Bus Stolen in Karnataka: ఏకంగా పార్కింగ్ చేసిన ఆర్టీసీ బస్సునే లేపేసిన కేటుగాళ్లు, కర్ణాటకలో మాయమై తెలంగాణలో ప్రత్యక్షమైన బస్సు

అయితే, కర్ణాటకలో (Karnataka) దొంగలు ఏకంగా ఓ బస్సును చోరీ (Bus stolen) చేశారు. కల్యాణ కర్ణాటక రోడ్ ట్రాన్స్ పోర్టేషన్ కార్పొరేషన్ (KKRTC)కు చెందిన ఓ బస్సు చోరీ కావడం కలకలం రేపింది. పార్కింగ్ ప్లేస్ లో బస్సు లేకపోవడంతో అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

KSRTC bus (Photo Credits: KSRTC website/ Representational Image)

Bangalore, FEB 22: సైకిళ్లు, బైకులు, కార్లు చోరీకి గురి అవుతుండడం గురించి మనం తరుచూ వింటుంటాం. అయితే, కర్ణాటకలో (Karnataka) దొంగలు ఏకంగా ఓ బస్సును చోరీ (Bus stolen) చేశారు. కల్యాణ కర్ణాటక రోడ్ ట్రాన్స్ పోర్టేషన్ కార్పొరేషన్ (KKSRTC)కు చెందిన ఓ బస్సు చోరీ కావడం కలకలం రేపింది. పార్కింగ్ ప్లేస్ లో బస్సు లేకపోవడంతో అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి కంప్లైంట్ ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. కర్నాటకలోని కలబురగి జిల్లాలోని చించోలి బస్టాండ్​లో పార్కింగ్ చేసి ఉన్న బస్​ను కొందరు KA-38 F-971 నంబర్ గల ఈ బస్సు.. బీదర్​ రెండో డిపోకు చెందినదిగా గుర్తించారు. ఈ బస్సు చించోలి – బీదర్ మధ్య రాకపోకలు (Chincholi bus stand) సాగిస్తోంది.

Jharkhand Elephant Kills 16 People: వామ్మో రాక్షస ఏనుగు! 12 రోజుల్లో 16మందిని తొక్కి చంపిన ఏనుగు, జార్ఖండ్‌లో ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బతుకుతున్న ప్రజలు, పలు జిల్లాల్లో కర్ఫ్యూ విధింపు  

చోరీకి గురైన బస్సు.. సోమవారం రాత్రి బీదర్​ నుంచి ప్రయాణికులతో చించోలికి వచ్చింది. ఆ తర్వాత 9.15 గంటలకు బస్ స్టాండ్​లో పార్కింగ్‌ చేశారు. ఉదయం బస్సును బీదర్ తీసుకెళ్లేందుకు ప్రయత్నించగా.. బస్సు కనిపించలేదు. దీంతో కంగుతిన్న డ్రైవర్​.. ఆర్టీసీ అధికారులకు సమాచారం అందించాడు. ఆర్టీసీ అధికారులు.. చించోలి పోలీసు స్టేషన్​లో ఫిర్యాదు చేశారు.

IPS vs IAS: ఆ ఇద్దరికీ షాకిచ్చిన కర్ణాటక ప్రభుత్వం, ఎలాంటి పోస్టింగ్ ఇవ్వకుండా బదిలీ చేస్తున్నట్లుగా ప్రకటించిన బసవరాజ్ బొమ్మై సర్కారు 

ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టారు. రెండు పోలీసు బృందాలను ఏర్పాటు చేసి చోరీకి గురైన బస్సును, నిందితుడిని వెతికారు. కర్ణాటక ఆర్టీసీ అధికారులు కూడా రెండు బృందాలను ఏర్పాటు చేసి గాలింపులు జరిపారు. అనంతరం తెలంగాణలో బస్ దొరికినట్లు పోలీసులు తెలిపారు. బస్సును దొంగిలించిన వారు మాత్రం దొరకలేదు. వారి ఆచూకీ తెలియాల్సి ఉంది.



సంబంధిత వార్తలు

Vijay on Amit Shah Comments: డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌పై అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై మండిపడిన హీరో విజయ్, కొంతమందికి అంబేద్కర్ పేరు అంటే ఎలర్జీ అని వెల్లడి

CM Siddaramaiah: అమిత్ షా వ్యాఖ్యలు రాజ్యాంగ నిర్మాతను అవమానించడమే, వీడియోని షేర్ చేస్తూ మండిపడిన కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య

Parliament Winter Session 2024: బీఆర్ అంబేద్కర్‌పై అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై క్షమాపణలు చెబుతూ రాజీనామా చేయాల్సిందేనని ఇండియా కూటమి డిమాండ్, కాంగ్రెస్ చీప్ ట్రిక్స్ ప్లే చేస్తుందని మండిపడిన బీజేపీ, వేడెక్కిన పార్లమెంట్ శీతాకాల సమావేశాలు

‘The Raja Saab’: ప్ర‌భాస్ ఫ్యాన్స్ కు ఒక గుడ్ న్యూస్, ఒక బ్యాడ్ న్యూస్, 80 శాతం పూర్త‌యిన రాజాసాబ్ షూటింగ్..టీజ‌ర్ పై టీం ఏమందంటే?

00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif