Bengaluru, March 6: కర్ణాటకలో (Karnataka) ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతి వేగంగా వచ్చిన కారు డివైడర్‌ను ఢీ కొట్టి బోల్తా పడిన కారును అతి వేగంతో వచ్చిన మరో కారు ఢీ కొంది. కర్ణాటక రాష్ట్రంలో బెంగళూరు-మంగళూరు జాతీయ రహదారిలో (Bengaluru-Mangaluru national highway) బైలాదకరే గ్రామంలో శుక్రవారం (మార్చి 6, 2020) తెల్లవారుఝామున 3 గంటలకు ఈ ఘోర రోడ్డు ప్రమాదం (Byaladakere village accident) చోటుచేసుకుంది.
హైదరాబాద్‌లో బయో డైవర్శిటీ ఫ్లైఓవర్‌పై ఘోర రోడ్డు ప్రమాదం
ఈ ప్రమాదంలో ఏడాది వయస్సున్న బాలుడుతో సహా 12 మంది మరణించారు. హాస్పటిల్‌లో మరో అబ్బాయి చనిపోయాడు. మరో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. అతివేగమే ప్రమాదానికి కారణంగా అధికారులు చెబుతున్నారు. కార్లు ఒకదానితో ఒకటి ఢీకొనగా ఈ ప్రమాదం జరిగింది.
నలుగురు ప్రయాణికులు బ్రెజ్జా కారు ధర్మస్థలానికి వెళుతుండగా, హోసూర్ మీదుగా బెంగళూరు వైపు వెళుతున్న తవేరా కారును ఢీ కొట్టింది. తవేరాలోని ప్రయాణికులు తమిళనాడు నివాసితులుగా గుర్తించారు.
Here ANI Tweet
Karnataka: At least 12 people lost their lives after two cars collided in Tumkur at around 3 am today. pic.twitter.com/GWe5mz08rm
— ANI (@ANI) March 6, 2020
మరణించిన వారిలో పది మంది తమిళనాడుకు చెందినవారు కాగా, మరో ఇద్దరు బెంగళూరుకు చెందినవారు. చనిపోయినవారిలో అయిదుగురు మహిళలు, ఇద్దరు చిన్నారులు ఉన్నారు. బైలాదాకెరి వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఘటనాస్థలి అంతా భీతావహంగా మారింది.
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా ప్రదేశానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.మృతుల కుటుంబాల సమాచారం అందించి.. మృతదేహాలను పోస్టుమార్టమ్ నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అతివేగమే ప్రమాదానికి కారణమై ఉంటుందని భావిస్తున్నారు. ప్రమాదంలో రెండు కార్లు నుజ్జునుజ్జయ్యాయి.