Bengal Doctors End Cease-Work: 41 రోజుల తర్వాత ఆందోళనను విరమించిన కోల్ కతా వైద్య విద్యార్థులు.. శనివారం నుంచి అత్యవసర సేవల్లో పాల్గొంటామని ప్రకటన
కోల్ కతా ట్రైనీ వైద్యురాలిపై జరిగిన హత్యాచార ఘటనలో బాధితురాలికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ నిరసనలు చేపట్టిన ఆర్ జీ కర్ వైద్య విద్యార్థులు 41 రోజుల తర్వాత ఆందోళన విరమించారు.
Kolkata, Sep 20: కోల్ కతా (Kolkata) ట్రైనీ వైద్యురాలిపై జరిగిన హత్యాచార ఘటనలో (Rape Case) బాధితురాలికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ నిరసనలు చేపట్టిన ఆర్ జీ కర్ వైద్య విద్యార్థులు 41 రోజుల తర్వాత ఆందోళన విరమించారు. శనివారం నుంచి అత్యవసర సేవల్లో పాల్గొంటామని తెలిపారు. బెంగాల్ లోని మమత ప్రభుత్వంతో రెండు దఫాల చర్చల అనంతరం వైద్య విద్యార్థులు ఈ నిర్ణయం తీసుకున్నారు. సీఎం మమతాతో వారి చర్చలు సఫలం కావడంతో విద్యార్థులు నిరసనలను విరమిస్తున్నట్లు ప్రకటించారు. వారి పలు డిమాండ్లకు ముఖ్యమంత్రి అంగీకరించారు.
వీరి తొలగింపుతో..
ట్రైనీ వైద్యుల డిమాండ్లలో భాగంగా కోల్‌కతా నగర పోలీస్ కమిషనర్, మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్, హెల్త్ సర్వీస్ డైరెక్టర్ తదితరులను ప్రభుత్వం తొలగించడం జరిగింది. ఈ క్రమంలోనే ట్రైనీలు తమ ఆందోళన విరమణ ప్రకటన చేశారు.