PM Narendra Modi gifts Rs 614 crore projects to Varanasi ahead of Diwali (Photo-ANI)

New Delhi, January 16: దేశ‌వ్యాప్తంగా ఇవాళ కోవిడ్ వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ‌ను ప్ర‌ధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi)వ‌ర్చువ‌ల్ విధానంలో ప్రారంభించారు. ఈ నేప‌థ్యంలో ఆయ‌న దేశ ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి మాట్లాడుతూ..జ‌న‌తా క‌ర్ఫ్యూ హెల్ప్ చేసింద‌న్నారు. దాని ఆధారంగానే దేశ‌వ్యాప్తంగా లాక్‌డౌన్ విధించామ‌న్నారు. లాక్‌డౌన్ నిర్ణ‌యం ఈజీగా కాదు అని, కానీ దేశ ప్ర‌జ‌ల‌ను కాపాడ‌డంలో ఆ నిర్ణ‌యం ఎంతో ఉప‌క‌రించింద‌న్నారు. ప్ర‌పంచ దేశాల‌కు మ‌నం ఆద‌ర్శంగా నిలుస్తున్నాం. మ‌న దేశం తీసుకున్న నిర్ణ‌యాలు.. అనేక దేశాల‌కు మార్గ‌ద‌ర్శ‌కాలుగా ఉంటాయ‌న్నారు. శాస్త్ర‌వేత్త‌లు ల్యాబ్‌ల్లో రుషుల త‌ర‌హాలో క‌ఠినంగా శ్ర‌మించార‌ని ప్ర‌ధాని మోదీ తెలిపారు.

రాత్రి, ప‌గ‌లు లేకుండా శాస్త్ర‌వేత్త‌లు టీకా కోసం శ్ర‌మించార‌న్నారు. చాలా త‌క్కువ స‌మ‌యంలో టీకా (COVID Vaccination Drive in India) వ‌చ్చేసింద‌న్నారు. మేడి ఇన్ ఇండియా టీకాలు రెండు వ‌చ్చాయ‌న్నారు. ఇది భార‌త సామ‌ర్థ్యం అన్నారు. వైజ్ఞానికి స‌త్తా అన్నారు. భార‌తీయ ట్యాలెంట్ అన్నారు. ఎవ‌రికైతే అత్య‌వ‌స‌ర‌మో.. వారికి ముందుగా టీకా ఇస్తున్నాం అన్నారు. గ‌త ఏడాది ఏం జ‌రిగిందో ఒక‌సారి ప‌రిశీలిస్తే, దాని నుంచి ఎంతో నేర్చుకున్నామ‌న్నారు. ఒక వ్య‌క్తిగా, ఒక కుటుంబంగా, ఓ దేశంగా ఎంతో నేర్చుకున్న‌ట్లు ఆయ‌న తెలిపారు. క‌రోనా వైర‌స్ వ‌ల్ల‌.. ప్ర‌జ‌లు త‌మ కుటుంబీకుల్ని క‌లుసుకోలేక‌పోయిన‌ట్లు ఆయ‌న చెప్పారు.

తొలిసారిగా గొరిల్లాలకు కరోనావైరస్, అమెరికాలోని శాన్‌డియోగో సఫారి పార్కులో ఎనిమిది గొరిల్లాలకి కోవిడ్, వెల్లడించిన జూ అధికారులు

చిన్నారుల కోసం త‌ల్లులు క‌న్నీరుపెట్టార‌ని, వాళ్లంతా ఇంటికే ప‌రిమితం అయ్యార‌ని, హాస్పిట‌ళ్ల‌లో చేరిన వృద్ధుల‌ను కుటుంబీకులు క‌లుసుకోలేక‌పోయార‌ని ఆయ‌న అన్నారు. క‌రోనా వైర‌స్ వ‌ల్ల మ‌ర‌ణించిన వారికి స‌రైన రీతిలో అంతిమ సంస్కారాలు చేయ‌లేక‌పోయిన‌ట్లు మోదీ గుర్తు చేశారు. దేశంలో క‌రోనా పాజిటివ్ కేసులు కోటి ద‌ట‌గా.. ఇప్ప‌టి వ‌ర‌కు ఇండియాలో ల‌క్ష‌న్న‌ర మంది మ‌ర‌ణించారు.

డాక్ట‌ర్లు, న‌ర్సులు, హాస్పిట‌ళ్ల‌లో చికిత్స పొందుతున్నారు. మెడిక‌ల్ టీమ్ కూడా క‌రోనా టీకా తీసుకునేవారిలో ముందున్నార‌ని ప్ర‌ధాని మోదీ తెలిపారు. రెండు డోసులు వ్యాక్సిన్ త‌ప్ప‌నిస‌రి అన్నారు. అన్ని రాష్ట్రాలు కూడా టీకా పంపిణీకి సన్న‌ద్దం అయి ఉన్నాయ‌న్నారు. గ‌తంలో ఎన్న‌డూ ఇంత పెద్ద రీతిలో వ్యాక్సినేష‌న్ జ‌ర‌గ‌లేద‌న్నారు. తొలి ద‌ఫాలో మూడు కోట్ల మంది ఫ్రంట్‌లైన్ వ‌ర్క‌ర్ల‌కు టీకా ఇస్తున్న‌ట్లు మోదీ తెలిపారు. సాధార‌ణంగా వ్యాక్సిన్ త‌యారీకి ఎక్కువ స‌మ‌యం ప‌డుతుంద‌ని, కానీ శ‌ర‌వేగంగా మ‌న సైంటిస్టులు టీకాను రూపొందించిన‌ట్లు చెప్పారు. కోవాగ్జిన్‌, కోవీషీల్డ్‌తో పాటు మ‌రికొన్ని టీకాల అభివృద్ధి జ‌రుగుతున్న‌ట్లు ఆయ‌న తెలిపారు.

కోవిడ్ టీకా తీసుకున్న త‌ర్వాత ముందు జాగ్ర‌త్త‌ల‌ను అస‌లు మ‌ర‌వ‌కూడ‌ద‌ని మోదీ అన్నారు. మాస్క్‌లు ధ‌రించ‌డం, సోష‌ల్ డిస్టాన్స్ పాటించ‌డం త‌ప్ప‌నిస‌రి అన్నారు. రెండు డోసుల వ్యాక్సిన్ తప్ప‌కుండా తీసుకోవాల‌ని ఆయ‌న దేశ ప్ర‌జ‌ల‌ను కోరారు. రెండు డోసుల మ‌ధ్య నెల రోజుల తేడా ఉండాల‌ని నిపుణులు చెబుతున్న‌ట్లు ఆయ‌న గుర్తు చేశారు. తొలి డోసు తీసుకున్న త‌ర్వాత ఎవ‌రూ నిర్ల‌క్ష్యంగా ఉండ‌రాద‌న్నారు. ఎందుకంటే రెండ‌వ డోసు తీసుకున్న త‌ర్వాతే ఇమ్యూనిటీ పెరుగుతుంద‌న్నారు. సుర‌క్షితంగా తేలిన త‌ర్వాతే వ్యాక్సిన్ల‌కు పచ్చ‌జెండా ఊపిన‌ట్లు ఆయ‌న తెలిపారు.

చైనాలో మళ్లీ లాక్‌డౌన్.. దేశాన్ని వణికిస్తున్న కరోనా, అయిదు నెలల తరువాత రెట్టింపు సంఖ్యలో కేసులు, నాలుగు ప్రధాన నగరాల్లో లాక్‌డౌన్ అమలు, జనవరి 14న చైనాకు ప్రపంచ ఆరోగ్య సంస్థ బృందం

దేశం అంటే మ‌ట్టి కాదు.. దేశం అంటే మ‌నుషులోయ్ అన్న గురజాడ వ్యాఖ్య‌ల‌ను మోదీ త‌న ప్ర‌సంగంలో వినిపంచారు. ప్ర‌జ‌లు ఒక‌రికి ఒక‌రు ఉప‌యోగ‌ప‌డాల‌న్న ఉద్దేశాన్ని ఆయ‌న వినిపించారు. కోవిడ్ అంతానికి ఇది ప్రారంభం అని మోదీ అన్నారు. టీకాల‌ను అతి చౌక‌గా అందిస్తున్నామ‌న్నారు. ఇత‌ర దేశాల‌తో పోలిస్తే త‌క్కువ ధ‌ర‌కే టీకాలు అందుబాటులో ఉన్న‌ట్లు మోదీ తెలిపారు. మ‌న టీకాల‌ను అతిశీత‌ల వాతావ‌ర‌ణంలో స్టోర్ చేయాల్సి అవ‌స‌రం లేద‌ని అన్నారు. గ‌తంలో ఎన్న‌డూ ఈ స్థాయిలో వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ జ‌ర‌గ‌లేద‌న్నారు. సుమారు వంద దేశాలు .. మూడు కోట్ల జ‌నాభా క‌న్నా త‌క్కువ‌గా ఉన్నాయ‌ని, కానీ మ‌నం తొలి ద‌శ‌లోనే మూడు కోట్ల మందికి టీకా ఇస్తున్నామ‌న్నారు. రెండ‌వ ద‌శ‌లో ఆ సంఖ్య 30 కోట్లు ఉండాల‌న్నారు.

భారతదేశంలో తొలి వ్యాక్సిన్‌ను మ‌నీష్ కుమార్ అనే ఓ పారిశుద్ధ్య కార్మికుడు తీసుకున్నారు. ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్ప‌త్రిలో వైద్య సిబ్బంది అత‌నికి వ్యాక్సిన్ ఇచ్చారు. ఈ సంద‌ర్భంగా కేంద్ర‌, వైద్య ఆరోగ్య‌శాఖ మంత్రి హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ కూడా ప‌క్క‌నే ఉన్నారు. ఆ త‌ర్వాత ఎయిమ్స్ డైరెక్ట‌ర్ ర‌ణ్‌దీప్ గులేరియా క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్నారు. పారిశుద్ధ్య కార్మికుడు మ‌నీశ్ కుమార్ వ్యాక్సిన్ తీసుకున్న దృశ్యాల‌ను ఈ కింది వీడియోలో మీరు కూడా చూడ‌వ‌చ్చు.

కొవిడ్-19కు వ్య‌తిరేకంగా వ్యాధి నిరోధ‌కత‌ను పెంపొందించ‌డం కోసం దేశంలో చేప‌ట్టిన టీకా కార్యక్ర‌మం ప్ర‌పంచంలోనే అతిపెద్ద కార్య‌క్రమం అయిఉండవ‌చ్చ‌ని కేంద్ర వైద్య ఆరోగ్య‌శాఖ మంత్రి హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ పేర్కొన్నారు. ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా కొవిడ్‌ వ్యాక్సినేష‌న్ కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించిన అనంత‌రం హ‌ర్ష‌వ‌ర్ద‌న్‌ మీడియాతో మాట్లాడారు. టీకా కార్య‌క్ర‌మాలను విజ‌య‌వంతంగా నిర్వ‌హించ‌డంలో దేశానికి అపార‌మైన అనుభ‌వం ఉన్న‌ద‌ని ఆయ‌న చెప్పారు. ఇప్ప‌టికే మ‌నం పోలీయో, స్మాల్ ఫాక్స్ లాంటి వ్యాధుల‌ను దేశం నుంచి పార‌దోలామ‌ని, ఇప్పుడు కొవిడ్ వ్యాధిని కూడా అంతం చేసే కార్య‌క్ర‌మాన్ని మొద‌లుపెట్టామ‌ని హ‌ర్ష‌వ‌ర్ద‌న్‌ తెలిపారు.