్రాత్మకమైన తీర్పును ఇచ్చింది. సరిగ్గా 10:30 గంటలకు సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ రంజన్ గొగొయ్ తీర్పును చదివి వినిపించారు. ఇందులో భాగంగా అయోధ్యలోని వివాదాస్పద స్థలాన్ని పంచుకోవాలంటూ గతంలో అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం కోర్టు తప్పుబట్టింది. వివాదాస్పద స్థలాన్ని పంచే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది.

సుప్రీం తీర్పుతో అయోధ్యలో రామ మందిర (Ayodhya Ram mandir)నిర్మాణానికి మార్గం సుగమమైంది. అయోధ్య (Ayodhya)లోనే మసీదు నిర్మాణానికి ముస్లింలకు ప్రత్యామ్నాయంగా ఐదు ఎకరాల స్థలం కేటాయించాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. అయోధ్య కేసులో ఆది నుంచి ఏం జరిగింది ?

మసీదు నిర్మాణానికి సున్నీ వక్ఫ్ బోర్డుకు మరోచోట ఐదు ఎకరాల స్థలం కేటాయించాలని స్పష్టం చేసింది. అయోధ్య యాక్ట్‌ కింద మందిర నిర్మాణానికి మూడు నెలల్లోగా ట్రస్ట్‌ ఏర్పాటు చేయాలని స్పష్టం చేసింది. వివాదాస్పద స్ధలాన్ని రామజన్మ న్యాస్‌కే అప్పగించింది.  దేశ వ్యాప్తంగా హై అలర్ట్, చాలా రాష్ట్రాల్లో విద్యాసంస్థలు మూసివేత

సుప్రీం తీర్పును గౌరవిస్తామన్న Sunni Waqf Board Lawyer

ఈ సందర్భంగా ధర్మాసనం మాట్లాడుతూ రాజకీయాలు, చరిత్రకు అతీతంగా న్యాయం ఉండాలి. రెండు మతాలవారు వివాదాస్పద స్థలంలో ప్రార్థనలు జరిపేవారని ముస్లింలూ విశ్వసిస్తారు. ప్రాథమిక విలువలు, మతసామరస్యాన్ని ప్రార్థనా మందిరాల చట్టం పరిరక్షిస్తుంది. ఇది పెద్ద సంఖ్యలో ఉన్న హిందూ భక్తుల కోసం ఉద్దేశించింది. ఇది వ్యక్తిగత హక్కుల కోసం దాఖలు చేసిన వ్యాజ్యం కాదు.  ఢిల్లీలో ఆరెస్సెస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌

సుప్రీం తీర్పు ఇదే 

మసీదు ఎవరు కట్టారో ఎప్పుడు నిర్మించారో స్పష్టం కాలేదని హైకోర్టు చెప్పింది. వివాదాస్పద స్థలంపై ఎవరూ యాజమాన్య హక్కులు కోరలేదు. నిర్ణయానికి ముందు 2 మతాల విశ్వాసాలను పరిగణనలోకి తీసుకున్నాం. మందిరం ఉన్నట్లు పురావస్తు శాఖ నివేదికలు చెబుతున్నాయి. దేవాలయాన్ని ధ్వంసం చేశారనడానికి పురవాస్తు ఆధారాలు లేవు. 12-16 శతాబ్ధాల మధ్య అక్కడేముందో చెప్పడానికి పురావస్తు ఆధారాలు కూడా లేవు. అయోధ్యను హిందువులు రామజన్మ భూమిగా భావిస్తారని' సీజేఐ వివరించారు.

చారిత్మాత్మక తీర్పు అన్న Hindu Mahasabha లాయర్ 

కాగా ఫైజాబాద్ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ షియా వక్ఫ్ బోర్డు స్పెషల్ లీవ్ పిటిషన్‌ను అత్యున్నత న్యాయస్థానం తిరస్కరించింది. నిర్మోహీ అఖాడా పిటిషన్‌ను కూడా సుప్రీం కొట్టేసింది. నిర్మోహి పిటిషన్‌కు కాలం చెల్లిందని పేర్కొంది. తీర్పు కాపీ చదివేందుకు అరగంట సమయం పడుతుందని గొగొయ్ తెలిపారు.

'ఇది చరిత్రాత్మకమైన తీర్పు. ఈ తీర్పు ఏకగ్రీవం ఐదుగురు న్యాయమూర్తులది ఒకటే మాట. బాబ్రీ మసీదును కచ్చితంగా ఎప్పుడు నిర్మించారో ప్రాతిపదిక లేదు. బాబర్ కాలంలో బాబ్రీ మసీదు నిర్మాణం జరిగింది. మత గ్రంథాలను బట్టి కోర్టు తీర్పు ఉండదు. పురావస్తుశాఖ నివేదికలో బాబ్రీ మసీద్ నిర్మాణం కింద మరో నిర్మాణం ఉంది. కాగా 12 నుంచి 16వ శతాబ్ధాల మధ్య ఏం జరిగిందనడానికి ఆధారాలు లేవని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. మసీదును ముస్లింలు ఎప్పుడు వదలివేయలేదని అన్నారు.

అయోధ్యను హిందువులు రామజన్మభూమిగా భావిస్తారు. వారి విశ్వాసాలను తప్పుపట్టలేమని పేర్కొన్నారు. అయితే అక్కడ దేవాలయం ఉందనేందుకు ఆధారాలు లేవని అన్నారు. నమ్మకం, విశ్వాసాల ఆధారంగా భూ యాజమాన్య హక్కులు నిర్ధారించలేమని అన్నారు.

‘మతపరమైన విశ్వాసాల్లో కోర్టు జోక్యం చేసుకోదు.. న్యాయసూత్రాల ఆధారంగానే భూమి యాజమాన్య హక్కులు నిర్ణయించాల’ని తీర్పును చదువుతూ ప్రధాన న్యాయమూర్తి స్పష్టం చేశారు. వివాదాస్పద భూమి రికార్డుల ప్రకారం ప్రభుత్వానిదేని పేర్కొన్నారు. పురావస్తు నివేదికలనూ మదింపు చేసి తీర్పును వెల్లడించామన్నారు.



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif