Bihar Road Accident: 11 మందిని బలి తీసుకున్న రోడ్డు ప్రమాదం, బీహార్‌లో ట్రాక్టర్‌ను ఢీకొన్న స్కార్పియో వాహనం, తెల్లవారుజామున ముజఫర్‌పూర్ జిల్లాలోని జాతీయ రహదారి 28పై ఘటన
ఈ ప్రమాదంలో 11 మంది అక్కడికక్కడే మరణించారు. తెల్లవారుజామున జరిగిన ఈ విషఆద ఘటన ఆ కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. ముజఫర్‌పూర్ జిల్లా (Muzaffarpur) కంటి పోలీస్ స్టేషన్ పరిధి జాతీయ రహదారి 28పై (NH-28) సంభవించిన ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో 11మంది అక్కడిక్కడే మృతి చెందారు.
Patna, March 7: బీహార్‌లో ఘోర రోడ్డు ప్రమాదం (Bihar, Bihar Accident) సంభవించింది. ఈ ప్రమాదంలో 11 మంది అక్కడికక్కడే మరణించారు. తెల్లవారుజామున జరిగిన ఈ విషఆద ఘటన ఆ కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. ముజఫర్‌పూర్ జిల్లా (Muzaffarpur) కంటి పోలీస్ స్టేషన్ పరిధి జాతీయ రహదారి 28పై (NH-28) సంభవించిన ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో 11మంది అక్కడిక్కడే మృతి చెందారు.
కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం, 13 మంది దుర్మరణం
ఓ స్కార్పియో వాహనం ట్రాక్టర్ ఒకదానినొకటి బలంగా ఢీకొనటంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మరో నలుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని గాయపడిన వారిని హాస్పిటల్ కు తరలించి చికిత్సనందిస్తున్నారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మృతులు ఎక్కడివారు? ప్రమాదం ఎలా జరిగింది? వంటి కోణాల్లో దర్యాప్తు ప్రారంభించారు.
Here's the tweet:
దేశంలో వరుసగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. నిన్న కర్ణాటకలో రోడ్డు ప్రమాదం 13మందిని బలితీసుకుంది. ప్రతీరోజు ఎక్కడోకచోట ప్రమాదాలు జరుగుతునే ఉన్నాయి. మద్యం సేవించి వాహనాలు నడపటం..అతి వేగం..నిర్లక్ష్యం..నిద్రలేమి వంటి పలు కారణాలతో ప్రమాదాలు జరుగుతున్నాయి. రోడ్డు ప్రమాదాలపై ఆయా రాష్ట్రాల అధికారులు ఎంతగా అవగాహన కల్పించినా..రూల్స్ ఎంతగా పెట్టినా రోడ్డు ప్రమాదాలకు చెక్ పెట్టలేకపోతున్నారు.