Bihar Train Accident: బీహార్‌ రైలు ప్రమాదం, మృతుల కుటుంబాలకు రైల్వేశాఖ రూ. 10 ల‌క్ష‌ల ప‌రిహారం,ప్రభుత్వం నుంచి రూ. 4 లక్షలు నష్ట పరిహారం

బీహార్‌లో బుధవారం రాత్రి ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఢిల్లీ నుంచి కామాఖ్య వెళ్తున్న నార్త్‌ ఈస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ బక్సర్‌ సమీపంలో పట్టాలు తప్పింది. ఈ ఘటనలో న‌లుగురు ప్ర‌యాణికులు మృతిచెందారు. మ‌రో 50 మంది గాయ‌ప‌డ్డారు.

North East Express Derails (PIC@ ANI X)

Patna, Oct 12: బీహార్‌లో బుధవారం రాత్రి ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఢిల్లీ నుంచి కామాఖ్య వెళ్తున్న నార్త్‌ ఈస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ బక్సర్‌ సమీపంలో పట్టాలు తప్పింది. ఈ ఘటనలో న‌లుగురు ప్ర‌యాణికులు మృతిచెందారు. మ‌రో 50 మంది గాయ‌ప‌డ్డారు. 23 బోగీలున్న రైలులోని 21 బోగీలు పట్టాలు తప్పాయి. మూడు బోగీలు పల్టీలు కొట్టాయి.

సమాచారం అందుకున్న రెస్యూ టీం సంఘటనా స్థలంలో సహాయక చర్యలు ప్రారంభించింది. బాధితులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పట్టాలపై నుంచి బోగీలను అధికారులు తొలగిస్తున్నారు. దెబ్బతిన్న ట్రాక్‌ పునరుద్దరణ పనులు చేపట్టారు.

రైలు ప్ర‌మాద బాధితుల‌కు ప‌ది ల‌క్ష‌ల రూపాయల న‌ష్ట‌ప‌రిహారాన్ని ఇవ్వ‌నున్న‌ట్లు రైల్వే శాఖ ప్ర‌క‌టించింది. గాయపడిన వారికి ఒక్కొక్కరికి రూ.50 వేల చొప్పున అందించనున్నట్లు పేర్కొంది.ఈ ప్ర‌మాద ఘ‌ట‌న ప‌ట్ల ఉన్న‌త స్థాయి విచార‌ణ‌కు ఆదేశించిన‌ట్లు రైల్వేశాఖ తెలిపింది. ఈ ప్ర‌మాదం ప‌ట్ల బీహార్ సీఎం నితీశ్ కుమార్ దిగ్భ్రాంతి వ్య‌క్తం చేశారు. ప్ర‌మాదంలో మృతిచెందిన వారిని ఉషా భండారి, ఆకృతి భండారి, అబూ జైద్‌, న‌రేంద్ర‌గా గుర్తించారు. బీహీర్‌ సీఎం నితీష్‌ కుమార్‌ కూడా మృతుల కుటుంబాలకు 4 లక్షల పరిహారం ప్రకటించారు.

బీహార్‌లో ఘోరరైలు ప్రమాదం, 4గురు మృతి, 50మందికి పైగా తీవ్రగాయాలు, కామాఖ్య వెళ్తుండగా పట్టాలు తప్పిన నార్త్ ఈస్ట్ ఎక్స్ ప్రెస్‌

రైలు ఘటనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ దృశ్యాలు చూస్తుంటే ప్రమాద తీవ్రత ఎక్కువగానే ఉన్నట్లు కనిపిస్తుంది. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే స్థానికులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకొని పట్టాలు తప్పిన బోగీల నుంచి ప్రయాణికులు బయటకు తీసేందుకు ప్రయత్నించారు.

రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ రైలు ప్రమాదంలో మరణించిన వారికి సంతాపం ప్రకటించారు. దెబ్బతిన్న పట్టాల పునరుద్ధరించే ప్రక్రియ పూర్తయ్యిందని పేర్కొన్నారు. సహాయక కార్యక్రమాలు కొనసాగుతున్నాయని తెలిపారు. అన్ని కోచ్‌లను తనిఖీ చేసినట్లు చెప్పారు. రైలు పట్టాలు తప్పడానికి గల కారణాలను కూడా పరిశీలిస్తామని, దీనిపై దర్యాప్తు చేస్తామని పేర్కొన్నారు.

12506 నెంబర్‌ గల నార్త్‌ ఈస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ బుధవారం ఉదయం ఢిల్లీలోని ఆనంద్‌ విహార్‌ టర్మినల్‌ నుంచి బయలు దేరింది. చివరి స్టేషన్‌ కామాఖ్యకు చేరుకోవడానికి 33 గంటల ప్రయాణించాల్సి ఉంటుంది. బక్సర్‌ స్టేషన్‌ నుంచి బయలుదేరిన అరగంట తర్వాత బుధవారం రాత్రి 9.53 గంటలకు రఘునాథ్‌పూర్‌ రైల్వే స్టేషన్‌కు వెళ్తుండగా రైలు ఒక్కసారిగా పట్టాలు తప్పింది. దాదాపు అన్నీ బోగీలు పట్టాలు తప్పాయి .

నార్త్‌ ఈస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ ప్రమాదంలో ఆ మార్గంలో ప్రయాణించే మొత్తం 40 రైలు ప్రభావితమయ్యాయి. 21 రైళ్లను దారిమళ్లీంచగా.. మరికొన్ని రైళ్లను రద్దు చేశారు. ఎలక్ట్రిక్‌ వైర్లు, పోల్స్‌, రైలు పట్టాలు ధ్వసం అయ్యాయని రైల్వే అధికారులు తెలిపారు. అయితే ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రైలు పట్టాలు తప్పడంతో సమాచారం, సాయం కోసం ప్రయాణికులకు రైల్వే అధికారులు అత్యవసర హెల్ప్‌లైన్‌ నెంబర్లు ఏర్పాటు చేశారు.

అత్యవసర హెల్ప్‌లైన్‌ నెంబర్లు 

పాట్నా రైల్వే స్టేషన్‌- 9771449971

ధనాపూర్‌ రైల్వే స్టేషన్‌- 8905697493

అర జంక్షన్‌- 8306182542

కమర్షియల్‌- నార్త్‌ సెంట్రల్‌ రైల్వేస్‌- 7759070004

ప్రయాగ్‌రాజ్‌

0532-2408128

0532-2407353

0532-2408149

కాన్పూర్‌

0512-2323016

0512-2323018

0512-2323015

ఫతేపూర్‌

05180-222026

05180-222025

05180-222436

తుండ్ల

05612-220338

05612-220339

05612-220337

ఇతావా

7525001249

అలీఘర్‌

2409348

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now

Share Now