Bharat Bandh Updates: భారత్ బంద్‌లో విషాదం, ఆందోళన చేస్తున్న రైతు మృతి, గుండెపోటుతో మరణించినట్లుగా అనుమానిస్తున్న పోలీసులు, కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా కొనసాగుతున్న నిరసనలు

సింఘు సరిహద్దు వద్ద సోమవారం ఉదయం నిరసనల్లో పాల్గొన్న 54 ఏళ్ల రైతు మృతి (Farmer dies during protest at Singhu border) చెందాడు. గుండెపోటుతో ఆయన మరణించినట్టు (police suspect heart attack) అనుమానిస్తున్నారు.

Farmers block a road during their 'Bharat Bandh' against central government's three farm reform laws, at Ghazipur border in New Delhi (Photo-PTI)

New Delhi, Sep 27: కేంద్రం తీసుకువచ్చిన మూడు సాగు చట్టాలకు వ్యతిరేకంగా సంయుక్త కిసాన్ మోర్చా ఇచ్చిన భారత్ బంద్ లో విషాదం చోటుచేసుకుంది. సింఘు సరిహద్దు వద్ద సోమవారం ఉదయం నిరసనల్లో పాల్గొన్న 54 ఏళ్ల రైతు మృతి (Farmer dies during protest at Singhu border) చెందాడు. గుండెపోటుతో ఆయన మరణించినట్టు (police suspect heart attack) పోలీసులు అనుమానిస్తున్నారు. మరణించిన రైతును భాగెల్ రామ్‌గా గుర్తించారు.

పోస్ట్‌మార్టం అనంతరం పూర్తి వివరాలు ఇవ్వగలమని పోలీసులు తెలిపారు. కాగా, గత ఏడాది ఇదే రోజు వివాదాస్పద సాగు చట్టాలకు రాష్ట్రపతి ఆమోదం తెలిపారని, ఈ రోజు 'బ్లాక్‌డే'గా ( Bharat Bandh) తామంతా భావిస్తున్నామని రైతు నేతలు తెలిపారు. మరోవైపు, భారత్ బంద్ సందర్భంగా పరిస్థితిని హోం మంత్రిత్వ శాఖ సమీక్షిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వాలతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతోంది. ప్రజావ్యవస్థను స్తంభింపజేసినట్లయితే నిరసనకారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎంఎచ్ఏ ఆదేశాలిచ్చినట్టు అధికారులు తెలిపారు. కాగా, బంద్ సందర్భంగా పలు చోట్ల నిరసనకారులు రైల్వే ట్రాక్‌లపై బైఠాయించడంతో రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. అయితే వారిని ఒప్పించి రైల్వే ట్రాక్‌ల నుంచి వెనక్కు మళ్లించేందుకు, రైళ్ల రాకపోకలు యథాప్రకారం జరిగేటట్టు అధికార యంత్రంగం ప్రయత్నిస్తోంది. టిక్రి సరిహద్దుకు దగ్గర్లోని పండిట్ శ్రీరామ్ మెట్రో స్టేషన్‌ను ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (డీఎంఆర్‌సీ) మూసేసింది. అయితే, మిగతా ప్రాంతాల్లో మెట్రో రైళ్ల రాకపోకల్లో ఎలాంటి జాప్యం జరగలేదు.

దేశ వ్యాప్తంగా కొనసాగుతున్న భారత్ బంద్, ఏపీ తెలంగాణలో డిపోలకే పరిమితమై ఆర్టీసీ బస్సులు, ఢిల్లీ- అమృత్‌సర్‌ జాతీయ రహదారిపై రైతులు నిరసన, వ్యవసాయ చట్టాలకు రాష్ట్రపతి ఆమోదం తెలిపి నేటికి ఏడాది

మూడు చట్టాలకు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా ఈ రోజు ఉదయం ఆరు నుంచి సాయంత్రం నాలుగు వరకు ఈ బంద్‌ కొనసాగనుంది. బంద్‌ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా దిల్లీలోని పలు ప్రాంతాల్లో ప్రభుత్వం బలగాలను మోహరించింది. రాజధాని సరిహద్దుల వద్ద భద్రతను కట్టుదిట్టం చేసింది. ఉత్తర్‌ ప్రదేశ్‌ నుంచి గాజిపూర్ వైపునకు రాకపోకలు సాగకుండా పోలీసులు రహదారులను మూసివేశారు. దాంతో దిల్లీ, ఉత్తరప్రదేశ్‌ మధ్య తిరిగే వాహనదారులకు అంతరాయం ఏర్పడింది.

పంజాబ్, హరియాణా రాష్ట్రాల సరిహద్దుల్ని సాయంత్రం నాలుగు వరకు ముట్టడిస్తున్నట్లు రైతులు వెల్లడించారు. తమ ట్రాక్టర్లతో ప్రధాన రహదారుల్ని దిగ్బంధించారు. రైళ్ల రాకపోకలు కూడా నిలిచిపోయాయి. యూపీ, పంజాబ్ ప్రభుత్వాలు ట్రాఫిక్ మళ్లింపు అడ్వైజరీని జారీ చేశాయి. బంద్‌ నడుస్తున్నప్పటికీ.. దిల్లీలో మాత్రం ప్రజా రవాణా కొనసాగుతోంది. మెట్రో సేవల్లో కొన్ని మార్పులు చోటుచేసుకున్నాయి. ఒడిశా బస్సు సేవల్ని నిలిపివేసింది.

ఒక క్లిక్‌తో హెల్త్ కేర్ సౌకర్యం, ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ ప్రారంభించిన ప్రధాని మోదీ, ప్రధానమంత్రి డిజిటల్ హెల్త్ మిషన్ ద్వారా అందరికీ హెల్త్ ఐడీలు

వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతోన్న రైతు సంఘాలకు పలువురు మద్దతు ప్రకటించారు. సోమవారం కాంగ్రెస్ నేత రాహుల్ మాట్లాడుతూ.. ‘రైతుల శాంతియుత సత్యాగ్రహం దృఢంగా సాగుతోంది. దోపిడీ ప్రభుత్వానికి ఇది నచ్చడం లేదు. అందుకే భారత్‌ బంద్‌కు పిలుపునిచ్చాం’ అని అన్నారు. ఈ బంద్‌పై నిన్న మాయావతి ట్వీట్ చేశారు. ‘కేంద్రం హడావుడిగా తీసుకువచ్చిన చట్టాలను రైతన్నలు ఆమోదించలేదు. వాటి రద్దు కోసం గత 10 నెలలుగా ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో నిరసన తెలుపుతూనే ఉన్నారు. ఇప్పుడు భారత్ బంద్‌కు పిలుపునిచ్చారు. ఈ శాంతియుత నిరసనకు బీఎస్పీ మద్దతు ఇస్తోంది’ అని అన్నారు. అలాగే పలు రాష్ట్రాల్లో విపక్ష నేతలు బంద్‌ పాటిస్తున్నారు. రైతులు శాంతియుతంగా తమ నిరసన స్వరాన్ని పెంచాలని పంజాబ్ నూతన ముఖ్యమంత్రి చరణ్‌జిత్ చన్నీ అన్నారు.