Baby With Tail: తోకతో పుట్టిన శిశువు, బ్రెజిల్‌లో జన్మించిన బాలుడికి 12 సెం.మీ పొడవైన తోక, ఆశ్చర్యానికి గురైన వైద్యులు, గద ఆకారంలో శిశువుకు తోక

పురాణాల్లో ఆంజనేయుడికి తోక ఉండటం గురించి చదివాం. కానీ నిజంగానే బ్రెజిల్‌లో నిజంగానే ఒక శిశువు తోకతో జన్మించాడు. ఇది చూసిన డాక్టర్లు ఆశ్చర్యానికి గురయ్యారు. తాము చూసింది నిజమేనా? అని నమ్మలేకపోయారు.

Brazil November 07: కోతి నుంచి మనిషి వచ్చాడన్నది మనం విన్నాం. పురాణాల్లో ఆంజనేయుడికి తోక ఉండటం గురించి చదివాం. కానీ నిజంగానే బ్రెజిల్‌లో నిజంగానే ఒక శిశువు తోకతో జన్మించాడు. ఇది చూసిన డాక్టర్లు ఆశ్చర్యానికి గురయ్యారు. తాము చూసింది నిజమేనా? అని నమ్మలేకపోయారు.

ఫోర్టలెజా పట్టణానికి చెందిన 35 వారాల గర్భిణి పురుటినొప్పులతో ఆల్బెర్ట్‌ సాబిన్‌ అనే పిల్లల ఆసుపత్రిలో చేరింది. ఆమెకు శస్త్రచికిత్స చేసి వైద్యులు మగ శిశువును బయటకు తీశారు. అయితే ఆ బాలుడికి తోక ఉండటం చూసి వైద్యులు ఆశ్చర్యపోయారు. 12 సెంటీమీటర్లు ఉన్న ఆ తోక చివర్లో 4 సెంటీమీటర్ల వ్యాసార్థంతో గద లాంటి ఆకారం కూడా ఉంది.

గతంలో ఆ మహిళకు చేసిన స్కానింగ్‌లు, టెస్టుల్లో తోక గురించి ఎక్కడా బయటపడలేదు. దీంతో ఆమెకు డెలివరీ చేసిన వైద్యులు కూడా ఆశ్చర్యానికి లోనయ్యారు. అయితే చర్మానికి మాత్రమే తోక పెరిగిందని, నాడీ వ్యవస్థకు తోకతో ఎలాంటి అనుసంధానం లేదని గుర్తించారు వైద్యులు. సర్జరీ చేసి తోకను తొలగించారు.

జన్యుపరమైన లోపాల కారణంగా పిల్లలు ఈ విధంగా జన్మిస్తుంటారని వైద్యులు చెబుతున్నారు. తోకతో జన్మించిన బాలుడి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని డాక్టర్లు తెలిపారు. గతంలో కూడా  ఇలాంటి అరుదైన కేసులు సుమారు 40 వరకు చూశామని వారు చెప్పారు