Ayodhya verdict: RSS chief Mohan Bhagwat leaves for Delhi, appeals for peace (Photo-PTI)

New Delhi, Novemebr 9: దశాబ్దాలుగా నలుగుతూ వస్తున్న అయోధ్య రామజన్మభూమి-బాబ్రీమసీదు భూమి వివాదం కేసు తుది అంకానికి చేరుకున్న నేపథ్యంలో నేతలంతా ఢిల్లీకి వెళుతున్నారు. అయోధ్య కేసులో సుప్రీం కోర్టు(Supreme Court) చారిత్రక తీర్పు వెల్లడించనున్న క్రమంలో ఆరెస్సెస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌ (RSS Chief Mohan Bhagwat) ఢిల్లీ చేరుకున్నారు. తీర్పు నేపథ్యంలో హోంమంత్రి అమిత్‌ షా( BJP chief Amit Shah) సహా పలువురు బీజేపీ నేతలతో మంతనాలు జరపనున్నారు. మరోవైపు శనివారం ఉదయం బీజేపీ కార్యాలయానికి చేరుకుని పార్టీ నేతలతో అయోధ్య కేసులో సుప్రీం తీర్పు తదనంతర పరిణామాలపై అమిత్‌ షా సమాలోచనలు జరుపుతారు.

పార్టీ వ్యూహంపై అమిత్‌ షా, ఆరెస్సెస్‌ చీఫ్‌ నేటి సాయంత్రం మీడియా ముందుకు రానున్నట్టు సమాచారం. ఇక దశాబ్ధాల తరబడి రామజన్మభూమి-బాబ్రీమసీదు భూమి వివాదం కేసు(Ayodhya Ram Janmabhoomi-Babri Masjid)పై సుప్రీం కోర్టు శనివారం ఉదయం 10.30 గంటలకు చారిత్రక తీర్పును వెలువరించనుంది. తీర్పుపై ప్రజలంతా సంయమనం పాటించాలని ఆరెస్సెస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌ విజ్ఞప్తి చేశారు.

తీర్పుపై సంయమనం పాటించాలని ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోడీ (PM Narendr modi) సహా నేతలంతా విజ్ఞప్తి చేశారు. అయోధ్య కేసు తీర్పు (Ayodhya verdict)  నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అక్కడ పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. స్వాత్యంత్య్రానంతరం మొదలైన ఈ వివాదం మొదటి కోర్టు కేసు దగ్గర నుంచి ఈ వివాదం అనేక పరిణామాలకు దారి తీసింది. ఎన్నో ఉద్రిక్తతలకు కారణం అయింది. వీటికి నేటితో పుల్ స్టాప్ పడనుంది. దశాబ్దాలుగా దేశ రాజీకీయాలను ఈ కేసు ప్రభావితం చేస్తూనే ఉంది.