Several Trains Cancelled: ఈ రైళ్లు రద్దయ్యాయి, హౌరా నుంచి విజయవాడ మీదుగా వెళ్లే 24 రైళ్లు రద్దు, ప్రయాణికుల కోసం విజయవాడ రైల్వేస్టేషన్లో ప్రత్యేక సమాచార కేంద్రం, పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఈశాన్య రాష్ట్రాల్లో చెలరేగుతున్న అల్లర్లు

కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన పౌరసత్వ సవరణ చట్టానికి(Citizenship Amendment Act) వ్యతిరేకంగా ఈశాన్య రాష్ట్రాల్లో (East Coast) చెలరేగుతున్న అల్లర్లు తీవ్ర రూపం దాల్చుతున్నాయి. నిరసనకారులు తమ ఉద్యమాన్ని హింస దిశగా(Violent protests) తీసుకెళుతున్నారు. ప్రభుత్వ ఆస్తులకు ధ్వంసం కలిగిస్తున్నారు. రైళ్లకు నిప్పు పెడుతున్నారు.

CAA protests: Several trains cancelled, short-terminated, diverted in Assam (photo-ANI)

Vijayawada, December 16: ఈశాన్య రాష్ట్రాలు నివురగప్పిన నిప్పులా మారాయి. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన పౌరసత్వ సవరణ చట్టానికి(Citizenship Amendment Act) వ్యతిరేకంగా ఈశాన్య రాష్ట్రాల్లో (East Coast) చెలరేగుతున్న అల్లర్లు తీవ్ర రూపం దాల్చుతున్నాయి. నిరసనకారులు తమ ఉద్యమాన్ని హింస దిశగా(Violent protests) తీసుకెళుతున్నారు. ప్రభుత్వ ఆస్తులకు ధ్వంసం కలిగిస్తున్నారు. రైళ్లకు నిప్పు పెడుతున్నారు.

ఈ నేపథ్యంలో రైల్వేశాఖ పలు రైళ్లను రద్దు చేసింది. అలాగే మరికొన్నింటిని దారి మళ్లించింది. అసోంలోని వివిధ ప్రధాన స్టేషన్లతో పాటు హౌరా నుంచి విజయవాడ మీదుగా వెళ్లే 24 రైళ్లు(27 trains were cancelled) రద్దయ్యాయి. బుధవారం వరకు ఈ రైళ్లను రద్దు చేస్తున్నట్లు ఈశాన్వ రైల్వే శాఖ తెలిపింది.

రద్దయిన రైళ్ల వివరాలు

నంబర్‌ 12840 (చెన్నై–హౌరా), 12842 (చెన్నై–హౌరా), 12864 (యశ్వంత్‌పూర్‌–హౌరా), 20889 (హౌరా–తిరుపతి), 22877 (హౌరా–ఎర్నాకుళం), 12841 (హౌరా–చెన్నై), 12245 (హౌరా–యశ్వంత్‌పూర్‌), 18645 (హౌరా–హైదరాబాద్‌), 20890 (తిరుపతి–హౌరా హమ్‌సఫర్‌), 22878 (ఎర్నాకుళం–హౌరా), 12246 (యశ్వంత్‌పూర్‌–హౌరా), 18646 (హైదరాబాద్‌–హౌర్టా), 22852 (మంగుళూరు–సంత్రగచ్చి), 12513 (సికింద్రాబాద్‌–గౌహతి), 22502 (న్యూ తీన్‌సుకియా–బెంగళూరు), 06010 పాండిచ్చేరి–సంత్రగచ్చి, 18048 (వాస్కోడిగామా–హౌరా), 22812 (మైసూర్‌–హౌరా) ఎక్స్‌ప్రెస్‌లున్నాయి.

అలాగే 12666 (కన్యాకుమారి–హౌరా), 12253 (యశ్వంత్‌పూర్‌–భాగల్పూర్‌), 02842 (చెన్నై–సంత్రగచ్చి స్పెషల్‌), 12704 (సికింద్రాబాద్‌–హౌరా) ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను పాక్షికంగా రద్దు చేశారు. దారి మళ్లించిన రైళ్లలో 22641 (త్రివేండ్రం–షాలిమార్‌), 22832 సత్యసాయి ప్రశాంతి నిలయం–హౌరా ఎక్స్‌ప్రెస్, 12863 (హౌరా–యశ్వంత్‌పూర్‌) ఉన్నాయి. ప్రయాణికుల సౌకర్యార్థం విజయవాడ రైల్వేస్టేషన్లో ప్రత్యేక సమాచార కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.