Covaxin Consent Form: వ్యాక్సిన్ వికటిస్తే నష్ట పరిహారం పొందే అవకాశం, కోవాగ్జిన్ టీకా తీసుకునేవారు నిబంధనలకు సమ్మతి తెలపాలి, సంబంధిత పత్రంపై సంతకం చేయాల్సి ఉంటుందని తెలిపిన భారత్ బయోటెక్
భారత్ బయోటెక్ సంస్థ అభివృద్ధి చేసిన కోవాగ్జిన్ టీకా తీసుకునేవారు సంబంధిత నిబంధనలకు తమ సమ్మతి తెలపాల్సి ఉంటుందని, సంబంధిత పత్రంపై సంతకం చేయాల్సి ఉంటుందని సంస్థ తెలిపింది.
New Delhi, January 16: దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ డ్రైవ్ ప్రారంభమైన నేపథ్యంలో భారత్ బయోటెక్ సంస్థ వ్యాక్సిన్ తీసుకునే వారి కోసం కొన్ని నిబంధనలను ప్రవేశపెట్టింది. భారత్ బయోటెక్ సంస్థ అభివృద్ధి చేసిన కోవాగ్జిన్ టీకా తీసుకునేవారు సంబంధిత నిబంధనలకు తమ సమ్మతి తెలపాల్సి ఉంటుందని, సంబంధిత పత్రంపై సంతకం చేయాల్సి ఉంటుందని సంస్థ తెలిపింది.
అప్పుడే టీకా వేయించుకోవడం వల్ల ప్రతికూలతలు ఎదురైనప్పుడు ఆ మేరకు పరిహారం (Covaxin Beneficiaries), వైద్య చికిత్స పొందే అవకాశం ఉంటుందని పేర్కొంది. భారత్ బయోటెక్ అందిస్తున్న కోవాగ్జిన్ వాక్సిన్ తీసుకున్నవారికి దుష్ఫలితాలు వస్తే, బాధితులకు ప్రామాణిక వైద్య చికిత్సను అందించడంతోపాటు నష్టపరిహారం చెల్లిస్తారు.
అంగీకార పత్రంలో వ్యాక్సిన్ తీసుకున్నవారికి ఏదైనా తీవ్రమైన ప్రతికూల సంఘటనలు జరిగితే, టీకా గ్రహీతలకు ప్రభుత్వం నియమించిన, అధీకృత కేంద్రాలు, ఆసుపత్రులలో వైద్యపరంగా గుర్తింపు పొందిన సంరక్షణ ప్రమాణాలు అందుతాయి. తీవ్రమైన ప్రతికూల సంఘటన జరిగినట్లు నిరూపిస్తే పరిహారాన్ని బీబీఐఎల్ చెల్లిస్తుంది. ఐసీఎంఆర్ సెంట్రల్ ఎథిక్స్ కమిటీ ఈ పరిహారాన్నినిర్ణయిస్తుందని భారత్ బయోటెక్ సంస్థ వెల్లడించింది.
మరోవైపు ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ, ఆస్ట్రాజెనెకా అభివృద్ధి చేసిన టీకా కోవిషీల్డ్‌ను సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా తయారు చేస్తోంది. ఈ టీకా వేయించుకునే వారు ఎలాంటి సమ్మతి పత్రంపై సంతకం చేయాల్సిన అవసరం లేదని సీరం సంస్థ తెలిపింది. కోవాక్సిన్ టీకా గ్రహీతలకు ఫాక్ట్-షీట్, ప్రతికూల ప్రభావ రిపోర్టింగ్ ఫారమ్ ఇవ్వనున్నట్లు చెప్పింది. అయితే కోవిషీల్డ్ టీకా వేయించుకున్న ఏడు రోజులలో జ్వరం, నొప్పి, టీకా వేసిన చోట ఎర్రగా కందడం వంటి లక్షణాలుంటాయని పేర్కొంది.
కోవిడ్-19 నిరోధక కోవాగ్జిన్ వ్యాక్సిన్ తీసుకునేవారు ముందుగా ఓ అంగీకార పత్రంపై సంతకం చేయవలసి ఉంటుంది. ఈ అంగీకార పత్రంలో కొన్ని షరతులు, నిబంధనలను పేర్కొన్నారు. వ్యాక్సినేషన్ తర్వాత ఏమైనా దుష్ఫలితాలు కనిపిస్తే, అందుకు కారణం ఆ వ్యాక్సినేనని రుజువైతే, ఆ వ్యాక్సిన్ బాధితులకు వైద్య సంరక్షణతోపాటు నష్టపరిహారం చెల్లిస్తామనే నిబంధనలు దీనిలో ఉన్నాయి. కాగా మన దేశంలో అత్యవసర పరిస్థితిలో పరిమితంగా వినియోగించేందుకు కోవాగ్జిన్, కోవిషీల్డ్.. రెండు వ్యాక్సిన్లు అనుమతి పొందాయి,